Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

నయనతార గర్భవతి కాదా?

Nayanatara is not a Pregnant

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘కహానీ’ సినిమా తెలుగులోకి రీమేక్‌ అవుతోంది. శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. విద్యాబాలన్‌ పాత్రని తెలుగులో నయనతార పోషిస్తోంది. ఒరిజినల్‌ వెర్షన్‌లో విద్యాబాలన్‌ గర్భిణిగా కన్పించింది. ఈ పాత్ర కోసం కొంచెం ఒళ్ళు చేసిన విద్యాబాలన్‌, ఆ పాత్రలో నటిగా తన సత్తా చాటుకుంది, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.

తెలుగు వెర్షన్‌లో శేఖర్‌ కమ్ముల తనదైన మార్పులు చేస్తున్నాడు. వాటిల్లో కీలకమైన మార్పు ఏంటంటే, ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న నయనతార ప్రెగ్నెంట్‌గా కన్పించదట. విద్యాబాలన్‌ ప్రెగ్నెంట్‌గా కన్పించబట్టే ఆ పాత్ర పండించే హావభావాలు, సన్నివేశాల్లోని భావోద్వేగాలూ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

క్లీన్‌ సినిమాలు తీసే శేఖర్‌ కమ్ముల, నటీనటులనుంచి ప్రతిభను రాబట్టడంలో దిట్ట. సన్నివేశాల్ని రక్తికట్టించడంలో.. మరీ ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌ని తనదైన స్టయిల్లో తెరకెక్కించడంలో నేర్పరి అయిన శేఖర్‌ కమ్ముల ‘కహానీ’ తెలుగు రీమేక్‌ని ఒరిజినల్‌కి ధీటుగా తెరకెక్కించగలడా? తెరకెక్కించగలిగితే మాత్రం ఆయన వెరీ వెరీ స్పెషల్‌ అన్పించుకోగలుగుతాడు.

మరిన్ని సినిమా కబుర్లు
Tamil Psycho