Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beerakaaya pachadi

ఈ సంచికలో >> శీర్షికలు >>

రంజాన్ ప్రసాదం - .

Ramzaan - Haleem

ఆగస్ట్ 9 రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందిరికీ రంజాన్ శుభాకాంక్షలు. శివారాధకులకి కార్తిక మాసం ఎలాగో ముస్లిములకి రంజాన్ మాసం అలాగ. గత మాసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రమే ఆహారం స్వీకరిస్తూ గడిపారు ముస్లిం సోదరులు. దానినే ఇఫ్తార్ అంటారు.

ఒకప్పుడు హైదరాబాద్ లో ఇఫ్తార్ సమయంలో పళ్లు, పెరుగువడ ఎక్కువగా విక్రయించేవారు. కానీ గత పది పదిహేనేళ్లుగా నగరంలో హలీం విక్రయాలు జోరందుకున్నాయి.

రంజాన్ కు నెల ముందే హలీం తయారు కోసం అవసరమయ్యే ఒక ప్రత్యేక బాణీతో కూడిన పొయ్యిని సిధ్ధం చేసుకుంటారు. ప్రతి ఉదయం జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, ఏలకులు మొదలైన సుగంధ మూలికలు, గోధుమ పిండి, స్వచ్చమైన నెయ్యితో పాటు మాంసాన్ని ఆ బాణీలో వేసి సాయంత్రం వరకు ఒక నిర్ణీత ఉష్ణొగ్రతలో మగ్గపెట్టగా తయారయ్యేదే హలీం.ఉదయాన్నే దినుసులు, మాంసం అన్నీ కలిపి బాణీలో వేసి సాయంత్రం దాకా మగ్గ పెడతే హలీం తయారవుతుంది. పది నిమిషాల్లో తినేసే ఈ హలీం వెనుక పది గంటల శ్రమ ఉంటుందన్నమాట.  ఆరోగ్య రీత్యా గాని, మరే ఇతర కారణాల వల్ల కానీ శాకాహారానికే పరిమితమయ్యే వారి కోసం ప్రత్యేకంగా మాంసరహిత హలీం కూడా అందిస్తున్న వారున్నారు. ఇది అన్యమతాల్లోని శాకాహారులను విశేషంగా ఆకర్షిస్తోంది.

హలీం తినడానికి విక్రయశాలల వద్ద పెద్ద పెద్ద క్యూలే ఉంటున్నాయి. అనేక దేశాలకు ఈ హలీం హైదరాబాద్ నుంచి ఎగుమతి కూడా అవుతోందంటే ఈ రుచికున్న ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది.

కేవలం రంజాన్ మాసంలోనే కాక ఏడాది పొడుగునా హలీం తినిపించే కొన్ని స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో.

మరిన్ని శీర్షికలు