Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర



జరిగిన కథ : ట్రైన్ చాలాదూరం ప్రాయాణించిన తర్వాత దిగి మొజార్ట్ ప్లేస్ కి చేరుకుంటారు, జీవన్, యోగి తదితరులు..అతడిగురించి ఎవర్నడిగినా తెలీదనడంతో ఆశ్చర్యపోతారు.మొత్తానికి అతడితాలూకూ జ్ఞాపకాల మ్యూజియం ఉన్న వీధికి చేరుంటారు..ఇరుకైన సందులగుండా ప్రాయాణించి మొజార్ట్ జీవించిన ఇంటిని దర్శించగానే జీవన్ మనసంతా అదోలా అయిపోతుంది..ఆ తర్వాత....

1747 నించి 1773 దాకా మాత్రమే మొజార్ట్ ఫామిలీ మెంబర్స్ ఆ ఇంట్లో ఉన్నారట. క్రిందికి నడుస్తుండగా ఒక విషయం గుర్తుకొచ్చింది జీవన్ కి. ఇళయరాజా గారి దగ్గర పరిచయమైన వయోలినిస్ట్ నర్సిమ్మన్ గారు చాలా ఏళ్ళ కిందట చెప్పారు. ఆనాడు మొజార్ట్ వాడిన వయోలిన్ తో అతని సింఫనీలు కొన్ని వాయించారట. ఇప్పుడు అతని బర్త్ ప్లేస్ లో అవి అమ్ముతున్నారట.

అదొక ఫాన్సీ షాప్ లాగుంది. అక్కడున్న పెన్సిళ్ళకీ, యాష్ ట్రేలకీ, దువ్వెనలకీ, కీ చైన్స్ కీ, ఉంగరాలకీ, బొంగరాలకీ, అన్నిటికీ మొజార్ట్ పేరు పెట్టి అమ్మెయ్యడం కొంచెం బాధగా అనిపించింది యోగికి.

నర్సిమ్మన్ చెప్పిన కేసెట్ గురుంచి అడిగాడు జీవన్.

అతని లివింగ్ ప్లేస్ లో దొరుకుద్ది అన్నాడు సేల్స్ మెన్. అదెక్కడా అంటే ఈ అపార్టుమెంట్స్ దిగాక ముందుకెళ్తే ఒక సందు వస్తుంది, దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తే ఒక కాలువ కనిపిస్తుంది. ఆ కాలువకి రెండు పక్క పక్కనే రెండు బ్రిడ్జీలు ఉంటాయి. ఒకటి వాహనాలు వెళ్ళేది, రెండోది మనుషులు నడిచేది. ఆ బ్రిడ్జీలు దాటి వెళ్తే ఒక థియేటర్ (సునిమా థియేటర్ కాదు, మ్యూజికల్ డ్రామాలూ, ఒపేరా సింగింగ్ ప్రోగ్రామ్స్ తాలూకు థియేటర్ అది) కనిపిస్తుంది. అది కూడా దాటండి మెయిన్ రోడ్డు తగుల్తుంది. దాని ఎడం పక్క హోటల్ బ్రిస్టల్ కుడి పక్కన మొజార్ట్ లివింగ్ ప్లేస్.

ఏ అవస్థా పడకండా అక్కడికెళ్ళాం.

మూడు వందల ఏళ్ళనాటి ఒక పురాతన భవనం. దాని మీద MOZART WOHNHAUS అని రాసుంది జర్మన్ లో.టిక్కెట్టుంటే మేం రాము అన్నారు మాతో వచ్చిన జార్జి ప్రసాదూ, చందర్రావూ, గోవిందూ.

లోపలికెళ్ళడానికి అయిదున్నర యూరోలట. రెండు టిక్కెట్లు కొన్నాడు జీవన్. టిక్కెట్లిస్తూ ఆ లేడీ “ఇంగ్లీష్..?” అంది. అవునన్నాడు జీవన్.

