Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
what happened to sexy actress

ఈ సంచికలో >> సినిమా >>

కండల కామరాజు

Muscle Kamaraju

చెక్కిన శిల్పంలా ఉండే దేహ దారుఢ్యంతో ప్రేక్షకులను విస్మయానికి గురి చేసి నటులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన హీరోలు హిందీ చిత్ర సీమలో చాలా మందే ఉన్నారు. అలనాటి కాలంలో ధర్మేంద్ర మొదలుకొని ఈనాటి సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సంజయ్ దత్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ వరకు ఎందరో ఆ చిట్టాలో చేరారు.

తెలుగు చిత్రసీమలో కూడా ఈ మధ్య అటువంటి ప్రయత్నాలు చేస్తున్నవారు కనిపిస్తున్నారు. విక్టరీ సినిమా కోసం నితిన్, పూలరంగడు కోసం సునీల్ భారీ స్థాయిలో కొవ్వు కరిగించి రాటుదేలిన కండలు పెంచారు. ఇప్పుడు అదే కోవలో మరో నటుడు ముందుకొచ్చాడు. కమల్ కామరాజు....ఈ పేరు చెప్పగానే "ఆవకాయ బిర్యాని", "ఎ ఫిల్మ్ బై అరవింద్" గుర్తొస్తాయి.

ఈ కొత్త కండల వీరుణ్ణి కళ్ళారా చూసి ఆనందించండి...స్ఫూర్తి కలిగితే పూర్తిగా కొవ్వు కరిగించి మీరు కూడా కండలు పెంచేయండి.  

మరిన్ని సినిమా కబుర్లు
anasuya jabardasth