కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పూదీన, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరిపాలు
తయారుచేయాల్సిన విధానం :
ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగ నివ్వాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత అందులో చికెన్ ముక్కలు, పసుపు, కారం, కొబ్బరిపాలు, పూదీన, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక సారి కలుపుకొని, టమాట ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి.
చికెన్ ఉడికిన తరువాత అందులో కొద్దిగా మసాల పొడి వేసుకొని, కొత్తిమీర చల్లుకుంటే నోరూరించే తెలంగాణ చికెన్ రెడీ.
|