Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
common those things krutisanan

ఈ సంచికలో >> సినిమా >>

మ మ మాస్‌ నాగశౌర్య

mass nagasourya

క్లాస్‌ హీరో అనలేంగానీ పక్కింటి కుర్రాడిలా సింపుల్‌గా కనిపించే నాగశౌర్య నాలిక మడతేసి, విలన్లని చితక బాదే మాస్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అది తెలియాలంటే ‘జాదూగాడు’ సినిమా చూడాలి. హైటూ పర్సనాలిటీ అన్నీ ఉన్నా, అమాయకంగా కనిపించడం నాగశౌర్య స్పెషల్‌. క్లాస్‌ హీరోగా వచ్చే ఇమేజ్‌కన్నా మాస్‌ హీరోగా వచ్చే ఇమేజ్‌కి వెయిట్‌ ఎక్కువని భావించి మాస్‌ మూవీ ‘జాదూగాడు’కి ఓటేశాడు నాగౌశర్య. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఒక్కో యాంగిల్‌లో రవితేజలా, ఇంకో యాంగిల్‌లో పవన్‌కళ్యాణ్‌లా, మరో యాంగిల్‌లో మహేష్‌లా ‘జాదూగాడు’ ట్రైలర్‌లో కనిపిస్తున్న నాగశౌర్య, హీరోగా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ సృష్టించుకోడానికి ‘జాదూగాడు’ ఉపకరిస్తుందనే ధీమాతో ఉన్నాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న ఈ యంగ్‌ హీరో ‘జాదూగాడు’ సినిమాతో మ మ మాస్‌ హీరో అనిపించుకుంటాడా?

మరిన్ని సినిమా కబుర్లు
felt in nitya menon magic