Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Paryatakam - Hampi

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జూలై 19 - జులై 25) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు కొంతమేర అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. సంతాన మూలక సౌఖ్యంను కలిగి ఉంటారు. ఇష్టమైన పనులను చేపడుతారు.  పనులను త్వరగా పూర్తిచేయాలి అనే ఆలోచనను కలిగి ఉండే అవకాశం కలదు. మీరు ఆశించిన విధంగా అధికారులనుండి సహకారం రాకపోవచ్చును. అయినను ముందుకు వెళ్ళుట మూలాన ఫలితాలు వస్తాయి. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. పనిభారం ఉండుట మూలాన అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది, కావున జాగ్రత్తగా ఉండుట సూచన. ప్రయత్నాలలో విజయంను సాధిస్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. కుటుంబంలో స్వల్ప మార్పును కోరుకొనే అవకాశం ఉంది. క్రింది స్థాయి వారి మూలన లాభంను పొందుతారు. వారి సహకారం మూలాన పనులను త్వరగా పూరిచేయుతకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాకపోతే తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుట ఉత్తమం.       

వృషభ రాశి
ఈవారం మీరు మిశ్రమఫలితాలను పొందుటకు అవకాశం కలదు. చేపట్టే పనులను ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆరంభించుట మంచిది. ధనప్రాప్తిని కలిగి ఉంటారు. బంధువులతో కలిసి చేపట్టిన పనులకు సంబంధించిన పనులలో ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపును కలిగి ఉంటారు. మీ ఆలోచనలు తోటివారికి ఉపయోగపడేవిగా ఉంటాయి. తలపెట్టిన పనులలో ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. మోకాళ్ళ నొప్పులు భాధకు గురిచేయుటకు అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. వారం మధ్యలో కుటుంబంలో కలుగు చిన్న చిన్న విభేదాలను నిదానంగా ఆలోచించి నడ్చుకొనుట మూలాన తగ్గించుకొనే అవకాశం కలదు. ఇష్టమైన పనులను చేపడుతారు. ఆదిశగా అడుగులు ముందుకు వేయుటకు అవకాశం కలదు. గట్టిగా ప్రయత్నం చేయుట వలన మరింత పనులు ముందుకు వెలుతాయి ప్రయత్నం పెంచండి. మంచివారితో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో పరిచయాలు లాభంను కలుగ జేస్తాయి. బంధువులతో సమయాన్ని గడుపుతారు.      

మిథున రాశి
ఈవారం మీరు సమాజంలో మంచి పేరును తెచ్చిపెట్టు పనులను చేపడుతారు. ఉత్సాహంను కలిగి ఉండి చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్తారు. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడుతాయి. తోటివారు లాభంను పొందుటకు అవకాశం కలదు. అనుకోకుండా చేపట్టిన పనులలో ఖర్చులను పొందుటకు అవకాశం కలదు, జాగ్రత్తగా ఉండుట సూచన. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట మంచిది. నూతన ఆలోచనలు చేయకండి. వాహనములు నడుపునపుడు తప్పక జాగ్రతలు పాటించుట మంచిది. సమయానికి భోజనం చేయుట అలాగే బంధువులతో నిదానంగా వ్యవహరించుట సూచన. అధికారులకు మీయొక్క ఆలోచనలు నచ్చక పోవచ్చును. వారికి అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారమూలాన కొంత నష్టంను కలిగి ఉంటారు. వ్యతిరేక వర్గం నుండి భాదను కలిగి ఉంటారు. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం.

కర్కాటక రాశి
ఈవారం మీరు వారం ఆరంభంలో కొంత ఇబ్బందులను పొందినను చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను విజయవంతంగా ముగిస్తారు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. వీలైనంత వరకు నూతన పనులను ఆరంభించక పోవడం మంచిది. ఆర్థిక పరమైన విషయాల్లో ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. మీ ఆలోచనల మూలాన ఇతరులు ధనలాభంను కలిగి ఉంటారు. అనుకోని వార్తను వినుట వలన భాదను పొందుటకు అవకాశం కలదు. కావున మానసికంగా దృడంగా ఉండుట అవసరం. అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. అధికంగా సంచారం చేయుట మూలాన శరీర ఆయాసంను కలిగి ఉంటారు. జాగ్రత్తలు పాటించుట మేలు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. అకారణంగా కలహములు ఏర్పడుటకు అవకాశం ఉంది. తగిన చర్యలు చేపట్టుట మేలు. ప్రయాణములు చేయునపుడు భాదను పొందుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది సౌఖ్యంను పొందుతారు.

సింహ రాశి
ఈవారం ప్రతిపనిని ఆలోచించి చేయుట నిదానంగా వ్యవహరించుట చేయండి. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభంను కలిగి ఉంటారు. నూతన అవకాశాలు వచ్చుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆశించిన ఫలితాలు ఆలస్యం అవ్వడం చేత ఆందోళనను చెందుతారు. ప్రయాణాలలో ఇబ్బందులు పొందుతారు. అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. అశుభవార్తను వింటారు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. వారం చివరలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కాలదు. సంతోషాన్ని పొందుతారు. బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉత్సాహంను పొందుతారు. మిత్రులతో నూతన పనులకు సంభందించిన ఆలోచనలు చేస్తారు. చేపట్టిన పనుల వలన సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మంచిపనులను చేపడుతారు. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది.    

కన్యా రాశి
ఈవారం బంధువులతో కలిసి నూతన పనులను చేపడుతారు. సమయాన్ని వారి గృహంలో గడుపుటకు అవకాశం కలదు. శుభకార్యములలొ పాల్గొంటారు. మీ ఆలోచనలను అందరితోను పంచుకుంటారు. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం కాలదు. వారం ఆరంభంలో ఇష్టమైన వారిని కలుస్తారు ఉల్లాసంతో పనులను చేపడుతారు. పనులలో కొంత ఒత్తిడిని పొందుట మూలాన వారం మధ్యలో ఆందోలనను పొందుతారు. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. అనుకోని సంఘటనలను కలిగి ఉండుట మూలాన భాదను పొందుటకు అవకాశం కలదు. వారం చివర్లో ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం కలదు. సంచారం చేయుట మూలాన భాదను కలిగి ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఏవైనా చర్చలు జరిగితే వాటిని పొడగించే ప్రయత్నం చేయకండి. అకారణంగా తిరగవలసి రావొచ్చును అలసిపోతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది.

తులా రాశి
ఈ వారం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. తలపెట్టే పనులను ఒకటికి రెండు సార్లు అలోచించి చేయటం మంచిది. ఉద్యోగంలో  అభివృద్ధి కలిగి ఉంటారు. నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన అవకాశాలు వచ్చే అవకాశం కలదు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వారం ఆరంభంలో మాటలను పొదుపుగా వాడుట ఉత్తమం. వారం మధ్యలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులను చేపడతారు. వారం చివరలో కొద్ది పాటి ఆందోళనను కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశము కలదు. తగిన జాగ్రత్తలు పాటించండి. మీ ఆలోచనలు తోటి వారికి నచ్చకపొవచ్చును. పెద్దలతో కలిసి నూతన పనులను ప్రారంభించే అవకాశము కలదు. మధుర పదార్ధములందు ఆసక్తిని కనబరుస్తారు. భోజన సౌఖ్యం పొందుటకు అవకాశము కలదు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించి ఫలితాలు రావచ్చు. అందరిని కలుపుకుని వెళ్ళడం వలన మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  

వృశ్చిక రాశి
ఈ వారం కొన్ని అనుకూలమైన ఫలితాలు కలగటం చేత ఉపశమనం పొందుతారు. ఉత్సాహమును కలిగి ఉండి నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వారికి నచ్చే విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన వివాదములు తగ్గుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు కలగుటకు అవకాశాలు కలవు జాగ్రత్త. కొన్ని సందర్భాలలో మీ యొక్క ప్రవర్తనను తోటి వారు అనుమానించే అవకాశము కలదు. ప్రారంభించిన పనులలో శ్రమను కలిగి ఉంటారు. పనులు నిదానంగా పూర్తి అయ్యే అవకాశాలు కలవు. ఆర్ధక పరమైన విషయాలలో పెద్దల సూచనలను పాటించటం వలన మేలు చేకూరుతుంది. లేనిచో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ స్థానంలో అధికారుల వలన మాటలు పడాల్సి వస్తుంది. సర్దుబాటు విధానం కలిగి ఉండటం అన్ని విధాల మంచిది. మీ వ్యతిరేక వర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును. శాంతంతో నిదానంగా వ్యవహరించటం శ్రేయస్కరం. 

ధనస్సు రాశి
ఈ వారం మీరు విద్యా సంబంధమైన చర్చలలో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలయందు ఆసక్తిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. కాకపోతే వ్యతిరేక వర్గం నుండి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో నిదానంగా వ్యవహరించటం మంచిది. వారం ఆరంభంలో అధికమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ తేరుకొని పనులు పట్ల శ్రద్ధను కనబరుస్తారు. వారం చివరలో మాటలను పొదుపుగా వాడటం, చేపట్టిన పనులలో శ్రద్ధను చూపటం వలన అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో నిదానంగా వ్యవహరించటం మంచిది. గతంలో చేపట్టిన పనులను అశ్రద్ధ చేయకండి. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట, అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మంచి జరుగుతుంది. పెద్దల సూచనలను పాటించండి. దాని వలన తప్పక లాభాలను పొందుటకు అవకాశం కలదు. సత్ప్రవర్తనను కలిగి ఉండటం వలన మంచి పేరును సంపాదించే అవకాశము కలదు. పూజా కార్యక్రమాలలో పాల్గొనండి.

మకర రాశి
ఈ వారం ఉద్యోగంలో నూతన ఆలోచనను కలిగి ఉంటారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన పేరును కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. వారి అనారోగ్యం వలన ఇబ్బందులు తప్పక పోవచ్చు. వారం ఆరంభంలో బంధువులతో సమయాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యం కలిగి ఉంటారు. వారం మధ్యలో తలపెట్టిన పనులలో ఇబ్బందులను అధికమైన ఆలోచనలు కలుగుతాయి. ఆర్ధికపరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పనుల యందు వారం ఆరంభంలో ఉన్న ఉత్సాహం వారం చివరి వరకు ఉండకపోవచ్చు. చర్చా సంబంధమైన విషయాలలో ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ఆలోచనల వలన ఇతరులు లాభాన్ని పొందుతారు. సేవా గుణాన్ని కలిగి ఉంటారు. వినోదాలు చూచుటనందు ఆసక్తిని కలిగి ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అధికారుల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. దొంగల వలన భయం ఉంది కావున తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది.  

కుంభ రాశి
ఈ వారం అధికారుల నుండి గుర్తింపును, అభినందనలను పొందుతారు. ప్రయత్నకార్యాలలో విజయం మిమ్మల్నే వరిస్తుంది. ఆర్ధిక పరమైన విషయాలలో బాగానే ఉంటుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి  చేయగలుగుతారు. ఉత్సాహమును కలిగి ఉండి నూతన పనులను చేపడతారు. భోజన సౌఖ్యం ను కలిగి ఉంటారు. కొన్ని విషయాలలో ఫలితాలు నిదానంగా రావటం వలన మనో విచారమును పొందుతారు. అనారోగ్యమును మాత్రం అశ్రద్ధ చేయకండి. తగిన జాగ్రత్తలు తీసుకొనుట ఉత్తమం. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. అకారణంగా భయాన్ని పొందుతారు. నూతన ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్ళడం వలన మేలు జరుగుతుంది. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనవసరపు ఆలోచనలను చేయకండి. అందరితో కలిసి పని చేసే ప్రయత్నం చేయుట వలన ఆశించిన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. 

మీన రాశి
ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో తడబాటును కలిగి ఉన్నప్పటికీ శ్రమించుట ద్వారా పనులలో విజయాలను సొంతం చేసుకుంటారు. వారం మధ్యలో నూతన అవకాశాలు రావటానికి అవకాశం కలదు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. బంధువులతో సమాలోచనలు చేస్తారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం వలన మేలు జరుగుతుంది. ఆర్ధికపరమైన విషయాలలో బాగానే ఉంటుంది. ధనలాభామును కలిగి ఉంటారు. ఉద్యోగములో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. అధికారుల వలన శ్రమను పొందుతారు. స్థానచలనం కలిగే అవకాశం కలదు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండగలరని సూచన. అనుకోకుండా ఖర్చును పొందే అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించటం మంచిది. మిత్రుల ద్వారా నూతన సమాచారాన్ని సేకరిస్తారు. ప్రణాళికా బద్ధంగా నడుచుకొన్నట్లయితే గతంలో మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi