కోడలు దిద్దిన కాపురం - ఉషాభగవతి పేరి

kodalu diddina kapuram

సృష్టి లో అతి అందమైన రచన మానవ జన్మ. జనన మరణాల పరమార్ధమేంటో ఆ దేవుడికే తెలియాలి. పుట్టుక, మరణం ఈ రెండు మన చేతుల్లో లేవు.

ఒక ప్రాణం పోయిందంటే దాని వెనక ఎన్ని జీవితాలు ముడిపడి ఉంటాయి అన్నది ఆలోచిస్తేనే ఎదో అలజడి మనసులో. అంతే కాకుండా గుండెల్లో విపరీతమైన భయం చోటు చేసుకుంటుంది. సంతోషంగా ఉన్న ఒక కుటుంబం ఎలా చెల్లా చెదురైపోతుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది . అలాంటి ఒక ఇంటి కథే ఈ మన " కోడలు దిద్దిన కుటుంబం".

ఝార్ఖండ్ (బిహార్) రాష్ట్రం, ఎక్కడో మారుమూల గ్రామం లో వెంకటేశ్వర రావు, తన ముచ్చటైన కుటుంబం తో జీవనం సాగిస్తున్నారు. సగటు ప్రభుత్వ ఉద్యోగి ఆయన, చాలీ చాలని జీతం తో జీవితం పై ఏ మాత్రం నిరాశ చెందకుండా సంసార సాగరం లో పడుతూ లేస్తూ పయనం సాగించే రోజులవి. ఎనిమిది మంది సంతానం ఆయనకి. భార్య భానుమతి, ఆదర్శ గృహిణి గా, భర్తకు నీడ గా ఆయన వెంటే ఉంటూ, మృదుభాషిని, కోపాన్ని కన్నీళ్ళతో దిగజార్చుకుని, మాటరాని మౌనం తనది.

పిల్లల సంతోషాల్లోనే తమ సంతోషాలు వెతుక్కుంటూ,ఒడి దుడుకులు తట్టుకుంటు, జీవనం సాగిస్తున్నారు. అటు పుట్టిల్లు, ఇటు అత్తవారిల్లు రెండు పెద్ద కుటుంబాలే వెంకటేశ్వర రావు గారివి. క్రమశిక్షణ తో పిల్లల్ని పెంచేరు. ఆయనకి కొంచం కోపం కూడా ఎక్కువే. చిన్న ఊరు అవ్వడం తో పిల్లల చదువులు చుట్టాలు ఇళ్లలో పెట్టి చదివించేరు. అన్ని బాగానే ఉన్నాయి అనుకునే సమయంలోనే ఇంట్లో అపశృతి చోటు చేసుకుంది. భానుమతి గారూ అనారోగ్యంకి గురి అయ్యేరు. ఎన్ని ఆసుపత్రులు చూపించిన నయం కానీ పరిస్థితి. అటు భార్య వైద్యం కోసం తిరగని ఊరు లేదు, చూపించని వైద్యుడు లేడు.

ఒక పక్క పిల్లల భాద్యత,మరొక పక్క భార్య అనారోగ్యం, దేనినుండి తప్పించుకోలేని పరిస్థితి, బాధలన్నింటిని తన కర్మ ఫలం అని మనో ధైర్యం తో భాద్యతలు నిర్వర్తించేరు. చుట్టాలు, ఇరుగుపొరుగు వాళ్లంతా పిల్లల కి చాలా సహాయ సహకారలందించేరు, కానీ ఏం లాభం లేకపోయింది. భానుమతి గారు కన్ను మూసేరు.

వెంకటేశ్వర రావు గారి కళ్ళ ఎదుట అంధకారం కారు మబ్బుల్లా చోటు చేసుకుంది . నాది, నా పిల్లలది ఇప్పుడేం పరిస్థితి అన్న ప్రశ్న పదే పదే ఆయన్ని కృంగిస్తోంది. భార్య అంతక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చి సొమ్మసిల్లిపోయేరు . ఇక పై ఏంటి అన్నది పాలు పోవటంలేదు ఆయనకి. పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళని ఎలా పెద్ద చెయ్యాలి అవే ఆలోచనలు మనసు నిండా. చివరికి ఆ ఊరు విడిచి వెళ్లిపోవాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నో జ్ఞపకాలు ఆ ఊరితో ఆయనకి. భార్య, బిడ్డలతో గడిపిన ఎన్నోఒక్క క్షణంలో కళ్ళముందు కారు చీకటి కమ్ముకుంది . గుండెనిండా బాధతో, చెరగని స్మృతులతో, పిల్లల్ని తీసుకుని ఆ ఊరు నుండి , అక్కడ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న ఇరుగు పొరుగు వారితో కన్నీటి వీడ్కోలు తీసుకున్నారు.

వెంకటేశ్వర రావు గారి పెద్దబ్బాయి బ్యాంకు ఉద్యోగి. అమ్మ అంటే చాలా అభిమానం తనకి. మిత భాషి, తండ్రి మాటే తన మాట గా మసీలేవాడు. తల్లిని పొగుట్టుకుని పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్న పెద్దబ్బాయి దగ్గరకి వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుని రూర్కెలా పట్టణానికి పిల్లలతో వచ్చేసారు.

కొత్త ఊరు, వాతావరణం, మనుషులు, అలవాటు పడడానికి కొంచం సమయం పట్టిన అందరూ మెల్లగా అలవాటు పడడానికి ప్రయత్నించారు.

పిల్లల్ని స్కూళ్లలో వేసేరు. రోజులు నెలలు, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి, రోజులు వేగంగా గడిచిపోయాయి. పెద్దబ్బాయి కి పెళ్లి చేద్దామని పెద్దల సహకారంతో అమ్మాయిల వేట మొదలుపెట్టారు వెంకటేశ్వర రావుగారు. ఎన్నో సంబంధాలు వచ్చేయి, ఆస్తి, అంతస్తు కి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన, నాలుగు గోడల ఇల్లుని ఒక అందమైన హరివిల్లు గా మార్చే కోడలు రావాలని ఆయన తపన.

చివరికి పార్వతీపురం వాస్తవ్యులు సంబంధం ఖాయం చేసుకున్నారు. అంగ రంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసేరు, ఆ ఇల్లు మళ్ళీ కళాకాంతులతో వెలిగింది , అందరికి ఒక ఆడ దిక్కు దొరికింది.

కోడలు పేరు లలిత. వాళ్ళ కుటుంబం లో అందరికన్నా చిన్నమ్మాయి. తల్లి చాటు బిడ్డ. ఎక్కువగా భాద్యతలు అంటూ లేవు తనకి పుట్టింట్లో. కానీ పెళ్లి అన్న రెండు అక్షరాలు, మూడు మూళ్ళ బంధం ఆమె పై బోలెడు భారాలు, కర్తవ్యాలు తెచ్చిపెట్టాయి. చిన్న ఆడపడుచులు, పెళ్లి కావల్సిన ఆడపడుచులు, మరిదిలు, మావగారు, ఒక్కసారి ఆవిడ కళ్ళముందు ప్రపంచం అంతా తలకిందులుగా ఎదురైయింది.

నేను చేయగలనా, ఎలా? అని తనకి తానే ప్రశ్నించుకుంది. ఓర్పు, సహనం తన ఆభరణాలుగా మార్చుకుంది. లలిత, తన పేరుని సార్థకత కలిపించే వ్యక్తిత్వం తనది. అందరిని మర్యాద, మంచితనం, గౌరవ అభిమానాలతో ఆకట్టుకుంది. అందరి నోట నాలిక గా, ఇంటి పెద్దగా భాద్యతలు చేపట్టారు. అంతా తనవాళ్లనే భావన ఆవిడలో. కొత్త ఇంట్లో అందరూ కూడా తనని ఎంతో గౌరవంతో, ఆప్యాయత తో ఆదరించేరు. తల్లి కి బదులుగా తల్లి లా చూసుకున్నారు ఇల్లుని, పిల్లలందర్ని.

అందర్నీ మంచి చదువులు చదివించి విద్యా వంతులుగా చేసి, సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా చేసేరు. ఆడపిల్లలందరికి మంచి మర్యాద, అత్తవారిల్లాలో ఎలా మసులుకోవాలో నేర్పి, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేరు. మరుదులు కి ఉపనాయనాలు చేసి, పెళ్లిళ్లు చేసి కొత్త మనుషులు తో సంబంధాలు ఎలా కలుపుకోవాలో, వాళ్ళని మనలో ఒకరిలా ఎలా భావించాలో నేర్పించేరు.

ఆడపడచులని అప్పచెల్లిల్లుగా చూసుకుని వాళ్ళని తీర్చి దిద్ధి కోడలిగా ఆమె ధర్మం ఆవిడ నెరవేర్చేరు. నాలుగు గిన్నెలున్నాక చప్పుడు అవ్వడం సహజమే . కానీ ఎన్ని ఒడి దుడుకులున్నా ఇంటి గడప దాటానివ్వకుండా అన్ని సర్దుకుంటు ఆ కుటుంబానికి ఒక బహుదూరపు బాటసారిలా నడుస్తూ, ఆ సంసారాన్ని చక్కదిద్ది అందర్నీ మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ లలితదే.

ఈ రోజు అందరూ మంచి స్థాయిల్లో జీవిస్తున్నారంటే దానికి కారణం ఆమె అని చెప్పడంలో ఏ ఒక్కరు వెనుకాడరు. ధన్యోస్మి ఆ కుయుమ్భం ఆవిడ అడుగుజాడల్లో వృద్ధి చెందినందుకు. ఎన్ని జన్మలెత్తిన, ఆమెకు శిరసా నమామి, మనసా స్మరామి.

ఆ వెంకటేశ్వర రావు గారి దంపతులు ఏ లోకాల్లో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దిన ఆ కోడలికి శతకోటి వందనాలు.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