Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సింగం (యముడు-2): చిత్ర సమీక్ష

singam-yamudu2-movie review

చిత్రం: సింగం ( యముడు - 2 )
తారాగణం: సూర్య, అనుష్క, హన్సిక, వివేక్, సంతానం, ముఖేష్ రుషి, నాజర్, మనోరమ తదితరులు
ఛాయాగ్రహణం: ప్రియాన్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
కూర్పు: వి. టి. విజయన్
నిర్మాణం: యస్. లక్ష్మణ కుమార్
దర్శకత్వం: హరి
విడుదల తేదీ: 05 జులై 2013

యముడు సినిమాతో మంచి హిట్ కొట్టిన సూర్య, ఆ సినిమాకి సీక్వెల్ గా 'సింగం' పేరుతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్ర విశేషాలు ఎలా వున్నాయో చూద్దాం

క్లుప్తంగా చెప్పాలంటే:
ఒక పాఠశాల లో NCC మాస్టర్ గా పనిచేసే నరసింహం (suriya) తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. కానీ వాస్తవానికి అతను భాయి (ముకేష్ రిషి), త్యాగరాజ్ (రెహ్మాన్) మరియు ఒక అంతర్జాతీయ క్రిమినల్ డానీ (డానీ) ల మధ్య జరుగుతున్న కార్యకలాపాలు కనిపెట్టడానికి రహస్యంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. పరిస్థితి మారి కొంత కాలం తరువాత నరసింహానికి DSP గా పోస్ట్ పడుతుంది. దానితో నేరస్తులను తుదముట్టించడానికి ఆపరేషన్ D ప్రారంభిస్తాడు. ఆ ఆపరేషన్ ఎలా సాగుతుందో తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
ఒక సాధారణ కథాంశంతో వచ్చిన దర్శకుడు, దానిని తెరపై గొప్పగా మలిచాడు. డైలాగ్స్ పవర్ ఫుల్ గా వున్నాయి . స్క్రిప్ట్ సగటుగా ఉంది కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. నేపధ్య సంగీతం మధురంగా వుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ . ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. కాస్ట్యూమ్స్ బాగా రూపకల్పన చేశారు.

సినిమా మొత్తాన్ని సూర్య తన భుజాలపై మోసాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు.

అనుష్క పాటలలో తన గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హన్సిక ఉన్నంతలో ఫరవాలేదనిపించింది.

వివేక్ మరియు సంతానం లు కామెడీ బాగానే పండించారు. ముఖేష్ రుషి, సూర్య తో కలిసి నటించిన సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. రెహ్మాన్, డానీ ఆకట్టుకొన్నారు. విజయ్ కుమార్, నాజర్, విశ్వనాథ్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు

మాస్, మసాలా ఫార్ములా చిత్రాలను ఇష్టపడే వారికి కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయిందులో.

ఒక్క మాటలో చెప్పాలంటే: మసాలా బిర్యాని

అంకెల్లో చెప్పాలంటే: 3.25 /5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Sagar by Raja