Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue150/425/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

‘‘అవును. మా ప్రయత్నమునకు అడ్డుపడిన నిన్ను చంపిన తర్వాతనే యువరాజు చేతిలో హతమవుతాము. నిన్ను జంపిన తృప్తి అయినా మాకు మిగుగాక’’ అన్నాడు మరొకడు.

మాటల్ని బట్టి వాళ్ళు లొంగరని అర్థంకాగానే ఖడ్గాన్ని రఅుళిపిస్తూ వాళ్ళ మధ్యకు దూకాడు అపర్ణుడు. వాళ్ళు నుగురూ నాుగు ప్రక్కలా అతడ్ని క్రమ్ముకున్నారు. దారుణమైన పోరాటం ఆరంభమైంది.

కత్తు కణేల్‌ కణేల్‌ మని మ్రోగుతున్నాయి. అపర్ణుడి హుంకరింపు ప్రత్యర్థు అరుపుతో గోపుర ప్రాంగణం హోరెత్తిపోతోంది. బొంగరంలా తిరుగుతూ పెద్దపులిలా దూకుతూ భీకరంగా పోరాడుతున్నాడు అపర్ణుడు. అతడి అరుపు చిరుతపులి ఘర్జనలా వున్నాయి. అతడి చేతిలో ఖడ్గం కంటికి కన్పించనంత వేగంగా తిరుగుతోంది. కుర్రకుంక అని తేలిగ్గా తీసుకున్న ప్రత్యర్థుకు క్షణాల్లో చెమటు పుట్టించాడు అపర్ణుడు.
పోరాటం ఆరంభమైన రెండో క్షణంలోనే అపర్ణుడికి సాయంగా తానూ వెళ్ళానుకున్నాడు ధనుంజయుడు. కాని, అపర్ణుడి ఖడ్గ చానం, పోరాడే తీరు, ఆ వేగం గమనించగానే అతడికి తన సాయం అక్కర లేదనిపించింది.

మీసాలు కూడ రాని ఈ కుర్రాడికి ఏవో కొన్ని మంత్రాలు మాత్రమే వచ్చు. ఖడ్గాన్ని అలంకార ప్రాయంగా, ఆత్మ రక్షణకే నడుంకి వుంచుకున్నాడనుకున్నాడు. కాని చూస్తుంటే ఇప్పుడర్థమవుతోంది. అతడు అసాధారణ వీరుడని. యుద్ధ విద్యల్లో ఆరి తేరిన యోధుడని. అపర్ణుడి యుద్ధ కౌశలానికి ముగ్ధుడవుతూ సమీపం లోకి పోయి వేడుక చూడనారంభించాడు.

జరుగుతున్న రణ క్రీడకు పద ఘట్టన నుండి నేల మీది ఎర్ర మన్ను సుడి గాలిలా లేస్తోంది. రెప్ప వాల్చటం మర్చి పోయి ఉత్కంఠ భరితులై చూస్తున్నారంతా. రెండు పదు కూడ దాటని యువకుడు నలుగురు వీరుల్ని ఎదిరించటం సాధారణ విషయం కాదు. అలాంటి అపర్ణుడు ప్రత్యర్థులతో యుద్ధం చేస్తున్నట్టు లేదు, ఆడుకొంటున్నట్టుంది. పోరాటం ఆరంభమైన అయిదో నిమిషంలోనే ఒకడి తర్వాత ఒకడు ఇద్దరి శిరస్సు తెగి పుచ్చకాయల్లా నేల మీద దొర్లాయి. మరో మూడు నిమిషాలకు మిగిలిన యిద్దరి శిరస్సులను కూడ నిర్థాక్షణ్యంగా తెగేసాడు అపర్ణుడు. ఇంత పోరాటం సాగినా అపర్ణుడి తలపాగా చెక్కు చెదరక పోవటం యువరాజునే కాదు, చూస్తున్న అందర్నీ ఆశ్చర్య పరిచింది. నేల మీద అయిదు శవాలు నెత్తుటి మడుగులో పడున్నాయి. అపర్ణుడు వాళ్ళని అంతం చేయటంతో ఆగలేదు. వీరావేశంతో అక్కడే శవాల మధ్య నిలబడి చుట్టూ పరిక్షిస్తున్నాడు. అప్పుడే`

‘‘మిత్రమా... ఏమైనది? నీ చేతిలో అందరూ హతమైనారుగా.’’ అంటూ ముందుకొచ్చాడు ధనుంజయడు.

‘‘లేదు ప్రభు. హత్యా ప్రయత్నమున ప్రత్యక్షంగా పాల్గొనిన వారు అయిదుగురే. కాని పరోక్షంగా ఆరో వాడు ఇక్కడే వుంటాడు. వాడు వెనక్కి వెళ్ళి జరిగినది చెప్ప రాదు... వాడ్ని పట్టుకున్న చాలు. వీళ్ళ వెనకనున్నవాడు ఆ ద్రోహి ఎవడో తెలియగలదు’’ అన్నాడు.
అపర్ణుడి సూక్ష్మబుద్ధికి, సమస్య పట్ల నిశిత పరిశీలనకి నివ్వెర పోయాడు ధనుంజయుడు. నిజమే! తనను అంతం చేయమని వీళ్ళను పంపించిన ద్రోహికి ఇక్కడ ఏమి జరిగినదో తెలీకూడదు. తెలిసినచో మరో ప్రయత్నం చేస్తాడు. సందేహంతో తనూ చుట్టూ వున్న పౌర జనాల్ని పరిశీలించ నారంభించాడు. అంతలో`

ఒక గుంపు వెనక సాధారణ దుస్తుల్లో నిలబడిన బుర్ర మీసాల వ్యక్తి ఒకడు నెమ్మది నెమ్మదిగా వెనక్కి జరగటం యువరాజు కంట బడింది. వెంటనే బిర బిరా అటు అడుగులేసాడు. అది చూసి కంగారు పడి పారి పోవడానికి వెనక్కి తిరిగాడు. ‘‘ఆగిపో... అక్కడే ఆగి పొమ్ము’’ అంటూ అరిచాడు ధనుంజయుడు.

కాని ఆగి పట్టు బడే ఉద్దేశం వాడికి లేదు. తనను పట్టబోయిన కొందరు పౌరుల్ని విదిల్చి కొట్టి కత్తి దూసాడు. ప్రాణ భయంతో పరుగు ఆరంభించాడు. వాడ్ని వదులుకునే ఉద్దేశ్యం అపర్ణుడికి లేదు. వెంటనే చురిక తీసి పారి పోతున్న వాడ్ని గాయపర్చే ఉద్దేశంతో తొడ భాగానికి గురి చేసి విసిరాడు. అతడి గురి తప్పదు. శర వేగంగా దూసుకెళ్ళి వాడి తొడలో పిడి వరకు దిగబడింది. అంతే`|

ప్రాణం పోతున్నంత బాధతో విలవిల్లాడుతూ గింగిరాలు తిరిగి నేల మీద పడి పోయాడు. వాడు ప్రాణాలతో చిక్కిటం అవసరం. అపర్ణుడు, ధనుంజయుడు వాడి వద్దకు పరుగెత్తారు. కాని ఆలస్యమై పోయింది. కింద పడగానే ఇక ప్రాణాలు మీద ఆశ వదులుకున్న వాడు. దుస్తుల్లోంచి ఒక విషపు గుళిక తీసి మ్రింగేసాడు. క్షణాల్లో ప్రాణం తీసుకున్నాడు. తమ ప్రయత్నం విఫలమైనందుకు కోపంతో మండి పడుతూ అపర్ణుడు` ‘‘ఛ... చచ్చి తప్పించు కొంటివి గదరా కుక్క!’’ అంటూ కసితో శవాన్ని బలంగా తన్నాడు.

అది చూసి నవ్వాడు ధనుంజయుడు.

