Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naaneniki remdo vaipu

ఈ సంచికలో >> కథలు >> ధన ధాన్య కటకం

dhanadhanya katakam

“ అపుత్రస్య గతిర్నాస్తి  ..అని వాకృచ్చిన ప్రతిభాశాలెవరో  తమరి కేమైనా ఐడియా వుందా మేడం..? తన సెల్ ఫోన్ మెసేజ్ దీక్షగా చూస్తూ అడిగారు..ధరణీ రావు గారు..కాఫీ కప్పుతో వచ్చిన ప్రసూనాంబని..అదోలా చూస్తూ. “అదేంటి హఠాత్తుగా.. తమరేమైనా ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలాంటి దేమైనా తలపెట్టారా..”?ఆశ్చర్యపోతూ అడిగింది..ప్రసూన..వైఫాఫ్ ధరణీరావు .

“అబ్బే నాకంత తీరుబడీ ఇంట్రెస్టులు లేవుగానీ.. స.. బదులు.. అ పడిందేమోనన్న చిన్న  అనుమానం.. దట్సాల్.”

 “మార్నింగ్ వాక్ నుంచి రాగానే రాగాలు మొదలు పెట్టారంటే సm thinగ్ రాంగ్ అని నా మనసు చెబుతోంది.. మీ ఉపోధ్ఘాతం ఆపి అసలు విషయానికి రండి. మీ మార్నింగ్ వాక్ దోస్తులెవరికైనా సన్ sTrOk గానీ డాటర్ స్టోక్ గానీ తగిలిందా..?” 

“యు aaర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్..నాటోన్లీ సన్ sTrOక్ ..మేడం ..సన్స్  స్ట్రోక్..దట్టూ నీకూ నాకే ..నీ సుపుత్రు ల నుంచి మెసేజ్ వచ్చింది..వియార్ కమింగ్ టు డర్టీ ఇండియా ..అండ్.. డర్టీయస్ట్ పల్లెటూరికని.”

“నీ సుపుత్రు లంటారేంటి..మీకు మాత్రం సుపుత్రులు కారా..?” 

“నేనేమీ కాదనడం లేదు..తల్లి నిజం..తండ్రి నమ్మకం అంటారుగా..! అందుకే అలా అన్నాను గానీ అపార్ధం చేసుకోకు..”

“ఎప్పుడొస్తున్నారు.? .ఇన్ని సంవత్సరాల తర్వాత..మనం గుర్తుకొచ్చామన్న మాట ..పోన్లెండి ఇప్పుడన్నా వస్తున్నారు  మనమల్నీ మనమరాళ్లనీ  ఫొటోల్లో చూడ్డమే తప్ప ఎదురుగా చూసింది లేదు..దాదాపు పెద్దోడెళ్లి పదేళ్లు ..చిన్నోడెళ్లి ఎనిమిదేళ్లు దాటిపోయాయి..కనీసం మీ రిటైర్మెంట్ కైనా వస్తారనుకుంటే సెలవు దొరకలేదని ఒక్కడూ రాలేదు..ఇప్పుడు యిద్దరూ వస్తున్నారా..ఒక్కడే వస్తున్నాడా..డేటేమన్నా రాశారా.?”.వరుస ప్రశ్నలు సంధించేసింది..ప్రసూనాంబ..రిటైర్డ్ హెడ్ మాష్టర్ గారి భార్య.

“నెక్ట్ వీకన్నారే తప్ప స్పెసిఫిగ్ గా మెన్షన్ చేయలేదు..చూడు “ అంటూ సెల్ అందించారు.

“ఔనండీ”  అంటూ ..సెల్లిచ్చి.” మరి యిద్దరం కుటుంబాలతో వస్తున్నామని రాశారు..మన యిల్లు ..సరి పోతుందంటారా..వాళ్లో ఎనిమిది మంది..మనం..యిద్దరం?”

“అంతగా చాలక పోతే హోటల్లో వుంటారు గానీ.. రాత్రికి ఫోన్ చేసి మాట్లాడు..విషయం తెలుస్తుంది. నేను అర్జంటుగా స్నానం చేయాలి.. వాటరుందిగా”?  అంటూనే బాత్ రూం లో కెళ్లిపోయారు..ధరణీ రావు గారు .. ఆ సంభాషణ అంతటితో కట్ చేయాలని.

