Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: భూషణ్ అంకుల్, నీరూఆంటీ, శారదమ్మగారితో   మాట్లాడుతూ హాల్లో కూర్చుంటారు. విష్ చేసి, వెళ్లి వారికెదురుగా చంద్రకళ కూర్చుంటుంది. డిసెంబర్ పదిహేనో తేదీ నుండి, టెలి-ఫిలిం  ఆడిషన్స్ మొదలవుతాయని తన స్క్రీన్ టెస్ట్ – రెండు సెషన్స్ గా, రెండురోజుల పాటు  ఉండవచ్చని భూషణ్ అంకుల్ చెప్తారు...చంద్రకళకి... క్రిస్టమస్ సెలవలే కనుక ఆలోచించి చెబితే,  మీ వీలుని బట్టి డేట్స్ ఫిక్స్ చేద్దాము అని వెళ్ళిపోతారు. ఆ తరువాత.. 

 

 

రెండవ రోజు ఆడిషన్స్ కి – టెలిఫిలిం లోని ‘కల్యాణి’ పాత్రకి సంబంధించి, కొత్త రకం గెటప్ వేయించారు.  తేజశ్విని మేడమ్ దగ్గరుండి స్టిల్ల్స్ తీయిస్తే, డైరెక్టర్ గారు డైలాగులు చెప్పించారు..

పనయి, మేము వెళ్ళిపోయే ముందు మా వద్దకు వచ్చారు తేజశ్విని మేడమ్.  “ఈ అబ్బాయి ఎవరు?  అచ్చం మా అబ్బాయి ‘విక్రమ్ లా ఉన్నాడు.  నిన్న చూసినప్పుడే అనుకున్నాను,” అడిగిందామె జగదీష్ వంక చూస్తూ..

“మా అన్నగారబ్బాయి జగదీష్ బాబు.  అన్నయ్యా వాళ్ళు ఢిల్లీ లో ఉంటారు,” చెప్పింది అమ్మ.

“మరి ఈ యంగ్ హీరో ఎవరు? దిస్ గుడ్-లుకింగ్ బాయ్,” అంది వినోద్ ని చూస్తూ..

“వాడు మా అబ్బాయే, వినోద్ బాబు,” అంది అమ్మ.

దగ్గరగా వచ్చి, నా తలపై చేయి వేసారామె. “చూడమ్మా చంద్రకళా, నిన్ను చూస్తే ఆనందంగా ఉంది.  నీ అంతప్పుడు, నృత్యం పట్ల నేనూ ఇలాగే క్రమశిక్షణతో, ఆసక్తితో ఉండేదాన్ని.  విష్ యు గుడ్ లక్,”  అంటూ అమ్మకి ఓ కవర్ అందించారామె.

“ఇందులో మా ప్రాజెక్ట్ వివరాలున్నాయి.  ఆడిషన్  చేసిన వారందరికీ ఇచ్చే సమాచారం.  హైదరాబాదులో కూడా మా పనయ్యాక,  మన భూషణ్ గారితో మాట్లాడుతాను,” అన్నారామె.

**

ఇంటికి వస్తూ, తేజశ్విని మేడమ్ గురించే మాట్లాడుకున్నాము.  వినోద్ కి కూడా ఆమె చాలా నచ్చిందట. 

“తేజశ్విని మేడమ్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ ని మీట్ అయినందుకు సంతోషంగా ఉంది,” అంటూ నా వంక చూసాడు జగదీష్...

“నువ్వు ఫ్యూచర్ లో ఆమె లాగా అవ్వాలి. షి షుడ్ బి యువర్ రోల్-మాడల్,” అన్నాడు.

“అవునమ్మా చంద్రా! కళాకారిణిగా, నాట్యరంగంలో  తేజశ్విని గారి వారసురాలివైతే,  మనకింకేమి కావాలి?  ఆమె  గొప్ప కళాకారిణే కాదు,  ఓ  పరిపూర్ణ  వ్యక్తి,” అంది అమ్మ. 

