Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope april 24th to april 30th

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిషం-విజ్ఞానం - శ్రీకాంత్

 

భూమ్మీద జీవించే జీవజాతులు ఎన్నో ఉన్నాయి అందులో మానవుడు తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఆలోచించే శక్తి అలాగే నిర్మాణం చేయగలిగిన మేధస్సు మానవునికి సొంతం. విచక్షణ అలాగే తోటివారికి సహాయం చేయడం ఇలా చెప్పుకుంటూ పొతే మానవుడు చేయలేంది ఏది లేదు అని చెప్పవచ్చును. మానవుడు నేడు అంతరిక్షంలో తన ఆలోచనలకు అనుగుణంగా ప్రయోగాలను చేస్తున్నాడు అదేవిధంగా అన్వేసిస్తున్నాడు.

మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది భారతీయుడా?
అవును అనేది సమాధానం మనం ఇంతకు ముందు ఆయుర్వేదం. హోమియోపతి విధానాల గురుంచి తెలుసుకున్నాం. అయితే నేడు మనం అందరం అనుకున్నట్లుగా విజ్ఞానం విదేశాల నుండి అరువు తెచ్చుకున్నది కాదు మనం ఎప్పటినుండో ప్రతి విషయంలో ముందు ఉన్నాం. ప్లాస్టిక్సర్జరీ నేడు మానవునికి పునజన్మను ఇచ్చే విధానం మరి అంతటి గొప్ప విధానం ఎక్కడి నుండి వచ్చింది. నేడు మనం పుస్తకాల్లో , చాలా మంది ఆలోచనల్లో మొదట ఆమెరికన్ వాళ్ళు చేసారు అని వారి ప్రకారం మొట్టమొదటగా 1827 లో జాన్పీటర్ అనే వైద్యుడు అలాగే రోమన్ల ప్రకారం మొదటి శతాబ్దం క్రీస్తుశకంలో ఆలుస్కర్నిలుస్ అని చెప్తారు.

ప్లాస్టిక్సర్జరీ కి పితామహుడు మన దేశానికి చెందిన వైద్యుడు " శుశ్రుతుడు " తను క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలుగా తెలుస్తుంది. శుశ్రుతుడు పదునైన రాళ్ళను ఉపయోగించి ఈ సర్జరీని చేసాడు అని తెలుస్తుంది అంటే ప్రపంచంలో మనం విజ్ఞానాన్ని అరువు తెచ్చుకోలేదు అని తెలుస్తుంది కదా . మన గొప్పతనాన్ని మనమే స్మరించుకోకపొతే ఎవరు స్మరిస్తారు చెప్పండి.  ఆధునిక వైద్యాన్ని జ్యోతిషం ముందే చెప్పిందా ?

అవును ముందే చెప్పింది నేడు ఆధునిక వైద్యంలో వివిధ విభాగాలు వాటికి స్పెసలిస్ట్ వైద్యులు ఉన్నారు కదా అదేవిధంగా జ్యోతిషంలో ఏ శరీరభాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలియజేస్తాయి. మేషదిగా ఉన్న ద్వాదశరాశులు వాటికి వర్తించే రుగ్మతలను తెలుసుకోవచ్చును.   రాశులను మానవుని అవయవాలకు సూచికలుగా బృహజ్జాతకంలో తెలియజేసారు. అవి వరుసగా తెలుసుకుందాం 

మేషం .... శిరస్శు  
వృషభం  ..... ముఖం
మిథునం  ......  బాహువులు,మెడ చాతిభాగం
కర్కాటకం ....... హృదయం        
సింహం  ......  కడుపు ( పైభాగం )    
కన్యా ..... నాభిస్థానం,నడుము మరియు ప్రేవులు
తుల ..... కడుపు (క్రింది భాగం )      
వృశ్చికం .... బాహ్యజనన అంగాలు            
ధనుస్సు ..... తొడలు
మకరం .... మోకాళ్ళు 
కుంభం .....  కాళ్ళు                                      
మీనం .... పాదాలు

ఈవిధంగా తెలియజేసారు మన ఋషులు అదేవిధంగా ఏ ఏ భావాలు ఏమి తెలియజేస్తాయో ముందు ముందు తెలుసుకుందాం.
మరిన్ని శీర్షికలు
Sinusitis | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)