Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: దోచెయ్‌
తారాగణం: నాగచైతన్య, కృతి సనోన్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, రావు రమేష్‌, రవిబాబు, సత్య, ప్రవీణ్‌ తదితరులు.
చాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌
సంగీతం: ఎం.ఆర్‌. సన్నీ
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
దర్శకత్వం: సుధీర్‌ వర్మ
నిర్మాత: బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌
విడుదల తేదీ: 24 ఏప్రియల్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
చందు (చైతన్య) చిన్న చిన్న మోసాలు చేసి, తన చెల్లెల్ని చదివిస్తుంటాడు. అతనికి ఓ గ్యాంగ్‌ వుంటుంది. చందు ఓ సందర్భంలో మీరా (కృతి సోనన్‌)ని కలుస్తాడు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అనుకోకుండా చందుకి ఓ పెద్ద అవసరం వచ్చిపడుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవడంతో, ఆ వేటలో వున్న చందుకి మాణిక్యం (పోసాని) పరిచయమవుతాడు. అక్కడి నుంచి చందుకి ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి చందు ఎలా గట్టెక్కాడు? ప్రియురాల్ని ఎలా దక్కించుకున్నాడు? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
పాత్రకు అవసరమైనంత మేర పెర్‌ఫెక్ట్‌ ఔట్‌ పుట్‌ ఇచ్చాడు నటన విషయంలో చైతన్య. ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా చైతన్య బ్యాలెన్స్‌డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. కృతి సనన్‌ స్టైలిష్‌గా వుంది, నటనలోనూ మంచి మార్కులేయించుకుంది. గ్లామర్‌ ప్లస్‌ పెర్పాహెన్స్‌తో ఆకట్టుకుంటుంది కృతి సనన్‌.

పోసాని పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా వుంది. బ్రహ్మానందం నవ్వులు పూయించాడు. రవిబాబు ఓకే. వివా హర్ష, సత్య, ప్రవీణ్‌, సప్తగిరి తదితరులు సినిమాకి ఇంకాస్త హాస్యం అందించారు. మధురిమ ఓ సాంగ్‌లో గ్లామర్‌ పండిరచింది. రావు రమేష్‌ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

కామెడీ మిక్స్‌ చేసిన క్రైమ్‌ స్టోరీతో దర్శకుడు ఆడియన్స్‌ ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చాడు. చాలా రిచ్‌గా సినిమాని ప్రెజెంట్‌ చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రిప్ట్‌ బావుంది. స్క్రీన్‌ప్లే ఇంకా బెటర్‌గా చేసి వుంటే బావుండేది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఎనర్జిటిక్‌గా వుంది. మూడు పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ప్రధాన బలం ఈ సినిమాకి. రిచ్‌నెస్‌ ఇచ్చింది సినిమాటోగ్రఫీ. ఫస్టాఫ్‌లో ఇంకాస్త ఎడిటింగ్‌ అవసరమనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌ చాలా బాగున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బావుంది.

క్రైమ్‌ కామెడీ సినిమాలు తీసేటప్పుడు యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్నీ జాగ్రత్తగా బ్యాలన్స్‌ చేసుకోవాల్సి వుంటుంది. ఆ విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆడియన్స్‌ని సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు. ఫస్టాఫ్‌ బాగానే స్టార్ట్‌ అయినా, వెంటనే కాస్త డల్‌ అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ చాలా బాగుంది. సెకెండాఫ్‌ స్టార్టింగ్‌ నుంచీ సినిమా మంచి పేస్‌తో ముందుకు వెళుతుంది. యాక్షన్‌, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ సమపాళ్ళలో సెకెండాఫ్‌లో రంగరించాడు దర్శకుడు. ఓవరాల్‌గా సినిమా సగటు ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుంది. యూత్‌, క్లాస్‌ ఆడియన్స్‌ సినిమాకి రాజపోషకులు. మాస్‌ ఆడియన్స్‌ కూడా మెచ్చే కామెడీ వుండనే వుంది. సో, బాక్సాపీస్‌ వద్ద మంచి ప్రాఫిట్‌ గ్రాసర్‌ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
బాగానే దోచేస్తాడు.

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview