Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hero prabhas beard

ఈ సంచికలో >> సినిమా >>

రఘు కుంచే స్టూడియోనా మజాకా?

raghu kunche studio

బుల్లితెర యాంకర్‌గా, నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన రఘు కుంచె, సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగాడిప్పుడు. 'మై స్టూడియో' పేరుతో 'మ్యూజిక్‌ స్టూడియో' ఒకటి ప్రారంభించాడు రఘు కుంచె. సాదా సీదాగా లేదా స్టూడియో. చాలా గొప్పగా వుందని, అతని స్టూడియోని చూసిన వారు అనుకోవడం జరుగుతోంది.

విదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ స్టూడియో కోసం ఏదో ఒక ఐటమ్‌ తీసుకురావడం, హైద్రాబాద్‌లో ఎక్కడా లేని ఎక్విప్‌మెంట్స్‌ని తీసుకురావడంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుండడంతో రఘు కుంచె స్టూడియో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటీరియర్‌ అద్భుతంగా వుందట.

మ్యూజిక్‌ సిట్టింగ్స్‌తోపాటు, డిస్కషన్స్‌కీ ఈ స్టూడియో వేదిక అవుతోందిట. టాలెంట్‌.. దాంతోపాటే మంచి అభిరుచి, కొత్త టెక్నాలజీని అందుకోవాలన్న కసి.. ఇవన్నీ వున్న రఘు కుంచే, తన ప్రత్యేకతను ఇలా చాటుకుంటున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam