Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope april 17rd to april 23rd

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిషం-విజ్ఞానం - శ్రీకాంత్

 

                                                    శ్రీ గురుబ్యోనమః

న్యూటన్ జ్యోతిషాన్ని చెప్పాడా ? 
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్న ఒక్క భారదేశంలోనే జీవనవిధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవిధంగా, ఉన్నట్టు ఎక్కడా ఉండలేరు. తాముచేసిన ప్రతిపనికి ఒక లెక్క ఉంటుంది అన్నది భారతీయుల విశ్వాశం. అలాగే చేసే ప్రతి క్రియకు ప్రతి క్రియ ఉంటుంది అనేది నమ్మకం ఇదే సూత్రాన్ని ఐజాక్ న్యూటన్ ప్రతిపాడించాడు. న్యూటన్ మూడవ సూత్రం ప్రకారం "చర్యా ప్రతి చర్యకు సమానం " అంటే మనం ఒక వస్తువు పైన శక్తిని ప్రయోగిస్తే ఆ వస్తువు నుండి కూడా తిరిగి ఎదురుగా శక్తి ఉత్పన్నమవుతుంది. ఒక బంతిని నేలపైన కొడితే అంతే వగంతో పైకి ఎగురుతుంది. దీన్నే మనపూర్వీకులు కర్మ అన్నారు అంటే మనం ఎదుటి వారికి చేసే సహాయం మూలాన ఎక్కడో ఒకచోట కావొచ్చు తిరిగి అతనే వల్లే కావొచ్చు తిరిగి ప్రత్యుపకారం పొందుతాం అని అర్థం.
కర్మకి జ్యోతిషానికి గల సంభందం ఏంటి ? 
ఉన్నతమైన జీవనవిధానంలోకి మనం వెళ్ళాలనే భావనే అందరిది. ఉన్నతమైన పనులను ఆచరించుట వలన అది సాధ్యమైతుంది. మరి జ్యోతిషం ఏమి తెలియజేస్తుంది ఈ విషయాన్నే తెలియజేస్తుంది. మన ఆలోచన విధానం వలన జీవిన పద్దతుల వలన ఉత్తమస్తితికి వెళ్ళగలం అని చెపుతున్నది. భగవంతుడు ఉన్నడా ? లేడా ? అన్నది నాస్తీకులకు,అస్తీకులకు మధ్య నిరంతరం జరుగుతున్న చిన్న పాటి కాదు కాదు మహాసంగ్రామం అనే చెప్పవచ్చును. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన గతజన్మ తప్పులను ఇప్పుడు అనుభవించుట ద్వారా లేదా తొలగించుకోవడం ద్వార ఫలితాలను పొందవచ్చు అని చెప్తుంది. దీన్నే జ్యోతిషం బలపరుస్తుంది. జప,దాన ,హోమ క్రతుల ద్వార మనం ఖర్మను నివృత్తిచేసుకోవచ్చును అని తెలియజేస్తుంది.

అసలు కర్మ ఉందా? 
ఉంది లేదు అనే విషయం పక్కకు పెడదాం మనం నిరంతరం ఆసుపత్రికి వెళ్తుంటాం అలాగే వైద్యున్ని భగవంతుడు అంటాం కదా . బాగుంది సరే నేడు ఎన్నో రోగాలు వాటికి తమ పరిశోధనల ద్వార వాటిని జయించేమార్గాల కోసం అన్వేషణ ఒక ప్రక్క అలాగే వైద్యుల ద్వార మనం వాటిని పొందుతున్నాం బాగుంది. నేడు ఎంతోమంది ఎన్ని వ్యాదులకు గురవుతున్నారు  ఒక వ్యాధి అతనికే ఎందుకు రావాలి ఇతనికి ఎందుకు రాకూడదు సమాధానం చెప్పగలరా ? సరే లంగ్స్,లివర్ ,కిడ్నీల పరమైన ఇబ్బందులను ఉదాహరనగా తెసుకుందాం పొగత్రాగడం,మద్యంసేవించుట ద్వార పై ఇబ్బందులు కలుగుతాయి మరి నేడు ఎలాంటి అలవాట్లు లేనివారు పై ఇబ్బందులను పొందుతున్నారు కదా దానికి సమాధానం చెప్పగలమా ? కొంత వరకు జన్యుపరమైన ఇబ్బందులు అంటారు అవును సరే ఆ కుటుంబంలో జన్మించిన మిగితా సంతానానికి కూడా రావాలి కదా ? ఎందుకు రావడం లేదు ఆలోచించండి. ఇక్కడే జ్యోతిషులు సమాధానం పొందగలరు శాస్త్రాల ద్వార అదే ఖర్మ అని. ఖర్మ అనేది చెడ్డ పదం కాదు మనం చేసే క్రియకు చెల్లింపుబడే నజరానా లేదా జరిమాన కాదంటారా ?

కర్మను జయించలేమా ?                                                                
ఎంత శాస్త్రాన్ని అవపొసనా పట్టినా, విజ్ఞానాన్ని అవధులు లేకుండా చేసిన మరణాన్ని జయించలేము అన్నది సత్యం అదేవిధంగా కర్మను కూడా పూర్తిగా జయించలేము. జ్యోతిషం ద్వార తెల్సుకోనేది జపాలు, హోమాలు, దానాల వలన వాటిని కొంతమేర తగ్గించుకోవచ్చును మిగితాది అనుభవించుట వలన జరుగుతుంది. ఒకసారి రామకృష్ణపరమహంస తన శిష్యుడు తనని అడుగుతాడు మీకున్న పరిజ్ఞానం లేదా శక్తుల ద్వార మీకొచ్చిన రాచపుండును తగ్గించుకోవచ్చు కదా అంటే దానిని అనుభవించుట ద్వార నేను విముక్తుడను అవుతాను లేకపోతే మల్లి ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలిసిందే కదా అంటాడు. మంచి పనులను చేయుట ద్వార మనం మంచికర్మను సాదిద్దాం. కొన్ని కొన్ని విషయాలకు సమాధానం ఉండదు అలాగని వాటిని కాదు అనడం ముర్కత్వమే అవుతుంది. అప్పుడే పుట్టిన పసిపాపకు తన తల్లి ఎవరు అని చెప్తారు చెప్పకుండానే తల్లిని గుర్తిస్తుంది.  అలాగే మనం ఎంత విజ్ఞాన్ని తెలుసుకున్న అలాగే సాధించిన కొన్నింటిని సాధించలేం అది గుర్తెరిగి మసలు కోవడం అసలైన విజ్ఞానం. 
మరిన్ని శీర్షికలు
temple