Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalutelugu serial twenty sixth Part

ఈ సంచికలో >> సీరియల్స్

దురదృష్టపు దొంగలు

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే సీరియల్ ఇది.

1) ఒహోయ్ రాష్ట్రంలోని యాంహరెస్ట్ అనే ఊరికి చెందిన మిస్ లౌరీ రాస్టన్ ఓ పోలీసు రిసెప్షనిస్టు ఉద్యోగానికి అప్లికేషన్ పంపింది. ఆ ఇంటర్ వ్యూకి కూడా వెళ్ళింది. సెలక్ట్ అవ్వడంతో మరునాడు వచ్చి అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోమన్నారు.

కానీ మర్నాడు సదరు చిన్నది పోలీస్ ఆఫీసుకి, అధికారుల దగ్గరకు వెళ్ళగానే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె బేక్ గ్రౌండ్ చెక్ ని పోలీసులు రొటీన్ గా నిర్వహిస్తే, ఆమె 17 ట్రాఫిక్ నేరాలు చేసి పోలీసులకు దొరకలేదని తెలిసింది.

"సింహం వేటకి బయటకి వెళ్ళేబదులు కుందేలే సింహం గుహలోకి వచ్చినట్లయిందన్నమాట."

2) కేలిఫోర్నియాలోని ఫ్రెస్నో అనే ఊర్లో రాబర్ట్ అనే అతను సినిమా చూసి, తన కారు దగ్గరకి వెళ్ళాడు. కారు డిక్కీలోంచి ఎవరో బాదుతున్న చప్పుడు వినిపించి, వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చాక కారు డిక్కీ మూత తీస్తే, అందులోంచి ఓ దొంగ పాక్కుంటూ బయటకు వచ్చాడు.

దొంగ తాళం చెవితో ఆ దొంగగారు కారు డిక్కీ తాళం తీసి, దొంగతనానికి లోపలకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. కాని ఆ కారు డిక్కీని లోపలనుంచి తెరిచే సౌకర్యం లేకపోవడంతో ఆ దురదృష్టపు దొంగ అందులో ఇరుక్కుపోయి చిక్కుపడిపోయాడు.

మరిన్ని సీరియల్స్