Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tamil Psycho

ఈ సంచికలో >> సినిమా >>

వీర్యదాత వేటలో మధుర శ్రీధర్‌

Madhura Sridhar in Searching of Sperm Donar

‘స్నేహగీతం’, ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’ చిత్రాల దర్శకుడు మధుర శ్రీధర్‌, బాలీవుడ్‌ సినిమా ‘విక్కీ డోనర్‌’ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నాడన్న వార్త అందరికీ తెలిసినదే. చాలా రోజులుగా ఈ సినిమా కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలచడంలో మధుర శ్రీధర్‌ బిజీగా వున్నారు.

కథలో మార్పులు, చేర్పులతోపాటుగా, ఈ సినిమాలో నటించబోయే నటీనటుల విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట మధుర  శ్రీధర్‌. ‘విక్కీ డోనర్‌’ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్‌ ఖురానా ఆ సినిమాకి ప్లస్‌ అయ్యాడు. అంతటి అందగాడు, షార్ప్‌ లుక్స్‌ వున్న కుర్రాడి కోసం అన్వేషిస్తున్న మధుర శ్రీధర్‌, కొత్త కుర్రాడిని తీసుకుందామా? లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌ అయిన హీరోని ఎంపిక చేయడమా? అన్నదానిపై సస్పెన్స్‌లో పడిపోయారు.

హీరో హీరోయిన్లు ఖరారయ్యాక సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాలని మధుర శ్రీధర్‌ డిసైడయ్యారట. ‘దానకర్ణ’ అనే టైటిల్‌ అనుకుంటున్న మధుర శ్రీధర్‌, దాన్ని ఆల్రెడీ రిజిస్టర్‌ చేయించారు కూడా. హిందీ వెర్షన్‌లో హీరోయిన్‌గా ‘గౌరవం’ ఫేం యామీ గౌతమ్‌ నటించింది. తెలుగు వెర్షన్‌లో ఎవరు నటిస్తారో?

మరిన్ని సినిమా కబుర్లు
Celebrities at Double Satavadhanam