Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

రహస్యంగా కాశ్మీర్‌లో రామ్‌గోపాల్‌వర్మ

Varma is at Kashmir

ఓ పక్క ఉత్తరాఖండ్‌లో వరదలు.. ఇంకోపక్క కాశ్మీర్‌లో జవాన్లపై టెర్రరిస్టులు విరుచుకుపడి మారణహోమం సృష్టించడం.. దేశమంతా ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అయితే, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం, ఎంచక్కా తన సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా వున్నాడు. అది కూడా కాశ్మీర్‌లో వర్మ షూటింగ్‌ కార్యకలాపాలు చక్కపెట్టుకోవడం విశేషమే మరి.

వర్మ రూపొందిస్తోన్న ‘సత్య`2’ పాటల షూటింగ్‌ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. శర్వానంద్‌ ఈ సినిమాలో హీరో. ఎముకలు కొరికే చలిలో, మిగతా విషయాలేవీ లెక్క చేయకుండా తన సినిమా మీదే పూర్తిగా దృష్టిపెట్టాడు వర్మ. ఈ సినిమా వర్మకి చాలా కీలకం. ఈ మధ్య వర్మ చేస్తోన్న సినిమాలేవీ అతని రేంజ్‌కి తగ్గట్టు ఆడకపోవడంతో, ఎలాగైనా ‘సత్య`2’తో సత్తా చాటుకోవాలనే కసితో వర్మ వున్నాడు.

‘సత్య’ ఒకప్పుడు సృష్టించిన సంచలనాల నేపథ్యంలో ‘సత్య`2’పై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వుండేలా వర్మ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
what happened to sexy actress