Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

దమ్ముంటే అది.. లేకుంటే బూతు

movies trend

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్నది. భారీ బడ్జెట్‌ సినిమాకి తొలిరోజు మంచి టాక్‌ వచ్చినా, చివరకు నస్టాలతోనే ముగుస్తోంది ఆ సినిమా పరిస్థితి. బడ్జెట్‌ హద్దులు దాటేయడమే ఈ విపరీత పరిస్థితికి కారణం. కానీ భారీ బడ్జెట్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ గందరగోళంలో చిన్న సినిమా చితికిపోతోందనే విమర్శ వస్తోంది.

కానీ, చిన్న సినిమాలు కొన్ని పెద్ద నిర్మాతలకు షాక్‌ ఇస్తున్నాయి. యాభై లక్షలతో తెరకెక్కిన సినిమా భారీ వసూళ్ళను సాధిస్తోంటే, పెద్ద నిర్మాతలూ చిన్న సినిమాను అభినందించక తప్పడంలేదు. కానీ అలాంటి కొన్ని సినిమాలకు 'బూతు సినిమాలు' అనే ఆరోపణ వినిపిస్తోంది. బూతు సినిమాలకు గిరాకీ ఎక్కువగా వుంటోన్న అన్ని బూతు సినిమాలూ వసూళ్ళు రాబట్టలేకపోతున్నాయి.

సినీ పరిశ్రమలో ఇప్పుడు ఆఫ్‌ ది రికార్డ్‌గా వినిపస్తున్న అభిప్రాయం ఏంటంటే, కమర్షియల్‌ అంశాలతో భారీ బడ్జెట్‌ సినిమా, బూతు కంటెంట్‌తో చిన్న సినిమా మాత్రమే నిలదొక్కుకుంటున్నాయని. యువతను చెడగొడుతున్న బూతు సినిమాలు.. అనే విమర్శ వ్యక్తమవుతున్నప్పటికీ, మంచి సినిమాలకు ఆదరణ తగ్గుతుండడమూ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం.

'ఓనమాలు' వంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తే అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తాయి. కథా బలం లేని సినిమాలు కమర్షియల్‌ విజయం సాధిస్తున్నాయి కాబట్టే అవీ ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో బూతు కూడా ఓ కమర్షియల్‌ అంశమైపోయింది.

మరిన్ని సినిమా కబుర్లు
will people buy 3D tvs