Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్య రెడీ, బచ్చన్‌దే లేటు

balayya with bacchan

'రైతు' సినిమా తన 101వ సినిమాగా చెయ్యాలని బాలకృష్ణ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారనే గాసిప్స్‌ వినిపించాయి గతంలో. అయితే ఇంతవరకూ ఈ సినిమా విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదట. ఈ సినిమా కోసం అమితాబ్‌ బచ్చన్‌ని బాలకృష్ణ సంప్రదించారు. దర్శకుడు కృష్ణవంశీ కూడా అమితాబ్‌ని కలిశారు. అయితే సినిమా చేయననిగానీ, చేస్తాననిగానీ అమితాబ్‌ చెప్పినట్లు లేదని బాలకృష్ణ తాజా ఇంటర్వ్యూలను బట్టి అర్థమవుతోంది. ఆ పాత్రకి ఆయన తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేమని స్వయంగా బాలకృష్ణ చెప్పారు.

ఇప్పుడు 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా కోసం సీనియర్‌ నటి హేమామాలినిని తీసుకొచ్చారు బాలయ్య. అలాగే తన తదుపరి సినిమా కోసం అమితాబ్‌ని తీసుకురాగలిగితే బాలయ్య గ్రేటే. గతంలో అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని ఫ్యామిలీ సినిమా అయిన 'మనం' సినిమా కోసం ఓ గెస్ట్‌ రోల్‌లో నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది కూడా. మరో విషయం ఏంటంటే ఒకవేళ కృష్ణవంశీ సినిమా లేకపోతే, తదుపరి బాలకృష్ణ ఎవరితో చేస్తారనేది సస్పెన్స్‌గా ఉంది ప్రస్తుతం. తాజాగా పూరి జగన్నాథ్‌ కూడా బాలయ్య సినిమా కోసం లైన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. బాలకృష్ణకి ఓ కథ చెప్పడానికి పూరీ రెడీగా ఉన్నారట. ఒకవేళ పూరి చెప్పే కథ నచ్చితే అదే పట్టాలెక్కే అవకాశం కూడా లేకపోలేదని తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
b.jaya directing vaishakam movie