Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
amrutham in moon

ఈ సంచికలో >> సినిమా >>

రవితేజా.. నిజమేనా?

Raviteja.. Is it true?

మాస్‌ మహరాజా రవితేజ ఓ సినిమా కోసం పది కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేశాడన్న గాసిప్‌ తెలుగు సినీ పరిశ్రమలో ‘దావానలం’లా వ్యాపించేసింది.  ఇలాంటి వార్తలు ఎవరికైనా డ్యామేజింగే. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, ‘బలుపు’తో ఊరట పొందాడు. ఈ టైమ్‌లో ఈ వార్తలు రావడం రవితేజకు ఇబ్బంది కలిగించక మానవు. అందుకే గాసిప్‌ రాగానే రవితేజ ఖండించేస్తే బెటర్‌ అంటున్నారు సినీ పరిశ్రమలో కొందరు.

ఫలానా హీరో రెమ్యునరేషన్‌ ఫలానా అని ఎప్పుడూ గాసిప్స్‌ వస్తూనే వుంటాయి. పవన్‌కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌ 18 కోట్లు అనే గాసిప్‌ ఒకటొస్తే, మహేష్‌ 20 కోట్లు తీసుకుంటున్నాడని నమ్మశక్యం కాని గాసిప్స్‌కి కొదవ వుండదు. మంచి స్వింగ్‌లో వున్నవారికి ఈ గాసిప్స్‌ ఇబ్బంది పెట్టవుగానీ, ఇంకో హిట్‌ వెంటనే కొట్టాల్సిన తరుణంలో రవితేజకి ఈ గాసిప్స్‌ కెరీర్‌ పరంగా ఆటంకాలు కలిగించే ప్రమాదం వుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam