Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Hair Fall | Complete Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాటుకోడి ఇగురు - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:

నాటుకోడి
మసాలా ( అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, లవం గాలు, దనియాలు, గసగసాలు, జీలకర్ర)
పచ్చిమిర్చి,
ఉల్లిపాయలు
పసుపు
కారం

తయారుచేసే విధానం:
ముందుగా మసాలాకు కావలిసిన  ( అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, లవం గాలు, దనియాలు, గసగసాలు, జీలకర్ర) వీటన్నింటినీ ముద్దగా చేసి వుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి.  తరువాత పసుపు వేసి, నాటుకోడి ముక్కలను వేసి బాగా కలపాలి. 2 నిముషాల  తరువాత కారం, ఉప్పు వేసి కలిపి, చివరగా తయారుచేసిన మసాలాముద్దను వేసి కలపాలి. చివరగా కొన్ని నీళ్ళు పోసి ఉడికేవరకూ  మూత పెట్టాలి. అంతేనండీ నాటుకోడి పులుసు రెడీ....  

మరిన్ని శీర్షికలు
sahiteevanam