Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dil raju heart feelings

ఈ సంచికలో >> సినిమా >>

బాబోయ్ బాహుబలి గెడ్డాలు

bahubali beards

రాజమౌళితో పెట్టుకుంటే అంతే. సినిమా నిర్మాణానికి రాజమౌళి ఎక్కువ టైమ్ తీసుకుంటాడు కాబట్టి, ఆ టైమ్ లో ఆ సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లకు కొంచెం ఇబ్బందికరంగానే వుంటుంది. గెటప్ల విషయంలో రాజమౌళి తీసుకునే జాగ్రత్తలు ఒక్కోసారి నటీనటుల్ని ఇబ్బంది పెడతాయి. అదే జరుగుతోంది ప్రభాస్, సుబ్బరాజులకి. ఈ సినిమాలో వీరిద్దరూ గెడ్డాలతో కన్పించబోతున్నారు.

కంటిన్యూటీ మిస్ అవకూడదు కదా, అందుకే బయట కూడా గడ్డాలతోనే తిరగాల్సి వస్తోంది. సహజత్వం కోసం రాజమౌళి, నటీనటులతో బలవంతంగా అయినా, ఒకే గెటప్ ని సినిమా పూర్తయ్యేదాకా మెయిన్ టెయిన్ చేయిస్తుంటాడు. విగ్గుల్లో అయితే సహజత్వం వుండదు కదా. ‘మగధీర’ సినిమా విషయంలో రామ్ చరణ్ జుట్టుతో ఎలాగైతే బయట కూడా కన్పించేవాడో, ఇప్పుడదే పని ప్రభాస్, సుబ్బరాజు చేస్తున్నారు.

బాబోయ్ ‘బాహుబలి’ గెడ్డాలు అని, ప్రభాస్ ని ఎక్కడ ఎవరు ఈ మధ్యకాలంలో చూస్తున్నా అనుకుంటున్నారు. స్క్రీన్ పైన కన్పించే గెటప్ కీ, ఆ హంగామా లేకుండా రియల్ లైఫ్ లో పెద్ద గడ్డంతో కన్పించడానికీ చాలా తేడా వుంటుంది. స్క్రీన్ పై అద్భుతంగా వుంటే, రియల్లైఫ్ లో చూడ్డం కష్టంగా వుంటుంది. అయినా తప్పదు మరి. రాజమౌళి కదా అక్కడున్నది.

మరిన్ని సినిమా కబుర్లు
at that time she is sweet sixteen