Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kruti sanan don't like that

ఈ సంచికలో >> సినిమా >>

‘ఐటమ్‌’కి అలవాటుపడిన సన్నీలియోన్‌

sunny leone dedicated for items

సినిమాలో హీరోయిన్‌గా నటిస్తే వచ్చే రెమ్యునరేషన్‌కి ధీటుగా ఐటమ్‌ సాంగ్‌లో చేస్తే వచ్చినప్పుడు, ఆ అవకాశాలను ఎవరైనా వదులకుంటారా? ఎవరి మాటెలా ఉన్నా సన్నీలియోన్‌ మాత్రం తాను అలాంటి అవకాశాల్ని వదులుకోనంటుంది. ‘కరెంట్‌ తీగ’ సినిమా కోసం యాభై లక్షల పైనే సన్నీలియోన్‌కి సమర్పించుకున్నారు. డెబ్భయ్‌ ఐదు లక్షలు ఇచ్చారంటూ గాసిప్‌ నడుస్తోంది. లేటెస్ట్‌గా ఓ కన్నడ మూవీ కోసం ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి సన్నీలియోన్‌ సై అనేసింది. అక్కడా డెబ్భయ్‌ లక్షలదాకా సన్నీలియోన్‌కి ఇస్తున్నారట. బాలీవుడ్‌లో రెమ్యునరేషన్‌ బాగానే ఉన్నప్పటికీ, సౌత్‌లో సన్నీలియోన్‌కి అంతగా డిమాండ్‌ లేదు. ఉన్న ఆ తక్కువ డిమాండ్‌తోనే 50 లక్షల పైన ఐటమ్‌ సాంగ్‌కి అందుకుంటుందంటే అదేమీ చిన్న విషయం కాదు. కన్నడతోపాటు తమిళంలో, తెలుగులో ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తానంటుంది సన్నీలియోన్‌. సినిమా అంటే రోజుల తరబడి కష్టపడాలి. ఐటమ్‌ సాంగ్‌కి అంత కష్టం ఉండదు. అందుకే ఐటమ్‌ సాంగ్స్‌కి అలవాటు పడిపోయింది ఒకప్పటి ఈ అడల్ట్‌ స్టార్‌.

మరిన్ని సినిమా కబుర్లు
charan in serender direction