Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvu nalugu yugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం 01-05-2015 నుండి 07-05-2015 వరకు - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద ఇష్టమైనపనులకు సమయం ఇస్తారు నచ్చిన వారినుండి నూతన సమాచారం పొందుతారు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది వారితో కలిసి చర్చల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు వారితో సమయాన్ని గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు అవకాశం కలదు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మానసికంగా చిన్న చిన్న విషయాలకే హైరానాపడే అవకాశం ఉంది కొన్ని కొన్ని విషయాల్లో దృడంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం వలన మరింత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది.

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో సభ్యులతో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. అధికారులతో అనుకోని ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. దైవసంభందమైన పనులలో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి ద్వార నూతన విషయాలను తెలుసుకుంటారు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి.

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలకు సమయాన్ని ఇస్తారు కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది కాస్త ఓపికగా ఉండుట వలన మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తెచ్చుకుంటారు జాగ్రత్త. తల్లి తరుపు వారినుండి నూతన సమాచారం సేకరిస్తారు వారితో సమయం గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మార్పులకు ఆస్కారం ఉంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు చాలామందిని ఆకర్షిస్తుంది.

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయాన్ని ఇస్తారు నచ్చిన వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోని మార్పులకు ఆస్కారం ఉంది అధికారులతో చర్చల్లో పాల్గొనే సమయంలో నిదానంగా వ్యవహరించుట ముఖ్యం. కుటుంబసభ్యులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది, భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారు. ప్రయాణాలు చేయకండి వాయిదావేయుట వలన ఇబ్బందులు తగ్గుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఉన్నతవిద్యకోసం చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు శ్రీకారం చుడుతాయి కావున బాగా ఆలోచించి తీసుకోవడం వలన ఆశించిన ఫలితాలు పొందుతారు. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి సర్దుబాటు అవసరం.

సింహ రాశి : ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును కావున ఈ విషయంలో మీయొక్క విధానం సరిచుసుకోవడం మేలు. ఉద్యోగంలో అధికారులతో స్వల్ప మనస్పర్థలకు ఆస్కారం ఉంది మీరే కాస్త తగ్గుట వలన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో చాలావరకు అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి సొంత ప్రయత్నాలు మానుకోవడం మంచిది. కుటుంబసభ్యుల యొక్క ఆలోచనల విధానం మేకు నచ్చకపోవచ్చును కాకపోతే అవతలివారి విధానం తెలూస్కొనె ప్రయత్నం చేయుట ఉత్తమం. తండ్రియోక్క ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన చెందుతారు. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు వారినుండి నూతన విషయాలను తెల్సుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు పెద్దగా లబ్దిని చేకూర్చకపోవచ్చును.

కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి కాకపోతే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట మేలు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది వారితో నూతన చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మీయొక్క కొన్ని కొన్ని విషయాల్లో మార్చుకోవడం మూలాన మరింత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోదరసంభందమైన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి వచ్చు ఇబ్బందులను దైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.

తులా రాశి : ఈవారం మొత్తంమీద మానసికపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి,ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో సరైన శ్రద్ధను చూపుట అవసరం. వ్రుత్తివిషయంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత కలిగి ఉండుట మేలుచేస్తుంది నిదానంగా వ్యవహరించుట అవసరం. ఉద్యోగంలో సమయపాలన పాటించుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయంలో ఒక విధానం అంటూ లేకపోతే అనవసరమైన ఖర్చులను పొందుతారు. రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు వాటికి సమయాన్ని ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. విలువైన వస్తువులను కొనుగోలుచేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. మిత్రులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు.

వృశ్చిక రాశి  :
ఈవారం మొత్తంమీద బంధువర్గం నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో చర్చల్లో పాల్గొంటారు. గతంలో మీరు చేసిన పనులకు గాను సమాధానం చెప్పవలసి రావోచ్చును. నూతన నిర్ణయాలు తీసుకొనే విషయంలో కాస్త ఓపిక అవసరం. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలదు. జీవితభాగస్వామితో సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే చిననాటి మిత్రులను కలుస్తారు. సంతానం నుండి మీరు నూతన విషయాలు తెలుసుకుంటారు.

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినను సర్దుకుపోయే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు నిర్ణయాత్మికమైనవగా ఉండే అవకాశం ఉంది కావున ఈ విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేపట్టిన పనుల మూలన శ్రమను పొందుతారు వాటిని పూర్తిచేసేందుకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రదేశం నుండి ఒక విలువైన విషయాలను తెలుసుకుంటారు. చిననాటి మిత్రులతో కలిసి కొత్త ఆలోచనలు చేపడుతారు.

మకర రాశి :  ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొంటారు. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదించుట మేలు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు అలాగే వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయల్లో అనుకోని విధంగా నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతోషకరమైన విషయం. బంధువుల నుండి విలువైన విషయాలను తెలుసుకుంటారు అలాగే వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. స్వల్పఅనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును కావున తగిన జాగ్రత్తలు తీఉస్కొవ్దమ్ మేలు. సోదరసంభందమైన విషయల్లో కీలకమైనమార్పులు కలుగుతాయి.

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో నిదానం అవసరం. అనుభవం చాలా అవసరం మీయొక్క ఆత్మీయులతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం కలదు అధికారులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు మీకు ఉపకరిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి కాస్త ప్రయత్నం చేయుట అవసరం. మిత్రులతో కలిసి మీ యొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు.

మీన రాశి : ఈవారం మొత్తంమీద సామజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో శ్రమను పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేస్తారు స్వల్ప ఇబ్బందులు పొందుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీయొక్క మాటతీరు మూలాన చిన్న చిన్న విషయాల్లో అనుకోని ఇబ్బందులు పొందుటకు అవకాశ ఉంది. పెద్దలతో చేయుచర్చాసంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సంతానపరమైన విషయాల్లో సంతోషకరమైన వార్తను వింటారు.              

 

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
jyotishyam - vignaanam