Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది కావున మీ జాగ్రత్తలో మీరు ఉండుట సూచన. అనారోగ్యసమస్యలు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.            


వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టు పనులలో నిదానంగా వ్యవహరించుట అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది. బందువర్గం నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. దూరప్రదేశాలు కలిసి వస్తాయి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. సోదరులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని నూతన ఆలోచనల వైపుకు నడిపించే అవకాశం కలదు. తోటివారితో మాటపట్టింపులకు పోకండి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ముఖమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామి నుండి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త.                         

 

 


మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. సరైన ప్రణాళిక కలిగి ఉండి ముందుకు వెళ్ళుట వలన లబ్దిని పొందుతారు. మీయొక్క మాటతీరు చాలావరకు నలుగురిని ఆకట్టుకుంటుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంభంలో మాత్రం మొండినిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ కారణంగా కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో ఉంటాయి. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రతలు తీసుకోవడం సూచన. వాహనముల మూలాన అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చును.                         


కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద సమయాన్ని విందులకు,వినోదాలతో అలాగే మిత్రులతో  సరదాగా గడుపుతారు. కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. అప్రయత్నంగా కొన్ని పనులు ముందుకు సాగుతాయి. వీటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటె మరింత లాభాలను పొందే అవకాశం ఉంది. సంతానం విషయంలో నిర్ణయాలు పెద్దలకు వదిలేయండి. దానిమూలాన మీపైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొనే అవకాశం కలదు. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి.              

సింహ రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అలాగే అధికారులతో సత్సంభందాలు కలిగిఉండుట మేలుచేస్తుంది. భాద్యతలు పెరుగుతాయి. వీటిమూలన ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. మీయొక్క మాటతీరు కొంత నష్టాన్ని కలుగజేస్తుంది. కుటుంబంలో స్వల్పమానస్పర్తలు ఏర్పడుటకు ఆస్కారం ఉంది వీటికి అవకాశం ఇవ్వకండి. ఆరోగ్యం విషయంలో సంతోషకరమైన వార్తలు వినడం మూలాన గతకొంతకాలంగా అనుభవిస్తున్న మానసిక ఇబ్బందులు తగ్గుతాయి. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో సమయాన్ని గడపెటప్పుడు మాత్రం అనవసరమైన విషయాలకు అవకాశం ఇవ్వకండి.                 

 

    
కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంత తడబాటు ఉంటుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అకారణంగా ఇతరులతో మాటపడవలసి రావోచ్చును కావున నిదానంగా మసలుకొండి. కుటుంబసభ్యులతో చర్చాసంభందమైన విషయాలలో పాల్గొనకపోవడం అనేది మంచిది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు కాకపోతే వాటిని భాద్యత తీసుకోవడం వలన మాత్రమే పూర్తిచేయగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో సనకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దూరప్రదేశ ప్రయాణాలకు కావలసిన వ్యవస్థ ఏర్పడుతుంది. మీరు తీసుకొనే నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అని ఆలోచనకు వస్తారు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. విలువైన వస్తువులను కొనుగోలుచేసే అవకాశం కలదు వీతివిషయంలో ఇష్టం కలిగి ఉంటారు.                          

    

తులా రాశి : ఈవారం మొత్తంమీద సామాజికసేవాకార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీయొక్క ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట అన్నివిధాల శ్రేయస్కరం. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు మూలాన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. చర్చలకు అవకాశం ఇవ్వకండి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. పెద్దల నుండి ఆశించిన సహకారం చివరినిమిషంలో అందుటకు ఆస్కారం కలదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందుకు కలుగజేస్తాయి. సమయానికి భోజనం చేయుట అలాగే వైద్యులను సంప్రదించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో సర్దుబాటు అవసరం.                

 

 .వృశ్చిక రాశి  :  ఈవారం మొత్తంమీద ఉత్సాహంను కలిగి ఉంటారు. నూతన పనులను మొదలుపెట్టుటలో ఆసక్తిని కనభరుస్తారు. కుటుంబసభ్యలతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సామజికరంగాల్లో ఆశించిన మేర లబ్దిని అలాగే గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట వలన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భాద్యతలు పెరుగుతాయి వీటి విషయంలో సమయానుకూలంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. అధికారులను అధికంగా ఆకట్టుకొనే ప్రయత్నాలలో ఊహించని ఇబ్బందులు తెచ్చుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి.             

 


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద సంతానం విషయంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటవి. నూతన నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో పెద్దలను సంప్రదించుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. మిత్రులతో కలిసి వ్యాపారపరమైన విషయాలలో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం సఫలం అయ్యే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నలుగురిలో మీయొక్క ఆలోచనలు గుర్తింపును కలుగజేస్తాయి. భాద్యతలు పెరుగుతాయి వాటికి కట్టుబడే ప్రయత్నంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన అవకశాలు లభిస్తాయి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన.             

         

మకర రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలతో సమయాన్ని గడుపుతారు, వారిని అనుకరించే ప్రయత్నాలలో నూతన సమస్యలు ఏర్పడుతాయి చూసుకోండి. సంతానం మూలాన అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. వ్యాపరంలో భాగస్వాములతో చర్చలు చేయకండి. సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం లేదా వారి సూచనలను గౌరవించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దూరప్రదశ ప్రయాణాలు అనుకూలం. సోదరసంభందమైన విషయాల్లో సమయం గడుపుతారు అలాగే వారినుండి సహకారం ఆశిస్తారు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి శ్రమించుట ద్వార నూతన అవకాశాలు ల;అభిస్తాయి. కళారంగాల్లో ఉన్నవారు భుసంభందమైన విషయాలకు సమయం కేటాయిస్తారు ఈపరమైన లావాదేవీల్లో పాల్గొంటారు.          

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది, గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు భాద్యత వహించాల్సి వస్తుంది. విదేశాల నుండి నూతన సమాచారం పొందుతారు దీనిమూలాన పనిభారం పెరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలవు. మీయొక్క వ్యవహారశైలి అలాగే మాటలు కొంత అనుమానస్పదంగా ఉంటాయి. సంతానం కోసం సమయాన్ని అధికంగా ఇస్తారు,వారితో సమయాన్ని గడపటానికి ఇష్టపడుతారు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. కొన్ని కొని విషయాల్లో మీరు సర్దుబాటు చేసుకోవడం వలన మరికొన్ని విషయాల్లో లబ్దిని పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం అలసత్వం పనికిరాదు నలుగురిని కలుపుకొని వెళ్ళండి.          

మీన రాశి : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పనుల్లో ఒత్తిడి అలాగే శ్రమ ఉంటుంది. మిత్రులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును కావున వాయిదావేయుట మంచిది. గతకొంతకాలంగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విషయంలో పెద్దగా సంతృప్తికరమైన ఫలితాలు రాకపోవచ్చును. మీయొక్క ఆలోచనలు అలాగే నిర్నాయాలలో కల పరిణతి మూలన నూతన అవకాశాలు పొందుతారు. బంధువర్గం నుండి వచ్చు సూచనలు మిమ్మల్ని కొంత నిరాశకు లోనుచేస్తాయి. జీవితభాగస్వామితో కలిసి తీసుకొనే నిర్ణయాలు అనుకూలమైన మార్పులను కలుగజేస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం బాగానే ఉంటుంది.  

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
jayajayadevam