Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anasuya jabardasth

ఈ సంచికలో >> సినిమా >>

ప్రభాస్‌ గడ్డమే అడ్డమయ్యిందట

hero prabhas beard

రాజమౌళి ' ప్రభాస్‌ కాంబినేషన్‌లో 'బాహుబలి' సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. ట్రయల్‌ షూట్‌లో భాగంగా వివిధ రకాలైన గెటప్స్‌ ట్రై చేస్తున్నారు హీరో మీద. అలా ఓ గెటప్‌ బయటకు వచ్చింది. నెత్తిన శిరస్త్రాణంతో ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. అయితే ఆ ఫొటోలో గడ్డంతో వున్న ప్రభాస్‌ అభిమానులకు మింగుడు పడ్డంలేదు. కానీ, జస్ట్‌ ఆ గెటప్‌ ట్రయల్‌ షూట్‌ కోసమే కాబట్టి, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోనక్కరలేదు.

గెటప్స్‌, గ్లామర్‌ వంటి విషయాలు పక్కన పెడితే, సినిమాలో ఇంటెన్సిటీ అద్భుతంగా వుంటుందనీ, ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా వుంటుందనీ, రాజమౌళి తన ట్రేడ్‌ మార్క్‌ 'ఇంటెన్సిటీ'ని సినిమాలో జొప్పించాడని అంటున్నారు. అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. రాణా ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నాడు. నెగెటివ్‌ రోల్‌ అతనిది.

ఈ సినిమా కోసమే గుర్రపు స్వారీ నేర్చుకుంటూ గాయపడ్డాడు రాణా. అయితే గాయాలు చిన్నవే కావడంతో, తిరిగి యధావిధిగా హార్స్‌ రైడింగ్‌ పాఠాలు నేర్చుకోనున్నాడతడు. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న 'బాహుబలి'పై భారీ అంచనాలున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
raghu kunche studio