Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
not thinking about acting

ఈ సంచికలో >> సినిమా >>

రామజోగయ్య ఓర్పు ఓపిక

ramajogayya shastry patience

సినిమాకి సంబంధించి పాటల రచయిత కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మంచి పాట రాసినా, దానికి దర్శకుడి ఆమోదం తప్పనిసరి. దర్శకుడి ఆలోచన, సంగీత దర్శకుడి బీట్స్‌.. ఇవన్నీ పాటకు సరిపోకపోతే ఎంత టాలెంట్‌ వున్నా వృధా. టాలీవుడ్‌లో పాటల రచయితగా మంచి పేరు సంపాదించిన రామజోగయ్య శాస్త్రి, దర్శక నిర్మాతలకీ, సంగీత దర్శకులకీ చాలా అందుబాటులో వుంటారు.

అందుబాటులో వుండడం అంటే, ఓ పాట కోసం ఎన్ని వెర్షన్లు రాయమన్నా, చకచకా ఆ పని చేసేయడంలో రామజోగయ్య శాస్త్రి దిట్ట. కొంచెం మార్చితే బావుణ్ణు.. అని దర్శకుడు సూచిస్తే, ఆ వెంటనే ఆ సూచనల మేరకు పాట రాసివ్వడం, దర్శకుడిని మెప్పించడం రామజోగయ్యకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అంటారు.

వాస్తవానికి తన మనసులోని ఆలోచనలకు, ఇంకొకరి ఆలోచనలకు తగ్గట్టుగా పాట రాయడానికీ చాలా తేడా వుంటుంది. దానికి ఓపిక కావాలి. ఆ ఓపిక రామజోగయ్యకు ఎక్కువ. అందుకే తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి పాటల రచయితల్లో ఒకరిగా పేరు పొందారాయన. ఒకప్పుడు పాటకు తగ్గ ట్యూన్‌ వుండేది. కానీ, ఇప్పుడు ట్యూన్‌కి తగ్గట్టు పాటలు రాయాల్సి వస్తోంది. అయినా రామజోగయ్య ఓపిక ముందు అవేమీ ఇబ్బందికరంగా అతనికి అన్పించడంలేదు.

మరిన్ని సినిమా కబుర్లు
future of this handsome