Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు: ములక్కాయ - రొయ్యలు - పి. పద్మావతి

mulakkaya royyalu recipe

కావలసిన పదార్థాలు: మునక్కాడలు, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, కారం, పసుపు, మసాల పొడి, ఉప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు.

తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. అందులో పసుపు,ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. ఒక నిమిషం మూత పెట్టుకొని ఉదికించలి. తరువాత అందులో రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకొని, ములక్కాడలు కూడా  వేసి కలిపి మూత పెట్టాలి. ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై ఉంచాలి. అల్లం వెల్లుల్లి తో రొయ్యలు మగ్గితే, రొయ్యలు తెల్లగా మారి, వాటర్ వస్తుంది. అప్పుడు అందులో సరిపడినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువైతే రొయ్యలు ఉడకకుండా కూర మాడిపోయే అవకాశం కలదు. కావున కారం జాగ్రత్తగా వేసుకోవాలి. కూరని బాగా కలుపుకొని టమాటాలు కూడా వేసుకొని  మూత పెట్టి కొద్దిసేపు చిన్న మంటపై ఉంచాలి. తరువాత కొద్దిగా మసాలా పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. నూనె పైకి రాగానే కూర రెడీ అవుతుంది.

ఈ ములక్కాయ - రొయ్యలు కూర అన్నం లోకి మరియు ప్లెయిన్ బిర్యాని లోకి చాలా బాగుంటుంది.

మరిన్ని శీర్షికలు