Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mass nagasourya

ఈ సంచికలో >> సినిమా >>

నిత్యామీనన్‌ మాయలో పడ్డారు

felt in nitya menon magic

బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలతో హిట్లు కొట్టింది బొద్దుగుమ్మ నిత్యామీనన్‌. గ్లామర్‌ టచ్‌కి కొంచెం దూరంగా ఉండే నిత్యామీనన్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌తోనే అవకాశాలు సంపాదిస్తోంది, హిట్లు కూడా కొడుతోంది. ‘మళ్ళి మళ్ళి ఇది రాని రోజు’ అనే డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో 2015ని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్‌ చేసిన నిత్యామీనన్‌, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’తో డీసెంట్‌ హిట్‌ కొట్టింది. ఇటీవల వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతోనూ ఆడియన్స్‌ని మెప్పించింది నిత్యామీనన్‌. ‘గంగ’ సినిమా ఇన్‌ టైమ్‌లో రిలీజ్‌ అవలేదుగానీ, లేదంటే అది కూడా తమిళంలో హిట్‌ అయ్యింది గనుక, వరుసగా నాలుగు హిట్‌ సినిమాల్లో నటించిన ఘనత దక్కించుకునేదే. అతి త్వరలో ఆ సినిమా విడుదలవుతుంది. సోలో హీరోయిన్‌గానే సినిమాలు చేస్తాననే పట్టుదలకు పోకుండా సెకెండ్‌ హీరోయిన్‌గా కూడా నటించడానికి సిద్ధపడుతుండడం నిత్యామీనన్‌కి ప్లస్‌ పాయింట్‌. యాక్టింగ్‌ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్న నిత్యకి టాలీవుడ్‌ బ్రహ్మరథం పడ్తోంది. అల్లు అర్జున్‌తో నటించి, స్టార్‌ హీరోల దృష్టిలో పడ్డ ఈ భామకి తెలుగులో మిగతా స్టార్‌ హీరోలు అవకాశమివ్వడం ఖాయమేనేమో.

మరిన్ని సినిమా కబుర్లు
why statues and wepons for bahubali