Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
power star pawan kalyan josh

ఈ సంచికలో >> సినిమా >>

చందమామలో అమృతం.. తాగి చూడాల్సిందే

amrutham in moon

అమృతం ధారావాహికని చూడని వారుండరు. దాని గురించి తెలియనివారు తెలుగు నేలపై అసలే వుండరు. అది కేవలం బుల్లితెర ధారావాహిక మాత్రమే కాదు, టెన్షన్‌ హృదయాలకు నవ్వుల టానిక్‌ అది. దాన్ని ఇప్పుడు సినిమాగా తెరకెక్కించబోతున్నారన్న విషయం తెలుసు కదా.

‘చందమామలో అమృతం’ పేరుతో రూపొందుతోన్న సినిమా గురించి అంతటా ఆసక్తి వుంది. సినీ పరిశ్రమలో అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. స్వతహాగా క్లీన్‌ కామెడీని ఇష్టపడే ఎన్నారైలు సైతం, ‘చందమామలో అమృతం’ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

‘అమృతం’ సినిమాగా వస్తోందన్న వార్తే సినీ పరిశ్రమలో అందర్నీ ఆశ్చర్యపరిచింది.. సంతోషపెట్టింది కూడా. సీరియల్‌లోనే అన్ని నవ్వులుంటే.. సినిమాలో ఇంకెన్ని నవ్వులుంటాయో.. ఎలాంటి పంచ్‌లతో ప్రేక్షకులకి నటీనటులు కడుపుబ్బా నవ్విస్తారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వేచి చూడక తప్పదు. టెన్షన్‌ నుంచి రిలీఫ్‌ దక్కాలంటే ‘చందమామలో అమృతం’ తాగాల్సిందేనంటున్నారు సినీ జనం ఈ సినిమా గురించిన చర్చలు వస్తే.

మరిన్ని సినిమా కబుర్లు
Raviteja.. Is it true?