Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pavanijam and more

ఈ సంచికలో >> సినిమా >>

‘365 డేస్‌’ వర్మకి స్పెషల్‌ మూవీ

365 days is a special movie for Ram Gopal Varma

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘365 డేస్‌’ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఇటీవల జరిగింది. నాగ శ్రీవాత్సవ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఓ జంట ఎమోషన్స్‌ ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లేని వర్మ రాసుకున్నారట. తన కెరీర్‌లోనే ‘365 డేస్‌’ స్పెషల్‌ మూవీ అని వర్మ చెప్పాడు. క్రైమ్‌ అన్న మాటకు అవకాశం లేకుండా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ‘నాకు ఓ మంచి భార్య దొరికింది. నా భార్యకు ఓ చెడ్డ భర్త దొరికాడు’ అని తన పెళ్ళి ఫెయిల్‌ అవడం గురించి వర్మ సరదాగా చెప్పాడు. నటీనటులు బాగా చేశారనీ, సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు వర్మ.  ‘365 డేస్‌’ సినిమా ఆడియో విడుదల వేడుకలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ మగాడు లేకుండా ఆడది బ్రతకలేదనీ, ఆడది లేకుండా మగాడు బ్రతకలేడనీ, వాళ్ళిద్దరూ కలిసి అసలే బతకలేరన్నాడు. ఏ రిలేషన్‌ అయినా సేవ్‌ చేసుకుంటూ వస్తేనే బావుంటుందనీ, లేదంటే ఏ రిలేషన్‌ అయినా ఎక్కువ కాలం నిలబడదని పూరి చెప్పారు.

మ్యూజిక్‌ గురించి అవగాహన వున్న వర్మ ఎమోషనల్‌ పర్సన్‌ అనీ, ఆయనతో పని చేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని సంగీత దర్శకుడు నాగ్‌ శ్రీవాస్తవ్‌ అన్నారు. దాదాపు పదేళ్ళ తర్వాత తాను చేస్తున్న లవ్‌ స్టోరీ అంటూ వర్మ తనకు చెప్పారనీ, వర్మ తన మొదటి సినిమాలా ‘365 డేస్‌’ని ఫీలవడం గొప్ప విషయమని హీరో నందు చెప్పాడు. వర్మతో సత్య`2 తర్వాత చేస్తున్న ఈ సినిమాలో తన మీద నమ్మకంతో తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు వర్మకి థ్యాంక్స్‌ చెప్పింది హీరోయిన్‌ అనైకా సోటి.

గీత రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ, విడాకులు తీసుకుని దూరంగా వున్న జంట, ఈ సినిమా చూస్తే వెంటనే దగ్గరైపోతారని చెప్పారు. పోసాని పాడిన పాట తనకు బాగా నచ్చిందన్నారు సిరాశ్రీ. కోన వెంకట్‌, వి.వి. వినాయక్‌, ఛార్మి, ఉత్తేజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ ఆడియో విడుదల వేడుకకు హాజరయ్యారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam