Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya with bacchan

ఈ సంచికలో >> సినిమా >>

వేసవిలో 'వైశాఖం': దర్శకురాలు బి.జయ

b.jaya directing vaishakam movie

 తెలుగు తెరపై మహిళా దర్శకులు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఈ తరం మహిళా దర్శకుల్లో బి.జయది ప్రత్యేకమైన శైలి. కథల ఎంపికలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా ఆమె నుంచి 'చంటిగాడు', 'లవ్‌లీ' తదితర సినిమాలొచ్చాయి. తాజాగా బి.జయ అంతా కొత్తవారితో 'వైశాఖం' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయనున్నారట. వచ్చే నెలలోనే చిత్ర ఆడియో విడుదల వేడుక ఉంటుందని ఆమె చెప్పారు.

అంతా కొత్తవారితో సినిమా చేస్తున్నా సెట్స్‌లో ఎలాంటి సమస్యలూ రాలేదనీ, పైగా షూటింగ్‌ వాతావరణం చాలా యూత్‌ఫుల్‌గా ఉండేదని ఆమె వివరించారు. వెండితెరపై ఇదో సరికొత్త దృశ్యకావ్యంలా ఉంటుందని జయ అంటున్నారు. గతంలో వచ్చిన 'లవ్‌లీ' సినిమా పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. యంగ్‌ హీరో ఆదికి ఈ సినిమా మంచి సినిమా అయ్యింది. అలాగే తాజాగా తెరకెక్కుతోన్న 'వైశాఖం' సినిమా కూడా కమర్షియల్‌ అంశాలు ఉంటూనే, యూత్‌కి మంచి మెసేజ్‌ ఇచ్చే సినిమా అవుతుందని అంటున్నారు బి.జయ. అంతేకాదు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుందని చెప్పారామె. ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత బి.ఎ.రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే హరీష్‌, అవంతిక హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు ఈ సినిమాతో. 

మరిన్ని సినిమా కబుర్లు
lukkunnodu is comming