Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Senior Citizens and Internet by Bhamidipati

ఈ సంచికలో >> శీర్షికలు >>

జీవన నాణెం - చెక్కా చెన్నకేశవరావు

jeevana nanem

బొమ్మ: అప్పు ఇస్తే వడ్డీ బాగా వస్తుంది గదా అని హుషారు.                             
బొరుసు: అసలుకే మోసం వస్తుందేమో అని గుండె బేజారు.

బొమ్మ: పలావు, ఉల్లి దోసెలు తినాలనే కోరికతో అబ్బ, నోరూరుతుంది. 
బొరుసు: ఉల్లి, వెల్లుల్లి ధరలు తలుచుకుంటే కన్నీరు బొట, బొటా కారుతుంది.

బొమ్మ: కుందనపు బొమ్మలాంటి కోడలు బోలెడు కట్న, కానుకలు తెస్తుంది. అని సంతోషం.
బొరుసు: కుహనా ఎత్తులతో తమనుండి కొడుకును గ్రద్దలా తన్నుకుపోతుందేమో అని ఒకటే బాధ.

బొమ్మ: అందమైన అమ్మాయిని చూస్తుంటే హార్ట్ బీట్ పెరుగుతుంది.
బొరుసు: కండలు పెంచిన ఆమె అన్నను తలచుకొంటేనే హార్ట్ బీట్ ఆగిపోతుంది.

బొమ్మ: అమ్మ, నాన్న ల ఆస్తిలో అధిక వాటా తనకే కా(రా)వాలని ఆరాటం.
బొరుసు: ఆస్తి కోసం ఆశపడితే, వాళ్ళు మంచానపడితే, ఆ పాకీ చాకిరీ ఎన్నేళ్ళు చేయాలో అని బెంగ.

బొమ్మ: ప్రియురాలి ప్రాపకం కోసం ఉన్నదంతా ఊడ్చి ఇవ్వాలని తీరని తపన.
బొరుసు: చివరకు 'రక్త కన్నీరు' నాగభూషణంలా తన పరిస్థితి మారితే దిక్కెవరు అని రోదన.

బొమ్మ: ఆస్తి అమ్మైనా సరే అబ్బాయిని అమెరికా అం(పం)పించాలని అతి గాడమైన ఆశ.
బొరుసు: తీరా అమెరికాలో సెటిల్ అయ్యి దొరసానితో దోస్తీ కట్టి ఆమెనే సెటప్ చేసుకుని అక్కడే సెటిల్ అవుతాడేమో అని నిరాశ.

బొమ్మ: అందమైన అమ్మాయి, ఉన్నత ఉద్యోగం, ఆస్తి, అంతస్తు ఉన్నా, తనే అందగాడని తననే చేసుకుంటానంటే హిప్, హిప్, హుర్రే!!
బొరుసు: నైస్ స్మైల్, స్టైలిష్ స్టెప్పింగులతో అలా అలా షాపింగ్ కు వెళ్తే అందరి కళ్ళూ తన భార్య పైనే ఉంటాయేమో అని ఈనో(ENO) ఇగో (EGO), పాపర్ అయిన తనను క్రేచర్ లా కించపరుస్తుందేమో అనే జావగారి జామ్ అయిపోవడం.

బొమ్మ: బ్యూటీ ఫుల్ లేడీ కొలీగ్ కేవలం, తననే లైక్ చేస్తుందంటే, ఎన్నెన్నో కలర్ ఫుల్ అండ్ స్వీట్ డ్రీమ్స్.
బొరుసు: ఏ మూడ్ లో ఎలా తన మైండ్ సెటప్ మార్చుకుని, సెల్ ఫోటో తీయించి, మీడియాలో గడ్ బిడ్ చేస్తే, చిప్పకూడు ప్రాప్తమవుతుందే అని, లైఫ్ మటాష్ అనే వాస్తవిక దృక్పధంలో కళ్ళు తెరపి.

బొమ్మ: ఆరు అంకెల జీతగాడు, ఆరడుగుల అందగాడు కట్నం లేకుండా తాళి కడతానంటే తనంత అదృష్టవంతురాలు ఇలలో వేరెవరూ ఉండరనే ఉత్సాహం.
బొరుసు: అతగాడికి కెపాసిటీ ఉందో, లేదో అనే మీ మాంస, ఎయిడ్స్ లాంటివి ఉన్నాయేమో అనే ఆందోళన, నేను తప్ప మరెవరూ లేరా అనే నిరుత్సాహంతో నీరసం.

ఇదండీ, మన జనం జంతర్ మంతర్ ఆలోచనా సరళి.
అంచేత అయ్యా, అమ్మా, అన్నా, అక్కా, గురూ, బ్రదర్
జర భద్రం!!!

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi