Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasinipattiuste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ



జరిగినకథ: తేజాకు విషయాలన్నీ తెలిసి అవాక్కవుతాడు. వరలక్ష్మి ఎలాగైనా పెళ్ళి ఆపుచేయించమని తేజాను కోరుతుంది.   ఆ తరువాత....

.‘‘ఔను...నాకూ బాధగానే ఉంది. అయినా, ఫర్వాలేదు. సినిమాని ఈ రోజు కూడా చూడొచ్చు. కావాలంటే ఫస్ట్‌ షో కి టిక్కెట్‌ తెప్పిస్తాను’’

‘‘మూడు టిక్కెట్లు తెప్పించు’’

‘‘మూడెందుకు...’’

‘‘నీకూ ప్రతిమకి కూడా’’

‘‘మేమిద్దరం ఆ సినిమా చూసాం’’

‘‘ప్రతిమతో కలిసి సినిమా చూడడం సూపర్‌ కదా!’’

‘‘సూపరే! కానీ, ఆ అమ్మాయికెన్ని పనులో? మనలా పిలిచిన గెస్ట్‌ లందర్నీ రిసీవ్‌ చేసుకోవాలి. ఇంటర్వెల్‌ లో అందరికీ కూల్‌ డ్రింక్ లు అందాయో లేదో చూసుకోవాలి. మధ్య మధ్య చిర్నవ్వులు చిందిస్తూ నన్ను పలకరిస్తుండాలి...ఓహ్ ! అన్నట్టు చెప్పడం మరిచి పోయాను...కొన్నిసినిమాల పేర్లు భలే తమాషా చేస్తాయి’’ అన్నాడు సిద్దార్థ.

‘‘తమాషానా?’’

‘‘ఔను...గతంలో ఓ సారి మా అత్త కూతురు సినిమాకి వెళ్లింది. ఏ సినిమాకని అడిగితే చెప్పడానికి సిగ్గు పడి పోతోంది. ఎన్నిసార్లడిగినా ఎంతకీ చెప్పదే. ఆఖరికి మా అమ్మ జోక్యం చేసుకుని చుట్టం చూపుగా వచ్చిన ఆ పిల్లనెందుకురా బెదర గొడ్తావని కసిరింది. కేవలం సినిమా పేరడిగినంత మాత్రానే బెదిరిపోతే ఎలా? అనుకున్నాను. ఆ తర్వాత మళ్లీ ఒంటరిగా దొరికినప్పుడు అడిగాను...ఇంతకీ ఏ సినిమాకి వెళ్లావని?’’

‘‘చెప్పిందా?’’

‘‘ఊ...చెప్పింది. సిన్మా పేరో...తన మనసులో కలిగిన భావమో...అర్ధం కాక కాసేపు ఖంగు తిన్నాను’’

‘‘ఆ సిన్మా పేరేంటీ?’’

‘‘నిన్నే పెళ్లాడుతా!’’

హాయిగా నవ్వాడు తేజా.

‘‘ఔను...చిన్నప్పట్నుంచీ ఆ పిల్లని చూస్తూ పెరిగాను. అందుకే... ఆ పిల్లపై ఆ ఫీలింగే లేదు. అప్పుడప్పుడూ మా ఇంట్లో ఆమెతో పెళ్లి ప్రస్తావన వచ్చినా తుంచేసే వాడిని. కానీ...’’

‘‘ఊ...కానీ!’’

‘‘ప్రతిమ కూడా సిన్మా పేరు చెప్తూ తడబడ్డం నా దృష్టిని దాటి పోలేదు. ఇన్వైట్‌ చేస్తూ ‘మన మూవీయే..ప్రియతమా!’ అంటూ ఒక్కసారి సిగ్గుపడి నవ్వేసింది. ఓ మగాడితో ఈ సినిమా పేరు చెప్పడం ఆడాళ్లకి కాస్త ఇబ్బందేమో?’’

‘‘ప్రతిమ లాంటి వాళ్లకను...సరి పోతుంది’’ అంటూ ‘‘ప్రియతమా...బాగుందన్న మాట’’‘‘సినిమా బాగుంది. ఇప్పటికైనా ఈ కేసులో ప్రతిమ మీదున్న అనుమానం తొలగిపోయిందనుకుంటా’’ అడిగాడు తేజ.

‘‘ఊహూ...’’

‘‘అంటే...ఇప్పటికీ ఆమెను అనుమానిస్తున్నావా?’’

‘‘అది వేరు...ఇది వేరు. కేసు తేలెంత వరకూ అనుమానాలు సహజమే’’ సిద్దార్థ అన్నాడు.

‘‘సరే...నే మళ్లీ కలుస్తాను’’ అంటూ సెలవు పుచ్చుకున్నాడు తేజ.

ఆ తర్వాత అయిదు నిముషాలకు సిద్దార్థ క్యాబిన్‌లోకి ఎంటరైన పర్సనల్‌ అసిస్టెంట్‌ సుజాత` ‘‘సర్‌...వాగ్దేవి ప్రొడక్షన్స్‌ సిబ్బంది పర్సనల్‌ ఫోన్‌ కాల్స్‌ డేటా వచ్చింది. మీరు చూస్తారా?’’ అంది.

కేస్‌ టేకప్‌ చేసిన వెంటనే ప్రతిమ ఆఫీసులో పని చేసే ప్రతి ఒక్కరి పేరు, ఊరు, ఆఫీసులో చేరిన తేదీ, యూజ్‌ చేస్తున్న పర్సనల్‌, ఆఫీస్‌ ఫోన్‌ నంబర్ ల వివరాల్నితెప్పించాడు. ఆ తర్వాత వాటి ఆధారంగా కాల్స్‌ డేటా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

‘‘చెక్‌ చేసావా?’’

‘‘చేసి డిటైల్ డ్‌ నోట్స్‌ ప్రిపేర్‌ చేసాను’’ అంటూ డాకుమెంట్సున్న ఫైల్‌ సిద్దార్థ చేతికిచ్చిందామె. ఒక్కో పేపర్‌ని పరిశీలనగా చూస్తున్నాడు సిద్దార్ధ.

ఒకే ఒక్క నంబర్‌ నుంచి ప్రతిమ ఫోన్‌కు ఫ్రీక్వెంట్‌ గా కాల్స్‌ రావడం గుర్తించాడతడు.

ఒక్కో రోజు ప్రతి పది నిముషాలకో కాల్‌ రికార్డయింది. ప్రతి కాల్‌నీ మిస్‌ కాకుండా ప్రతిమ ఆన్సరిచ్చింది.

అంటే...ప్రతిమకెంతో కావాల్సిన నంబరన్న మాట.

ఎవరిదా నంబర్‌?

ప్రతిమనంతలా ఆకర్షించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు?

ప్రతిమ యూజ్‌ చేస్తున్న డ్యూయల్‌ సిమ్‌లోని పర్సనల్‌ నంబర్‌కే కాల్‌ చేస్తున్నాడంటే...ఆమెకి ఆత్మీయుడే?

అతడెవరో వెంటనే తెలుసుకోవాలనిపించిందో క్షణం.

కానీ, కేసు పక్క దోవ పడుతుందేమోననే ఉద్ధేశంతో ఆ ప్రయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడు సిద్దార్ధ.

కంప్యూటర్‌ కను సన్నల్లో ప్రపంచం నడుస్తున్న ఈ కాలంలో ఎవరు ఎవరితో మాట్లాడింది...ఎన్ని సార్లు మాట్లాడింది తెలుసుకోవడం సులువే. ఈ మెయిల్స్‌ పై నిఘా ఉంచడానికి ఈ మధ్య కాలంలో చాలా సంస్ధలు నిపుణుల సహాయం తీసుకుంటున్నాయి. కార్యాలయాల్లో కెమెరా నేత్రాలు అనుక్షణం పహారా కాస్తూనే ఉంటాయి. పని వేళల తర్వాత కూడా కొన్ని కంపెనీలు డిటెక్టివ్‌ల షాడోయింగ్‌ను ఏర్పాటు చేయడం పరి పాటిగా మారింది. తమ సిబ్బంది ఎవరెవర్ని కలుస్తున్నారో తెలుసుకుంటోంది.

బ్లాగ్‌ బాతా ఖానీలు, ట్వీట్‌లు..ఈ మెయిల్స్‌....ఇలా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి విషయాన్నీసంస్ధ యజమాన్యం తెలుసుకుంటోంది. ఈ రకమైన నిఘా వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ పోతోందని ఉద్యోగులు బాధపడుతున్నా...కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం పోటీ సంస్ధలకు చేరకూడదనే చర్యలంటూ యజమాన్యాలు తమ వాదన వినిపిస్తున్నాయి.

అయితే, ఇంత పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో ఎంటర్టయిన్‌మెంట్‌ ఇండస్ట్రీ ఈ విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. నూరు, నూట యాభై కోట్ల ఇన్‌వెస్ట్‌మెంట్‌తో సినిమాలు రూపొందిస్తున్నా...స్టోరీ లైన్‌, సీన్ల విషయంలో సీక్రసీ మెంటైన్‌ చేయలేక పోతున్నారు. ఆ తర్వాత పైరసీని అరికట్టలేక పోతున్నారు. ప్రిస్టేజియస్‌ మూవీస్‌ షూటింగ్‌ల్లోనూ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు.

ఈ ఫ్లోర్‌ లో ఓ సంస్ధ సీన్లు తెరకెక్కిస్తుంటే...మరో పక్క ఇంకో సంస్థ అవే సీన్లతో సినిమా చుట్టేస్తోంది.

అంతేనా? సినిమా పూర్తయి విడుదల కాకుండానే ఘరానా దొంగలు రీళ్లను తస్కరించేస్తున్నారు.

అంత జరిగినా ‘ప్రియతమా!’ సినిమా థియేటర్లలోనూ మంచి టాక్‌తో నడుస్తోంది. అది ప్రొడ్యుసర్‌ చేసుకున్నఅదృష్టం.

‘‘సినిమా హిట్టయింది కదా! ఇక, దోషులెవరో కనుక్కోవలసిన అవసరం లేదేమో?’’ అడిగాడు ప్రతిమని సిద్దార్థ.

‘‘నో...నో! దొంగలెవరో తప్పక కనుక్కోవాలి. ఈ సారి ఈ సినిమా గండం నుంచి గట్టెక్కింది. ప్రతి సారీ ఇదే రిజల్ట్‌ వస్తుందనే నమ్మకం లేదు! అయినా, పక్కనే దొంగల్ని పెట్టుకుని ప్రాజెక్ట్‌ నిర్వహించలేం. అప్పగించిన కేసును వదిలేసుకునే మీరేం డిటెక్టివండీ బాబూ!’’ అంటూ చురకలంటించింది నవ్వుతూ.

‘‘అలాగనీ కాదు... రిలీజ్‌కు ముందున్న టెన్షన్‌ లేనట్లే కదా! మీ చైర్మన్‌ హ్యాపీ...’’అన్నాడు సిద్దార్థ.

‘‘ఎలాగైనా ఈ కేసు త్వరగా తేల్చాల్సిందే..’’ కృత నిశ్చయానికొచ్చాడతడు..ఉద్యోగుల కాల్‌ డేటా సునిశితంగా పరిశీలిస్తూ.

ఇంతలో అతడి సెల్‌ మోగింది.

అవతల్నుంచి లహరి వాయిస్‌. కేసుకు సంబంధించిన ముఖ్యమైన డిటైల్స్‌ అందిస్తోంది ఆమె. ఆమె చెప్తుంటే అతడు వింటున్నాడు. క్షణాలు నిముషాలై పరుగులు తీస్తున్నాయి.

‘వెతుకుతున్న దొంగ చేతికి చిక్కాడ’న్నఆనందంతో సిద్దార్థ కళ్లు మెరిసాయి. ఇంటర్నెట్‌లో ఎవరు ఎక్కడ్నుంచి ఏది అప్‌ లోడ్‌ చేసినా వెతికి పట్టుకోవడం ఇంత ఈజీనా? అనిపించేలా ఇచ్చిన అసైన్‌ మెంట్‌ను త్వరిత గతిన పూర్తి చేసి నిరూపించింది లహరి. లహరి చెప్పినవన్నీ వింటూ...‘‘ ఈ కేసులో కీలక వ్యక్తులు ఇద్దరే అన్న మాట. ఒకరు...ఈ సిటీ లోనే ఉంటే మరొకరు విశాఖలో ఉంటున్నారా?’’ వరుస ప్రశ్నలు గుప్పిస్తున్నాడు సిద్దార్థ. ఎంటర్ టయిన్‌ మెంట్‌ చోరీ ఎంత గుట్టుగా జరిగిపోతోంది. పెన్‌ డ్రైవ్‌ లాంటి పరికరం ఉంటే చాలు...ఎంచక్కా కాపీ చేసుకోవచ్చు. గొళ్లెం విరగ్గొట్టి ఇంట్లో ప్రవేశించినట్లు...హ్యాకింగ్‌ ద్వారా కూడా సర్వ సమాచారాన్నీ సంపాదించొచ్చు. కసిగా ఉంటే ధ్వంసం చేయొచ్చు. కోర్టుల చుట్టూ తిరగడం, మీడియాలో కనిపించడం చాలా సంస్థలకు ఇష్టం ఉండదు. ఇదే అదనుగా సృజనాత్మక చోరీ యధేచ్చగా జరిగి పోతోంది. లహరితో కాన్వర్వేషన్‌ ముగిసిన వెంటనే...విశాఖలోని డిటెక్టివ్‌ మిత్రులకి ఫోన్‌ చేసి విషయం చెప్పి అలర్ట్‌ చేసాడు. అలాగే, ఇక్కడ ఈ సిటీలోనే ఉన్న మరో వ్యక్తి చేజారి పోకుండా పద్మ వ్యూహం పన్నాడు. ఆ తర్వాత...ప్రతిమకు ఫోన్‌ చేసి విషయాలన్నీకూలంకషంగా వివరించాడు.

‘‘దొంగలు దొరికారా? పరంధామ్‌ హస్తం లేదు కదా!’’

‘‘అతడు లేడని మీరు నిరాశ చెందినట్లున్నారు?’’

‘‘నోనో..అది కాదు...ఎందుకో అతడి ప్రమేయం కూడా ఇందులో ఉంటుందనిపించింది’’అంది ప్రతిమ.

వారం రోజుల తర్వాత`

‘‘ఇవాళ ‘ప్రియతమా’సక్సెస్‌ మీట్‌. గోల్కోండ హోటల్లో ఎరేంజ్‌ చేసాం.  హీరో, హీరోయిన్‌, టెక్నిషియన్లంతా హాజరవుతున్నారు. మీరూ రావాలి’’ సిద్దార్థకు ప్రతిమ ఫోన్‌ చేసింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్