“మేమంతా నీకు ఫుల్ సపోర్ట్.   భూషణ్ అంకుల్ మాత్రం నీకు బిగ్గెస్ట్ సపోర్టర్, తెలుసా?  అందుకే, ఆ రాణి జెలసీగా ఫీల్  అవుతుంది.  అయినా, పట్టించుకోకుండా, ఆయన మీ ఇద్దరి విషయంలో ప్లాన్స్ వేస్తూనే ఉంటారు,” నవ్వుతూ జగదీష్.

‘ఈ రెండు రోజులు నన్ను ఎంకరేజ్  చేస్తూ, జగదీష్ మా వెంట ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.  చాలా మంచోడు జగదీష్.

లైక్ హిమ్, హి ఇజ్ స్వీట్ అనుకున్నాను.

**

ఆవురావురుమంటూ లంచ్ తినేసి, హాల్లో ఉన్న సోఫాల్లో సెటిల్ అయిపోయాము.  కామాక్షి కోసం ముందు తలుపులు వోరగా తీసి, అమ్మ, తన రూములోకి వెళ్ళిపోయింది.

అందరం అలిసిపోయున్నాము.... జగదీష్, వినోద్ క్రికెట్ వాచ్ చేస్తూనే, పది నిముషాల్లో నిద్రకి పడ్డారు.  చేసేది లేక, ఛానల్ మార్చుకొని మూవీ చూస్తూ పడుకున్నాను. 

**

ఉన్నట్టుండి నా వెనుక అడుగుల చప్పుడికి తల తిప్పి చూసాను.  రాణి నిలబడి ఉంది. 

తన క్లాస్ టైం కంటే ముందే వచ్చింది రాణి.  మాట్లాడవద్దని సైగ చేసింది. 

వెళ్ళి సోఫాలో పడుకునున్న జగదీష్ పక్కనే కూర్చుని, “హాయ్ ఫ్రెండ్, నిద్రలే,  నిన్ను

చూడ్డానికే ముందుగా వచ్చాను,” అంటూ జగదీష్  భుజాలు పట్టి కుదిపేసింది.

ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు జగదీష్.  పకపకా నవ్వింది రాణి.  “నేను క్లాసుకి వెళ్ళేంత వరకు కబుర్లు చెప్పు,” అంది.

“ఓకే,” అని నా ఆడిషన్ సంగతులు చెప్పాడు. 

అంతా విన్నాక, “నేను మాత్రం ఆడిషన్  లేకుండానే,  వచ్చే నెల ఒక సినిమాలో పాట పాడబోతున్నాను,” అంది రాణి.

**

తన మ్యూజిక్ క్లాస్ అయ్యాక, వాళ్ళ హోం-థియేటర్ లో మూవీ చూడ్డానికి రమ్మంది రాణి. మూవీ చూసే ఇంట్రెస్ట్  లేదంటూనే,  ఆమె పేరెంట్స్ ని  కలవడానికి మాత్రం, కాసేపట్లో వస్తానని చెప్పాడు జగదీష్.....

జగదీష్ చెన్నైలో ఉన్న మిగతా రోజుల ప్రోగ్రాం ఏమిటని వాకబు చేసింది.  

“మీ స్టూడియో క్రిస్టమస్ పార్టీ రోజు తప్పించి, నాకు ఫ్రీ టైం లేదు రాణి,”  అన్నాడు నవ్వుతూ ఆమెతో..

 

మౌనంగా ఆ సంభాషణ వింటూ, ‘ఆ  క్రిస్టమస్ పార్టీకి,  మమ్మల్ని ఇప్పటి వరకైతే  ఇన్వైట్  చేయలేదు  రాణి’ అనుకున్నాను.....

“ఒకే, విల్ సీ యు సూన్,” అంటూ కదిలింది రాణి.

**

సాయంత్రమవుతుండగా, భూషణ్ అంకుల్ వాళ్ళింటికి, జగదీష్ తో నేనూ వెళ్ళాను.  ఇంటి  ముందు నాలుగైదు వెహికల్స్ ఆగున్నాయి.  వాటిని దాటుకుంటూ గేటు లోనికి వెళ్ళాము.    

కాస్త దూరంగా, ఇంటి ముందున్న లాన్ లో, రాణి కూర్చునుంది.  చేయూపి, అటుగా రమ్మని  పిలిచింది.  వెళ్ళి తన వద్ద కూర్చున్నాము...

ఊరి నుండి, బంధువులు వచ్చున్నారని, ఇంట్లో హౌజ్-ఫుల్ అని నవ్వింది.  మేమొచ్చామని పనిపిల్ల చేత, లోపలున్న అంకుల్ వాళ్లకి కబురు పంపింది.

కాసేపటికి, ఆంటీ అంకుల్  వచ్చి, జగదీష్ ని ఆప్యాయంగా పలకరించి, మా ఎదురుగా కూర్చున్నారు.  హార్ట్-పేషంట్ అయిన తన మేనత్తని, పల్లె నుండి చెన్నైకి తరలించే ఏర్పాట్లల్లో ఉన్నామంది ఆంటీ.

నా టెలి-ఫిలిం ఆడిషన్స్ గురించి వాకబు చేసాక, జగదీష్ తో, అంకుల్ సంభాషణ చిన్న ఊళ్లల్లోని వైద్య సదుపాయాల దిశగా సాగింది. 
వాచ్ మెన్ గోవిందాన్ని పిలిచింది, నీరూ ఆంటీ.  స్టెమ్స్ తో పాటు, ఒక డజన్ లిల్లీ  ఫ్లవర్స్ కోయించి, నేను వెళ్ళే లోగా నాకందించమని పురమాయించింది. అమ్మకి పూలంటే ఇష్టమని  గుర్తు పెట్టుకుని, అప్పుడప్పుడు తమ గార్డెన్ నుండి పువ్వులు పంపుతుంటుంది ఆంటీ. 

మరి కాసేపు మాట్లాడి వారిద్దరు, లోనికెళ్ళిపోయారు.

**

రాణి, ప్రత్యేకంగా తెప్పించిన హాట్-చాక్లెట్ సిప్ చేస్తూ, లాన్ లోనే కూర్చున్నాము. తనకిష్టమైన సినిమాలు, మ్యూజిక్, దుస్తులు, హెయిర్ స్టైల్స్ – ఇలా తన రుచులు, అభిరుచుల గురించి చెప్పి, జగదీష్ కిష్టమైనవన్నీ అడిగి కనుక్కుంది.

అక్కడి నుండి ఎప్పటికి బయట పడతానోననుకుంటూ కూర్చున్నాను.

మరింత సేపటికి, “అత్తయ్య ఒక్కతే ఉంది.  వెళతాము,” అంటూ లేచాడు జగదీష్. 

ఇంకా ఉండమని జగదీష్ చేయి పట్టి కూర్చోబెట్టేసింది రాణి.  

నాకు విసుగ్గా అనిపించినా, జగదీష్ తో పాటు మళ్ళీ కూర్చున్నాను....

“ఇప్పుడు క్రిస్టమస్ పార్టీ వివరాలు చెబుతాను విను. నిన్ను మీట్ అవ్వాలని నా గర్ల్-ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ తెలుసా? మన పార్టీకి, వాళ్ళంతా డేట్స్ తో వస్తారు,” అంది రాణి. 

జగదీష్ ఏమనలేదు.

“జగదీష్, నువ్వు నా డేట్ వి కదా! మరి  చంద్రకి  ఫ్రెండ్ లేడని నాకు తెలుసు.  తను ఈ పార్టీ  మిస్ అవుతుంది,” మళ్ళీ రాణి....విని, మౌనంగా ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు జగదీష్.

ఇంతలో, “చంద్రమ్మా, ఇవిగోనమ్మా మీ అమ్మగారికి పూలు,” అంటూ నన్ను పలకరించి, టిష్యూలో చుట్టిన లిల్లీ స్టెమ్స్ నాకందించి వెళ్ళాడు వాచ్ మెన్ గోవిందన్. 

అతనికి థాంక్స్ చెప్పాను...

తన ఆలోచన నుండి బయటపడి, జగదీష్ నోరు విప్పాడు...

“అయితే, ఓ పని చెయ్యి, రాణి.  ఇది మీ స్టుడియోలో నువ్వు ఏర్పాటు చేసిన పార్టీ కదా!” మేక్ ఇట్ ఫామిలీ పార్టీ.  అత్తయ్య వాళ్ళని ఎలా వదిలి వస్తాను?

అత్తయ్య, వినోద్ బాబు, మీ పేరెంట్స్ కూడా మనతో ఉంటే బాగుంటుంది....,” అన్నాడు జగదీష్.

రాణి ఏదో అనబోయింది.

కేమ్ టు చెన్నై టు బి విత్ మై కజిన్స్ ఎండ్ అత్తయ్య.  అందుకే,  ఫామిలీ పార్టీ అయితే  హ్యాపీ,”  అని కూడా అన్నాడు జగదీష్.....

రాణి అప్సట్  అవుతుందని  నాకు  భయంగా ఉంది. 

“ఎలా కుదురుతుంది జగదీష్...? అన్న రాణి గొంతులో కోపం, దుఃఖం వినిపించాయి....

“కుదరాలి రాణి...ఆలోచించు.  నేను అత్తయ్య కోసం వచ్చాను.  ఫామిలీని వదిలేసి నీ డేట్ గా ఎలా పార్టీ ఎంజాయ్ చేస్తాను?  కాబట్టి... మేక్ ఇట్ ఫామిలీ పార్టీ...,”  అంటూ నన్ను బయలుదేరదేసాడు...

మేము గేటు దాటుతుండగా,  అంకుల్ వాళ్ళ బంధువులు కూడా బయటకి వచ్చి టాక్సీలలో బయలుదేరి పోయారు.

**

ఇంటికొచ్చి, అమ్మతో  వాకింగ్ కి బయలుదేరాము.  మా కాంప్లెక్స్ లోనే, ట్రైల్ మీద చాలా సేపు నడిచి, అలిసిపోయి ఇల్లు చేరాము..డిన్నరయ్యాక,  ‘ఘోస్ట్’ ఇంగ్లీష్ మూవీ చూశాము.  దాంతో, ‘భయం భయం’ అంటూ వినోద్ చేసిన గోలకి, అమ్మతో సహా అందరం హాల్లోనే పడుకుండిపోయాము....

**

బ్రేక్ ఫాస్ట్  దగ్గర  జగదీష్ కి, వినోద్ కి, కొసరి కొసరి వడ్డించింది అమ్మ.  

ఇంతలో హాల్లో ఫోన్ రింగయితే, తనే వెళ్ళి తీసింది.   

“హలో నీరూ! చెప్పండి,” అంటూ అక్కడే కూర్చుని మాట్లాడ సాగింది...

“అయ్యో, అదేమిటి?  పాపం! మరి ఇప్పుడు ఎలా ఉంది? బాధ పడుతుందా?” ఇలా సాగాయి అమ్మ మాటలు. నేను, జగదీష్ ఏమయిందోనని వింటున్నాము.

“అవునా? అయితే పర్వాలేదు....అలాగే నీరూ, తప్పక టైంకే వచ్చేస్తాము,”  అంటూ ఫోన్ పెట్టేసాక, మా వంక చూసింది అమ్మ.

“ఏమర్రా,  నిన్న మీరు వచ్చేసాక, ఎలా జరిగిందో గాని, రాణి చేయి కార్ డోర్ లో పడి బాగా నలిగి పోయిందట. కార్లో ఉండి పోయిన తన పర్స్ కోసం వెళ్ళినప్పుడు ఆక్సిడెంటల్ గా వేళ్ళు నలిగి, రక్తమట.  హాస్పిటల్ కి వెళితే, ఓ వేలికి నాలుగు స్టిచెస్ కూడా వేసారంట.  