ఆలోచన్లలో పడి పోయింది పోయింది ప్రసూనాంబ.

తండ్రి రిటైర్మెంటుకు రాలేదు..  కనీసం చెల్లిలి వివాహానికైనా వస్తారనుకుంటే దానికీ  .. లీవు దొరకలేదని.. ముఖం చాటేసిన  కుమారులిద్దరూ  ఒక్కసారే కుటుంబాలతో వస్తున్నామని మెసేజ్ పంపించారు..ఆయనేమో చెల్లి పెళ్లికి రాని నాడే..వాళ్లసలు మన బిడ్డలే కాదు..రజనితో బాటు  నా శిష్యులే మన బిడ్డలు..అని తెగేసి చెప్పేశారు.ఇప్పుడింత కాలానికి మళ్లీ.. ఆలోచనల్లో మునిగి పోయి అలాగే కూర్చుండి పోయింది ..భర్త వచ్చి పలకరించే వరకు. “ప్రసూనాంబ గారేంటి ఫ్లాష్ బ్యాకుల్లో పడిపోయినట్లున్నారు..మరీ మనసు పాడు చేసుకోకు..ముందు నీ సుపుత్రులు రానీ వచ్చాక తెలుస్తుంది వారి మనో పోకడ..ముందే ఊహలూ.. ఊహా గానాలెందుకు గానీ తొందర పడి నువ్వేమీ వాళ్లనడక్కు..చెప్పింది  ను..నన్నడిగేంత సాహసం వాళ్లు చేయరు గాక చేయరు. మన రజిత పెళ్లి టైంలో నేను యిచ్చిన డోసు ..నా లెక్క ప్రకారం యింకా పని చేస్తూనే వుండాలి..ఏ ఫ్రెండ్ పెళ్లికో..పర్సనల్ వర్క్ కో వస్తున్నారే తప్ప నిన్నో నన్నో రజితనో చూడాలని కాదని నీకూ నాకూ తెలుసు..యిందాకే అన్నాను కదా ఊహా గానాలొద్దని..లెటజ్ వెయిట్..అండ్ సీ ..” తన అభిప్రాయంతో బాటు భార్యామణి ఆంతరంగాన్ని కూడా ఆవిష్కరించేశారు..ధరణీరావు గారు.

*******

ఆగదు ఏ నిమిషం నీ కోసమూ..అన్నట్లుగానే ఆ రోజు రానే వచ్చేసింది. పెద్దబ్బాయ్ రాంబాబు  చిన్నబ్బాయ్ శ్యాం బాబులు భార్యా బిడ్డలతో..దిగి పోయారు..రాంబాబు కొడకుల్ని..శ్యాంబాబు కూతుళ్లనీ తనివి తీర ముద్దాడేసింది ప్రసూన..తాము అమెరికా నుంచి తెచ్చిన సబ్బులూ..బాడీ లోషన్లు..షర్టులూ చీరల వంటి సామాన్లన్నీ హాల్లో పరిచేసి ఏ ఐటం ఏ మాల్ లో ఎంత కష్టపడి కొన్నదీ..కొడుకులూ కోడళ్లు వివరిస్తుంటే.. ఇలాంటివన్నీ మీ నాన్నగారి శిష్యులు ఎన్నోసార్లు తెచ్చిచ్చారు.. వద్దని వారించినా వినకుండా ఎప్పుడొచ్చినా వట్టి చేతులతో రారనే నిజాన్ని చెప్పి వాళ్లను హర్ట్ చేయడం యిష్టం లేక అమెరికా ఆడంబరాల్ని వింటూ వుండిపోయింది ప్రసూనాంబ. భార్య అవస్థవు గమనిస్తూనే హిష్టరీ ఛానల్ కు అంకితమైపోయారు ధరణీ రావు గారు.

కోడళ్ల ఆప్యాయతానురాగాలతోనూ..గ్రానీ గ్రానీ ..అంటూ అల్లుకు పోయే గ్రాండ్ చిల్డ్రన్స్ అల్లరి తోనూ..నాన్నకు భయపడి అమ్మనే అతుక్కు పోయిన పుత్ర రత్నాలు ఒలక బోసిన ప్రేమ ప్రవాహం లోనూ అనందంగా అ వారం రోజులూ గడిపేసింది తెలుగు తల్లి. నాన్నగారి రిటైర్మెంటుకు..రజని మ్యారేజ్ కూ ఎందుకు రాలేక పోయామో అంటూ వాళ్లు చెప్పిన  కధలన్నీ నమ్మేసి  ..భర్తను కన్విన్స్ చేయడానికి శాయ శక్తులా ప్రయత్నించి..విఫలురాలై చిన్నబోయింది. ఫ్రతిరోజూ మధ్యాహ్నం భోంచేసి ఫ్రెండ్స్ ను కలవాలని వెళ్లి పోతున్న రాంబాబు..శ్యాంబాబుల ప్రవర్తనను గమనిస్తూ..తనలో తాను నవ్వుకుంటూ ..కేవలం గ్రాండ్ చిల్డ్రన్స్ తో మాత్రమే మూవయ్యే వారు ధరణీ రావు గారు. 

********

తమ విశాలమైన  రెండు బెడ్ రూములూ కొడుకులకిచ్చేసి ప్రసన్న దంపతులు హాల్లో బెడ్ ల మీద సర్దుకునేవారు.

అర్ధరాత్రి భర్త తట్టి లేపితే లేచి నిద్ర ముఖంతో ఏంటన్నట్లు చూసిన భార్యను మాట్లాడ వద్దన్నట్లు సైగ చేసి పెద్ద కుమారుడి గదిలో నుంచి వస్తున్న మాటలు వినమని లో గొంతుతో చెప్పారు ధరణీ రావు గారు.

అమ్మా నాన్నలు నిద్ర పోయారని కన్ ఫం చేసుకున్నాకే మీటింగ్ పెట్టకున్న ఆ నలుగురూ లో పిచ్ లో మాట్లాడుకుంటున్నారు.

“అన్నయ్యా..! నిన్నునీ ఫ్రెండింట్లో డ్రాప్ చేసి  సాయంత్రం నా ఫ్రెండును కలిశాను.వాడు రియలెస్టేట్ జీనియస్ ..వాడు రిజిస్ట్రేషన్ అఫీసుకు తీసు కెళ్లాడు. ఈ మధ్యే మన పొలాల ప్రక్క ల్యాండు ఎకరా సిక్స్  సిఆర్ కు అమ్మారంట..మీడియేటర్స్ కూడా కన్ ఫం చేశారు. మనది అయిదెకరాలు..దట్ కమ్స్ థర్టీ సి ఆర్..మన హౌస్ లాండ్ థౌజెండ్ స్క్వేర్ యార్డ్స్ ..ఇక్కడ యార్డ్ మినిమం లాక్ రూపీ కాస్టట..అంటే మరో టెన్ సిఆర్..ఇట్ కంస్ ఫార్టీ..మనం అమెరికాలో కడుపు కట్టుకుని కూడా యింత సంపాదించలేం..ఇండియా వచ్చెళితే లక్షల్లో ఖర్చవుతుందని అప్పుడు  అబద్దాలు చెప్పి పొరపాటు చేశాం..అమ్మ నమ్మింది గానీ డాడీ నమ్మలేదు. ఆయన్ని మనం కన్విన్స్ చేయలేం..అందుకే అమ్మ సైడ్ నుండి నరుక్కు రావాలి..ఆ బాధ్యత మా వదిన గారు..మీ మరదలు చూసుకుంటారు..అమ్మని ఐస్ చేస్తే చాలు..డాడీని అమ్మే మేనేజ్ చేసి ఒప్పిస్తే..ఆస్థులన్నీ అమ్మేసి అందరం కలసి ఫ్లైటెక్కేద్దాం..ఎట్లాగూ వన్నియర్లో అమ్మానాన్న ఇండియా ఫ్లైటెక్కేస్తారు..అప్పుడు నువ్వో నేనో వచ్చి ఓ ఫ్లాటు కొని..యిచ్చేద్దాం..వాడ్డూయుసే.”?

ఒక్కసారిగా నవ్వులు.. ప్రసూనాంబ షాకైపోయి  భర్తను బేలగా చూసింది. అప్పటికే కళ్లు కాసారాలైపోయాయి. కళ్లు తుడిచి..టేకిట్ ఈజీ అన్నట్లు భుజంతట్టి..సముదాయించారు..

 ********

లాయర్ కృష్ణమూర్తి తో బాటు ధరణీ రావు గారి కుటుంబ సభ్యులందరూ హాల్లో సమావేశమయ్యారు.

పిల్లలంతా బయట ఆటల్లో మునిగి పోయీరు.

“లాయర్ గారూ ..! వీళ్లంతా నా కుటుంబ సభ్యులు..వారం క్రిందటే  పదేళ్ల తర్వాత స్టేట్స్ నుంచి వచ్చారు ..మళ్లీ ఎప్పుడొస్తారో నాకే కాదు..వాళ్లకే తెలియదు. ప్రశాంతంగా వుండిన మనూరు.. రాజధానిగా  మారబోతుందన్న వార్తతో కబ్జాలతో  కత్తి పోట్లతో కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పటి నుంచో ఆస్థి పంపకాలు చేయాలను కున్నాను. అనుకోకుండా వీళ్లందరూ వచ్చేశారు..ఇదే కరెక్ట్ టైమనుకుంటున్నాను..నా ఆస్థి ఈ ఇంటితో బాటు అయిదెకరాల పొలం..నా స్వార్జితం..నా యిష్ట ప్రకారం  చేయొచ్చా..లేక వీళ్ల  పర్మిషన్స్.. సంతకాలలాంటివేమన్నా..”?
“నో ..నాటెటాల్ రిక్వైర్డ్..ఎంటైర్ థింగీజ్ యువర్స్ యుకెన్ డూ యాజ్ యూ ప్లీజ్..”

లాయరు గారు కన్ఫం  చేశాక మళ్లీ తన మాటలు కొనసాగించారు..ధరణీ రావు గారు.

ఒక్క  ప్రసూనాంబ ముఖంలో తప్ప .. మిగిలిన అందరి ముఖల్లోనూ..టెన్షనే టెన్షన్ ..ఆంధ్రప్రదేశ్ ఎండల్లా. 

“దాదాపు యిరవై సంవత్సరాల బాటు  పొలం దున్ని..పంటలు పండించి..కరువు సమయంలో కూడా కౌలు కట్టిన నా కౌలు దారు..కోటయ్యకు రెండెకరాలు రాయండి..మా యింటి ఆడపడుచు మా కుమార్తె రజిని పేరున  ఒక ఎకరం..లాభాపేక్షలేకుండా అనాధ పిల్లలకోసం .వృధ్దులకోసం..ఆశ్రమం నడుపుతున్న రామకృష్ణా మిషన్ వారికో ఎకరం రాయండి. మిగిలింది నా భార్య పేరున రాయండి..ఈ యిల్లు కూడా నా తదనంతరం..సర్వ హక్కులతో తనకే చెందేలా వీలూనామాలో ఎప్పుడో రాసేశాను..ఇక ఈ సంతాన పురుషులు  అనవసరంగా మాతృదేశానికొస్తే  లక్షలు ఖర్చు చేయీల్సి వస్తుందని సెలవులు దొరకవని అబద్దాలు చెప్పుకుంటూ అమెరికాలో ఆల్రెడీ కోట్లు కూడబెట్టేశారు.. ఒకవేళ వాళ్లకేమైనా యిద్దామనుకున్నా  డర్టీ ఇండియా..డర్టీ ఇండియన్ మనీ అనేస్తారని భయపడి నేనా సాహసం చేయ లేక పోయాను..బికాజ్ ఐ లవ్ మై భారత్..ఐ లవ్ మై అమరావతి ..అండ్ ఐ లవ్ మై పీపుల్ ఉధ్విగ్ను లైపోయి..మాటలు రాక మౌనమూర్తయి పోయారు..మాజీ ప్రధాన అధ్యాపకులు..ధరణీ రావు గారు

మరిన్ని కథలు