Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - డా. ఎ. రవీంద్ర

 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం. దేశంలో సగానికి సగం యూత్

యువత అంటే...!?
ఉరికే జలపాతాల ఉత్సాహం...!
ఎగిరే పతంగాల ఆశలు...!
ఆకాశాన్ని సైతం నేలకు దించే ఊహలు...!!
వాస్తవానికి, అవాస్తవానికి మధ్య కలల ప్రపంచం...!!
కాలోజ్ కాంపౌండ్స్ లో... తొలి పరిచయాల అనుభుతులల్లో..
స్నేహానికి... ప్రేమకు మధ్య త్రాసులో జీవితాలు....
విజయానికి, అపజయానికి మధ్య మార్కుల కొలమానాలు....
ఉద్యోగ వేటకు, ఆర్ధిక భరోసాకు మధ్య పరుగులు....
కోరికల వలలకు, సముద్రాల లక్ష్యాలకు మధ్య నిరుత్సాహాలు...
అమ్మానాన్నలకు, ప్రేయసీ ప్రియులకు మధ్య సున్నితమైన పొరలు...
నాలుగు రోడ్ల కూడలిలో నిలబడిన ప్రయాణాలు....
ఆత్మహత్యలు... ఒంటరితనపు కన్నీళ్లు.
ఓదార్పులు.... ఎదురుచూపులు...
కాలేజ్.... లవ్ ... ఫ్రెండ్ షిప్... మెసేజ్... వాట్స్ ప్...
ఫేస్ బుక్ లో లైక్ లు.... పబ్స్... పరిచయాలు...
ఎటూ తేల్చుకోలేని నిరాశల మధ్య భవిష్యత్ కు పునాదులు నిర్మించుకోవాలి...
కాలంతో పోటీ పడుతూ.... కసిగా చదువుతూ...
ప్రలోభాల మధ్య... చక్కని వ్యక్తిగా ఎదుగాలి...
లక్షలు సంపాదించినా... సంపూర్ణ మానవునిగా జీవించాలి.
యంత్రాల మధ్య చిరునవ్వుల జీవితాన్ని చిగురింపజేయాలి.
గుప్పెడు సంతోషం కోసం హృదయాన్ని సిద్దం చేయాలి.
అందుకే.....
యువత కోసం.. వారి లక్ష్యాలకు దారుల నిర్మించడం కోసం...
వారి ఉన్నత జీవితానికి మార్గాలు వెయ్యడం కోసం...
యువతే... లక్ష్యంగా... వారి మనోవేదికే యవనికగా...
మహోన్నతమైన మానవీయ విలువల అక్షర రూపంగా...
వారి మనసే కాన్సెప్ట్ గా...
సరికొత్త శీర్షిక... రాబోతుంది...
ముఖ్యంగా నేటి యువతే లక్ష్యంగా ఈ శీర్షిక ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యతనిస్తూ, వారి ఆలోచనలు, అభిప్రాయాలు, సమస్యలు, అనుభూతులకు అద్దం పట్టే విధంగా ఆసక్తికరంగా సాగుతుంది. అలానే నేడు కాలేజ్ యూత్, ఉద్యోగాలు చేసే యువత మధ్య ఉన్న సంబంధాలను చర్చ, ప్రేమ, స్నేహం, యవ్వనంలో ఉండే  స్త్రీ, పురుష సంబంధాలలో తలెత్తే సున్నితమైన సమస్యలకు ప్రాధాన్యత, పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య పెరుగుతున్న అంతరాలు, చదువుల్లో కొరవడుతున్న మానవీయ విలువలు, మరో వైపు టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఆలోచనా ధోరణులలో యువతకు మార్గనిర్దేశం చేసేలా ఈ శీర్షిక ఉంటుంది.. ప్రతి వారం సరికొత్తగా ఉండేలా పాఠకులకు ఉపయుక్తంగా ఉంటూ, మిమ్మల్నలరిస్తుంది

మరిన్ని శీర్షికలు
sahiteevanam