Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
why statues and wepons for bahubali

ఈ సంచికలో >> సినిమా >>

పవనిజం - అంతకు మించి

pavanijam and more


హీరో అంటే తెరపై విలన్లను చితకబాదడమే కాదు. సొసైటీకి ఉపయోగపడే మెసేజ్‌లు సినిమా ద్వారా ఇచ్చి ఊరుకోవడమూ కాదు. రియల్‌ లైఫ్‌లో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం నిజమైన హీరోయిజం. అది పవనిజంలా ఉంటుందేమో. అభిమానులు తమ హీరోని అమితంగా అభిమానించడమే పవనిజం కాదని, అంతకు మించిన అభిమానం, అంతకు మించి సమాజంపై తమకున్న బాధ్యతే పవనిజం అని పవన్‌ అభిమానులు ఇప్పటికే చాటారు. పవన్‌కళ్యాణ్‌ కూడా తన అభిమానులకు ఆదర్శంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటాడెప్పుడూ. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజ అనే బాలిక, తనకు పవన్‌కళ్యాణ్‌ని కలవాలని ఉందంటూ ‘చివరి కోరిక’ను వెల్లడిస్తే, మీడియా ద్వారా విషయం తెలుసుకుని, హుటాహుటిన ఆ బాలిక దగ్గరకు వెళ్ళాడు పవన్‌. కానీ ఆ సమయంలో శ్రీజ, పవన్‌ రాకను తెలుసుకోలేని అపస్మారక స్థితిలో ఉంది. శ్రీజ తల్లిదండ్రులను ఓదార్చి, శ్రీజ దీనస్థితిని చూసి కంటతడి పెట్టాడు పవన్‌. ఆ కన్నీళ్ళు వృధా పోలేదు. శ్రీజ కోలుకుంది, పవన్‌కళ్యాణ్‌ వద్దకు వచ్చింది కూడా. రెండు గంటలపాటు శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన పవన్‌, శ్రీజకు కొన్ని బహుమతులు ఇచ్చి పంపాడు. పవనిజం కాదిది, అంతకు మించి అనాలేమో.

మరిన్ని సినిమా కబుర్లు
365 days is a special movie for Ram Gopal Varma