తీరా పార్టీ రేపనగా ఇలా అయ్యిందని నీరూ ఆంటీ బాధ పడుతుంది,” చెప్పింది అమ్మ.

“అయ్యో,” బాధనిపించింది నాకు                         

రియల్లీపూర్ తింగ్,” అన్నాడు జగదీష్.

“పోనీ కాసేపు మీరే  రాణి దగ్గరికి వెళ్ళి రండి,” అంది అమ్మ.

**

తన చేతికి బ్యాండేజీ ఉన్నా, క్రిస్టమస్ పార్టీలో ఉత్సాహంగానే తిరుగుతుంది రాణి.  పార్టీలో గేమ్స్ స్టాల్స్  కూడా ఏర్పాటు చేసింది.  అతిధుల్లో ఎక్కువ మంది తన స్నేహితులే  అవడంతో, కొంత బిజీగానే ఉంది.  నా క్లాస్మేట్ - లీనా జోసెఫ్, తన అక్క  రీనాతో వచ్చింది. 

చక్కగా అలంకరించిన పెద్ద క్రిస్టమస్ ట్రీ చుట్టూ రంగురంగుల లైట్స్.  పార్టీ ఏరియా అంతా వెలిగిపోతుంది.   అందరూ మంచి ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు...

అమ్మకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మందే వచ్చారు...

అమ్మ తన ఫ్రెండ్స్ తో బిజీ అయితే,  మేము ముగ్గరం  గేమ్స్ లో మునిగిపోయాము.. అన్నిటా వినోద్ ని గెలవనిస్తున్నాడు జగదీష్...

కాసేపటికి, మా గేమింగ్ టేబిల్ వద్దకు వచ్చింది రాణి.  జగదీష్ చేయిపట్టుకుని, “మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను,”  నవ్వుతూ అటుగా దారితీసింది.

**

అందర్నీ గమనిస్తూ కూర్చున్న నన్ను, భుజం పై తట్టి, పలకరించి, వచ్చి పక్కనే కూర్చుంది లీనా.

దూరంగా హడావిడిగా తిరుగుతున్న రాణి వంక చూస్తూ, “షి ఇజ్ సో బ్యూటిఫుల్, కదా! అంది.               

ఔననట్టు తలాడించాను.

“ఆ పక్కనున్నది మీ కజిన్ జగదీష్ అంట కదా!” అడిగింది.  ఔనని తలూపాను.

“అతను రాణి ‘బాయ్ ఫ్రెండ్’ అంటగా!  అతనంటే తనకి చాలా ఇష్టమని చెప్తుంది ఫ్రెండ్స్ కి.  సమ్మర్లో వచ్చి వెళ్ళినా, తనని చూడ్డానికే మళ్ళీ  ఇప్పుడు చెన్నై వచ్చాడంటగా.  మా అక్కా వాళ్ళంతా ‘సో స్వీట్ ఆఫ్ హిమ్, అంటున్నారు,” ఆగకుండా చెబుతూనే పోయింది లీనా.

మౌనంగా లీనా మాటలు వింటున్న నన్ను, కాసేపటికి జగదీష్ పిలిచాడు.  కూడా వెళ్ళి, ప్లేట్స్ లోకి డిన్నర్ సర్వ్ చేసుకొని, అమ్మావాళ్ళు  కూర్చున్న గజేబో దిశగా నడిచాము.  అప్పటికే, అమ్మ, వినోద్ డిన్నర్ తెచ్చుకున్నారు.

ఆలోచిస్తూ  తినడం  మొదలుపెట్టాను.  జగదీష్, రాణిల గురించి, లీనా అన్న మాటలు తలుచుకుంటే, కోపంగా ఉంది. 

తలెత్తి పక్కనే ఉన్న జగదీష్ ని చూసాను.