‘‘మిత్రమా! చచ్చిన వాడ్ని ఏమి చేయ గలములే. ఇక విడు’’ అన్నాడు.

ఇంతలో`బయటి పరిస్థితి తెలిసినట్టుంది.ఆలయ ప్రధాన అర్చక స్వామి శివ దాసు, ఆలయ సిబ్బంది కొంత మందిని వెంట బెట్టుకుని బిర బిరా అక్కడికి చేరుకున్నాడు.

‘‘యువరాజా! తమరు క్షేమమే గదా. తమ కేమియు ప్రమాదము ఘటిల్ల లేదు గదా?’’ అనడిగాడు గాభరా పడుతూ.

‘‘నేను క్షేమమే స్వామి. చింతిల్ల పని లేదు’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘అంతలో ఆ భీమ శంకరుని కరుణా కటాక్షము. మీరిచటనుండుట ఇక క్షేమ కరం కాదనుకొందును. మీరు బయలు దేరండి ప్రభు. ఈ నీచుల శవాల సంగతి మన సిబ్బంది చూసుకుంటారు. బయలు దేరండి’’ అన్నాడు హెచ్చరిగ్గా.

‘‘అలాగే స్వామీ.’’ అంటూ వెను తిరిగాడు యువరాజు ధనుంజయుడు.

‘‘స్వామీ. ఈ ద్రోహులకు శవ సంస్కారము జరుపవలదు. సహాద్రి లోయ లోనికి విసిరేయమనండి. వీళ్ళందరూ అడవి నక్కలకు ఆహారం గావలె.’’ రక్త సిక్తమైన ఖడ్గాన్ని ఒరలో వుంచి, ధనుంజయుని అనుసరిస్తూ ఆవేశంగా అరిచాడు అపర్ణుడు.

ఇద్దరూ విడిది గృహం వైపు దారి తీసారు. తనను చూసి నమస్కరిస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా అపర్ణుడి వంక చూసాడు ధనుంజయుడు.

‘‘మిత్రమా! నీవు నన్ను కాపాడుట ఇది మూడవ సారి. అవునా?’’ అనడిగాడు.

అవునన్నట్టు తల పంకించాడు అపర్ణుడు.

‘‘నాదో సలహా ప్రభు. వెంట ఒక్క అంగ రక్షకుడయినా లేకుండ మీరిలా ఒంటరి ప్రయాణం చేయుట నిజముగా క్షేమ కరం కాదు’’ అన్నాడు.

‘‘నీ మాట సత్యమే గాని ఇప్పటికిప్పుడు సమర్థుడైన అంగ రక్షకుడు ఎచట లభించగడు? అదేదో నీవే నా వెంట రావచ్చును గదా.’’

‘‘నేనా....’’

‘‘నీవేనయ్యా. నీకన్నా సమర్థుడెవరు? నీకు వేరే పనులేమన్నా వున్నవా?’’

‘‘లేవు లేవు. మీతో వచ్చుట నాకు సంతోషమే.’’

‘‘అయితే ఆలస్యమేల. భోజనం గావించి ఇప్పుడే ఇట నుండి వెడలి పోవుదము. నీ అశ్వము ఢాకిని ఎచట నున్నది?’’

‘‘అది ఇచటనే వున్నది ప్రభు. మీరు విడిది గృహము చేరి భోజనము గావించి సిద్ధముగా వుండండి. ఒక అర్ధ జాములోపే సిద్ధమై మీ చెంతకు వచ్చెదను’’ అని చెప్పి చరచరా ఒక వీధి వెంట లోనకు వెళ్ళి పోయాడు.

యువరాజు ధనుంజయుడు భోంచేసి తన అశ్వం గరుడను సిద్ధం చేసి అపర్ణుడి రాక కోసం ఎదురు చూసాడు. కొద్ది సేపటికి అపర్ణుడు కూడ తన మచ్చల గుర్రం ఢాకినిని అధిరోహించి వచ్చి చేరాడు. స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆకు పచ్చ రంగు తలపాగా ధరించాడు.

‘‘పొద్దు నడిమింటకు చేరనుంది. ఇక బయలు దేరుదము’’ అన్నాడు వస్తూనే.

‘‘కాని... ఒక సారి నీలవేణి బామ్మ గృహమునకేగి భద్రా దేవిని చూచి పోవుదామా?’’ అడిగాడు ధనుంజయుడు.

‘‘ఇది యేమి కోరిక ప్రభు. తను అందముగా వున్నదని మీరేమీ మనసు పారేసుకొనలేదు గదా?’’ అనడిగాడు పరిహాసంగా అపర్ణుడు.
‘‘అలాంటిదేమియు లేదులే’’ అన్నాడు చిరు నవ్వుతో ధనుంజయుడు.

‘‘లేనప్పుడు ఆమెతో పని యేమి ప్రభు. పోవుదము రండు’’ అంటూ అశ్వాన్ని అదిలించాడు అపర్ణుడు.

అంతటితో ఆ విషయాన్ని వదిలేసి` తనూ బయలు దేరాడు ధనుంజయుడు.అశ్వాలు రెండూ తూర్పు దిక్కు సహ్యాద్రి శ్రేణి వెంట దౌడు ఆరంభించాయి.

**********************************

రాత్రి ప్రధమ యామం గడుస్తోంది.

నీలాకాశంలో చుక్కల నడుమ`

అర్ధ చంద్రుడు ఆరుకళతో ప్రకాశిస్తున్నాడు.

సహ్యాద్రి కొండకోనలు మీదుగా ఇప్పుడిప్పుడే చలిగాలులు ఆరంభించాయి. దవ్వుల ఎటనుండో నక్కల వూళలు, గబ్బిలాయిల అరుపులు వినవస్తున్నాయి. దిగువన లోయ ప్రాంతాల నుండి కౄర మృగాల ఘర్జనలు విన్పిస్తున్నాయి.

అపరాణ్ణ వేళ భీమ శంకరం పల్లె నుండి బయలుదేరిన ధనుంజయ, అపర్ణులు ఎక్కడా ఆగకుండా తూర్పుగా పోతున్న సహ్యాద్రి కనుమ వెంట ప్రయాణించి కను చీకటి వేళకు ఒక కొండ గుట్ట పైకి చేరుకున్నారు. చెట్టు చేమలు లేని సమతల రాతి గుట్ట. వెళ్ళేటప్పుడు ఒక రాత్రికి యువ రాజు ఎక్కడ మజిలీ చేసాడు అదే చోటు.

అశ్వాలను ఒక బండకు కట్టారు. ఎండు కట్టెలు పేర్చి నెగడు మండించారు. నెగడు పక్కనే చెరో కంబళి పరిచి కూచున్నారు. వెంట తెచ్చుకున్నవేవో తిని కబుర్లలో పడ్డారు.

‘‘ఇంతకూ నీ గురించి ఏమియు చెప్పవేమి మిత్రమా. నీవు చంపా పురము ఎందుకు వెళ్ళినావు? అట నుండి భీమ శంకర క్షేత్రానికి ఎందుకొచ్చినావు? చెప్పుకున్నటు మన మచట కలుసుకొనుట కడు విచిత్రమాయెనే’’ అడిగాడు ధనుంజయుడు.

‘‘ఇందులో విచిత్రమేమున్నది ప్రభు. చెప్పుకునేంత చరిత్ర గలవాడనేమియు కాదులే. మా బంధువుల యింట ఆరోగ్యము సరి లేదని తెలిసి చంపా పురం పోతిని. వారి ఆరోగ్యము కొరకు ప్రార్థించుటకు భీమ శంకరుని దర్శనార్థం సహ్యాద్రి వచ్చితిని. నా సంగతులకేమిగాని, మీరు సహ్యాద్రికేతెంచుట మాత్రం నమ్మ శక్యం గాకున్నది. ఏం జరిగినది ప్రభు?’’ కుతూహలంగా అడిగాడు అపర్ణుడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali