Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Varma is at Kashmir

ఈ సంచికలో >> సినిమా >>

ఈ శృంగార తార ఏమైనట్టు

what happened to sexy actress

'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో తెలుగు తెరపై హాట్‌ హాట్‌ అందాల విందు చేసిన ముమైత్‌ఖాన్‌, నెంబర్‌ వన్‌ ఐటమ్‌ గర్ల్‌గా కొన్నాళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. స్టార్‌ హీరోయిన్లకు ధీటుగా ఆమెకు డిమాండ్‌ వుండేదంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ కథాంశాల్లోనూ నటించిన ముమైత్‌ఖాన్‌, ఈ మధ్య బొత్తిగా తెలుగు తెరపై కన్పించడంలేదు.

'ఆర్య సూర్య' అనే తమిళ సినిమాలో టి.రాజేందర్‌తో కలిసి నటిస్తోందిప్పుడు ముమైత్‌ఖాన్‌. అది తప్ప, తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాల్లేవు. వయసు మీద పడే కొద్దీ ఐటమ్‌ భామలకైనా, హీరోయిన్లకైనా ఈ పరిస్థితి తప్పదు. ముమైత్‌ఖాన్‌ తెలుగులోనే కాక, తమిళ, హిందీ భాషల్లోనూ ఐటమ్‌ సాంగులు ఒకప్పుడు బాగానే చేసినా, ఎక్కడా ఆమెకు అవకాశాలు దక్కని పరిస్థితి వుందిప్పుడు.

కొందరు దర్శకులతో సన్నిహిత సంబంధాలు నడిపిన ముమైత్‌ఖాన్‌కి, ఆ సంబంధాలూ పనిచేయడం లేదంటే, ఆమె ఎంత ఫేడయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బొద్దుగా వుండే ముమైత్‌ఖాన్‌, స్లిమ్‌ అవడానికి ప్రయత్నించి, గ్లామర్‌ కోల్పోవడం వల్లే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు టాలీవుడ్‌లో కొందరు.

మరిన్ని సినిమా కబుర్లు
Muscle Kamaraju