“జగదీష్ బావా, నీకు న్యూస్...” అన్నాను.  ఏమిటన్నట్టు చూసాడు.

“నువ్వు తన ‘బాయ్ ఫ్రెండ్’ అని రాణి మా స్కూల్లో వాళ్ళకి చెప్పింది,” నవ్వుతూ అన్నాను.

“అవునా?” అడిగింది అమ్మ.

“అంతే కదా, యామ్ ఫ్రెండ్ ఎండ్ యామ్ బాయ్,” అన్నాడు జగదీష్ నవ్వుతూ.

“ఏ? నీకు ‘జెలసీనా? అడిగాడు నన్ను.

“ఛీ, ఏం లేదు,” అన్నాను.                                                 

పెద్దగా నవ్వడం మొదలు పెట్టింది అమ్మ.

“అయితే, నువ్వు కూడా అందరికీ చెప్పు.  జగదీష్ ఇజ్ మై బాయ్ ఫ్రెండ్ఎండ్ కజిన్ అని. నేను నీక్కూడా ఫ్రెండ్ నే కదా!” అన్నాడు అమ్మతో పాటు నవ్వుతూ..

తలెత్తి ఏదో అనబోయేలోగా, సర్వెంట్ చేత ప్లేట్ పట్టించుకొని, రాణి, మా దిశగా రావడం కనబడింది.  పింక్ కలర్ చూడిదార్ లో ఎప్పటిలా మెరిసిపోతుంది.....

వచ్చి నా ఎదురుగా, జగదీష్ పక్కనే కూర్చుంది రాణి.  

**

డిన్నర్ అవుతుండగా,  మా వద్దకు నీరూఆంటీ అంకుల్ వచ్చారు. అందరికీ పేరు పేరునా క్రిస్టమస్ గిఫ్టులు అందించారు వాళ్ళు.  అమ్మ పక్కనే కూర్చుని, నీరూఆంటీ, అమ్మ చేతులకి రంగురంగుల అద్దాల గాజులని తొడిగింది,.  హైదారాబాద్ నుండి తెప్పించారట.

“ఒక్క నిముషం, ఆల్మోస్ట్ ఫర్గాట్,  అమ్మ నీకు కూడా గిఫ్ట్ పంపింది,” అంటూ జగదీష్ తన బ్లేజర్ పాకట్ నుండి ఓ గోల్డ్ కలర్ బాక్స్ తీసిచ్చాడు రాణికి.

రాణి చాలా సంతోషంగా బాక్స్ వోపెన్ చేసింది.  కెంపుల పొదిగిన గణేష్ లాకెట్.   చాలా బాగుంది.  

“వెరీ నైస్ గిఫ్ట్, బాగుంది,” అన్నారు అంకుల్, ఆంటీ కూడా....

‘థాంక్యూ, ఇట్స్ బ్యూటిఫుల్,” అంటూ జగదీష్ హ్యాండ్ షేక్ చేసింది రాణి.

డోంట్ మెన్షన్, మా అమ్మ కదా తీసుకొంది, అమ్మకి చెపుతాను, నీకూ నచ్చిందని,” అన్నాడు జగదీష్. 

“ఏమ్మా కళా, ఫుడ్ బాగుందా?  టేబిల్ అవతలి నుండి నా వద్దకు వచ్చారు అంకుల్....

“చాలా బాగుంది అంకుల్. స్పగేటీ, ఇటాలియన్ బ్రెడ్ నాకూ ఇష్టమే,” అన్నాను...

“అయితే, ప్లేట్లు ఖాళీగా ఉన్నాయే?  మళ్ళీ  సర్వ్  చేసుకొని ఎంజాయ్ చేయండి,” అని వెనుతిరిగిన అంకుల్, “మర్చిపోయాను కళా, ఓ సారి ఇలా రా,  సాహిత్య అకాడెమీ మేడమ్ కి నిన్ను పరిచయం  చేస్తాను,” అన్నారు.  లేచి ఆయన్ని అనుసరించాను.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery