Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
icchata vidaakulu ivvabadavu

ఈ సంచికలో >> కథలు >> మధుర శ్రీధర్‌ నిర్మాతగా ‘ఓం మంగళం మంగళం’

దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు తక్కువ సినిమాలతోనే మధుర శ్రీధర్‌. ఆడియో కంపెనీ నుంచి దర్శకత్వం లోకి, ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి  ప్రవేశించిన మధుర శ్రీధర్‌ తాజాగా ‘ఓం మంగళం మంగళం’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ సినిమా చేస్తున్నారు.}

తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన సంజీవ్‌ను తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం చేస్తున్న మధుర శ్రీధర్‌, ఈ సినిమాని ఆగస్ట్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. సంజీవ్‌ గతంలో హిందీలో ‘లాగిన్‌’ అనే సినిమాని రూపొందించాడు. భిన్నమైన కథాంశంతో యూత్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా వుంటుందని సమాచారమ్‌.

నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమా టైటిల్‌ దగ్గర్నుంచి ప్రతి అంశమూ డిఫరెంట్‌గా ఉండేలా నిర్మాత మధుర శ్రీధర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. చిన్న సినిమాల్ని క్వాలిటీతో రూపొందించడంలో నేర్పరి అయిన మధుర శ్రీధర్‌ ఈ సినిమాని కూడా అలానే రూపొందించనున్నారట. పూర్తి వివరాలు రానున్న కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

మరిన్ని కథలు
great begin for tollywood