కార్డ్ లెస్ ఫోన్ రిసీవర్ లాంటిది తీసి దానికున్న చాలా బటన్స్ లో ఒకటి నొక్కి వాళ్ళకిచ్చి ఇందులోంచి ఇంగ్లీష్ లో కామెంట్రీ వస్తుంది వింటూ వెళ్ళండి అంది. చెవి దగ్గర పెట్టుకుని వింటూ నడుచుకుంటూ పైకెళ్ళారు. ముందు మొజార్ట్ మ్యూజిక్ తర్వాత కామెంట్రీ స్ట్రార్టయ్యింది. మొజార్ట్ లైఫ్ టైమ్ లో గొప్ప వర్క్. రెండు వందల సింఫనీలు ఈ ఇంట్లోనే రాశాడంట.

పైన మొజార్ట్ వాయించిన గ్రేండ్ పియానో, రాసుకునే టేబులూ కుంచె ఇంకు బుడ్డీ స్వదస్తూరీతో ఉన్న సింఫనీ నోట్సూ, వాడిన బెడ్డూ, చెయిరూ బాత్ రూమూ లాంటి వన్నీ ఉన్నాయి. ఆరున్నర ట్రైనుకి టైమయింది. తన వల్ల తక్కిన వాళ్ళు ఇబ్బంది పడతారు అన్న ఒక వర్రీలో మొత్తం అంతా చూసి దిగి వస్తున్నాడు జీవన్. వరల్డ్ గ్రేటెస్ట్ కంపోజర్ మొజార్ట్. పియానో సొనాటా నెం.11, సింఫనీ 41 జూపిటర్, సింఫనీ 626, పియానో కాన్సెర్ట్ 21, సింఫనీ 40 (మోల్ట్ అతిగో) రాసి అతి చిన్న వయసులో మరణించిన ఆ మహానుభావుడి భవనంలోంచి బయటికొస్తూ కింద స్టోర్స్ లో వాళ్ళకి కావాల్సిన సి.డి లు అడిగితే చూపించారు. ఒకోటీ 22 యూరోలు యోగి కొన్నాడు. తిరిగి స్టేషన్లో కొచ్చాక అందరికీ టిక్కెట్లు యోగే కొన్నాడు.

ట్రైన్ కి ఇంకా అరగంట టైముంది. అక్కడొక షాపులో ఫ్రెండ్ కోసం గమ్మత్తయిన బ్లాక్ అండ్ వైట్ కేలెండర్ కొనడానికి వెళ్ళాడు యోగి. చవగ్గా ఏం దొరుకుతుందా అని వెతుకుతుంటే నల్లటి ముసుగులో నీలి కళ్ళ గ్రాప్ కనిపించింది. అంతే, షాకయిపోయేడు జీవన్. షహనాజ్ కళ్ళు ఇక్కడికెలా వచ్చాయి అనిపించింది. వెంటనే కొనేసేడు. షహనాజ్ ఎప్పటికయినా తన సంపూర్ణ దర్శనం ఇస్తుందో లేదో నోరు విప్పి అడిగేస్తే..?? అది కరెక్టయిన పని కాదు.

కాస్సేపట్లో ట్రెయిన్ ఎక్కబోతున్న ఒక ప్రియుడు, ప్రియురాల్ని విడవలేక చాలా గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. పుష్టిగా ఉన్న అమ్మాయి మట్టుకి అతని కోసం కౌగిలించుకుంది గానీ కొంచెం అనీజీగా ఫీలవుతుంది. దూరం నించి వస్తున్న ఒక అమ్మాయిని కళ్ళతోనే రమ్మని సైగ చేస్తుంది.

ఆ అమ్మాయి కేవలం యాక్ట్ చేస్తుందని అనుమానించిన ఆ ప్రియుడు గొడవకు దిగాడు. ఆ పిల్ల అతన్ని కన్సిన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్లాట్ ఫారం వేపు నడిచేరు.

అనుకున్న టైముకి వచ్చాగింది రైలు.

వచ్చేటప్పటిలాగ కాకండా ఎవరికి దొరికిన సీట్లో వాళ్ళు కూర్చున్నారు. జీవన్ కి ఎదురుగా ఉన్న అమ్మాయి పొడుగాటి చాక్లెట్టు తింటూ డిస్క్ మెన్ లో మేరియాక్యూరీ పాటలు వింటుంది.

కూఫ్ స్పెయిన్ దాటాకా బాత్ రూమ్ దగ్గర కెళ్ళాడు జీవన్. తలుపు లోపలికి వేసుకుంది. లోపల ఇంటర్ కోర్స్ తతంగం జరుగుతుంది. ఆ కేకలూ మూలుగులూ జర్మన్ లో ఏవో పదాలు బయటికి వినిపిస్తున్నాయి. నా పక్కనించెళ్ళిన ఇద్దరు మనుషులు  వాటినేం పట్టించుకోకండా వెళ్ళిపోతున్నారు.

కాస్సేపటికి బయటికొచ్చిన ఆ జంట చాలా మాములుగా వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు.

ట్రెయిన్ “జిల్లర్ తాల్ బన్” దాటాకా వచ్చిన గోవిందు “జార్జి ప్రసాదు గారూ, వాళ్ళు రెస్టారెంట్లో ఉన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారు” అన్నాడు.వెళితే రాడ్లర్ బీరు తాగుండగా రాత్రి ఎనిమిదయ్యింది. అయినా చీకటి పడలేదు.కరక్ట్ గా ఎనిమిదిన్నరకి ఆగింది ట్రయిను.కెసినో కెళ్ళి జాస్తి చౌదరి గారు వస్తే తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు జార్జి ప్రసాదు. సరే అనేసి బయల్దేరారు.కోటు లేకుండా కేసినో లోపలికి రానివ్వరు. ఇది గవర్నమెంటు రూలు. రిసెప్షన్ కౌంతర్లో అమ్మాయి వీళ్ళ పాస్ పోర్టులు తీసుకుని కోట్లు ఇచ్చింది.పైకెళ్ళారు.ఆకాశంలో నక్షత్రాల్లా సీలింగ్ డెకరేషన్.

ఎక్కడెక్కడినించో జనం. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోతూ వస్తూ పోతున్న అమ్మాయిలూ, అబ్బాయిలూ... కోట్లలో గేంబ్లింగ్ జరుగుతుందక్కడ. ప్రొద్దుట చూసింది జస్ట్ శాంపిల్ అంతే.

ఆడుతున్న ఒకడికి మెషిన్ లో 777 వచ్చాయి. అలా వస్తే వెయ్యి యూరోలు. మన లెక్కలో యాభై వేలు. అది చూసిన చందర్రావు “ఒరే గోవిందూ ఈ ట్రిప్పులో చాలా డబ్బులు తగలేస్తున్నాం గదా..? ఇక్కడ ప్రతీదీ రేటెక్కువే అవునా...?” అన్నాడు.

ఔనన్నాడు గోవిందు.

పద మనం కూడా ఓ మిషను దగ్గరికెళ్ళి ఆడదాం అని జేబులోంచి అయిదు యూరోల నోట్లు మెషిన్లో పెట్టి ఆడ్డం మొదలెట్టాడు.ఆరంభంలోనే పదిహేను యూరోలొచ్చాయి.

“మీది భలే హేండండీ” అన్నాడు గోవిందు.

“మీకు నా గురించి బొత్తిగా తెల్దు. మా రాజమండ్రిలో ఎవరు ఏం బిజినెస్ ఓపెన్ చేసినా నన్నే పిలుస్తారు. చంటి పిల్లకి అన్న ప్రాసన చేయించేటప్పుడు నేను లేకుండా చేయించరు తెల్సా..? ద్వారపూడి సంతలో ఎన్ని బట్టల కొట్టులు మన చేత్తో ఓపెన్ చేయించేను...” అని చాలా గొప్పగా అంటా మళ్ళీ మిషను ముందు కూర్చున్నాడు.

పావు గంటలో రెండొందల యూరోలు పోయే సరికి గొళ్ళుమన్నాడు.

ఇంకో గంట తర్వాత అంతా బయటికొచ్చేరు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattiste koti