Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
felt in nitya menon magic

ఈ సంచికలో >> సినిమా >>

‘బాహుబలి’ కత్తులేంటి? విగ్రహాలేంటి?

why statues and wepons for bahubali

కెరీర్‌లో పరాజయమెరుగని పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ రాజమౌళి. ఏ సినిమాకి ఆ సినిమానే మొదటి సినిమా అనే కసితో పనిచేయడం వల్లే రాజమౌళికి సక్సెస్‌ మీద సక్సెస్‌ వస్తూ దర్శకుడిగా అతని స్టార్‌ డమ్‌ పెరుగుతోంది. రాజమౌళి ‘బాహుబలి’తో ఇంకో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. అతి త్వరలో ఆడియన్స్‌ ముందుకు రానుంది ‘బాహుబలి’. భారీ తారాగణంతో నిర్మితమవుతున్న బాహుబలి కోసం, అన్నీ విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్న రాజమౌళి, పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ భవంతులు, విచిత్రమైన ఆయుధాలతో తెలుగు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నాడు. తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ, హిందీలోనూ పలు ఇతర భాషల్లోనూ ‘బాహుబలి’ విడుదలవుతుంది గనుక, ఇండియాలో సగటు సినీ ప్రేక్షకుడు ‘బాహుబలి’ చూసి, గొప్ప అనుభూతికి లోనవుతాడు. ఆ కత్తులు ఏంటి? ఆ విగ్రహాలు ఏంటి? అని ‘బాహుబలి’ ఫొటోస్‌ చూసి ఆశ్చర్యచకితులవుతున్న ప్రేక్షకులు తెరపై, సినిమా చూసి ఇంకెంత థ్రిల్‌ ఫీలవుతారో?

మరిన్ని సినిమా కబుర్లు
pavanijam and more