Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

02-10-2015 నుండి 08-10-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

..

మేష రాశి : ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు కాకపోతే సరైన ప్రణాళిక లేకపోతే నూతన సమస్యలు వచ్చే ఆస్కారం కలదు జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది నూతన ఖర్చులను పొందుతారు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు మూలాన కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పొందుతారు,సర్దుబాటు విధానం మంచిది. ప్రయాణాలు చేయకండి ఒకవేళ చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు ఇష్టమైన వాటిని భుజించే విషయంలో ఆసక్తిని చూపిస్తారు మిత్రులతో సమయం గడుపుతారు.         

 

 



వృషభ రాశి ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయల్లో కొంత ఒత్తిడి పొందుతారు వారిగురించి సమయాన్ని ఇస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది ఎదురుచూస్తున్న గుర్తింపును పొందుతారు. మిత్రుల నుండి ఆశించిన సహకారం పొందుతారు వారితో కలిసి కొత్త కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి వచ్చే ఒకవార్త మీలో సంతోషాన్ని పెంచుతుంది. బంధువులకు సమయం ఇస్తారు వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట అనేది సూచన. ప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇస్తారు. విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది లేదా బహుమతిగా వాటిని పొందుతారు. వాహనముల మూలాన మాత్రం స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.                   
మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంత ఇబ్బందులు పొందినను వాటిని అదిగమిస్తారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట సూచన. మీయొక్క ఆలోచనలను మిత్రులకు తెలియజేసే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. పెద్దలతో మీకున్న పరిచయాల మూలాన నూతన అవకశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో చక్కటి సంభందాలు కలిగి ఉంటారు వాటిమూలన లబ్దిని పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి వాటిలో నూతన పరిచయాలకు అవకాశం కలదు. బంధువులను కలుస్తారు వారినుండి నూతన విషయలాను తెలూస్కొనె అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయంలో మార్పులకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో ఒక నిర్ణయం మిమ్మల్ని కొంతమేర ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. విలువైనవస్తువులను కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది.                                       



కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయలకు సమయం ఇస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులకు పోకండి ఓపికను కలిగి ఉండుట చేత మేలుజరుగుతుంది అవతలి వారి సూచనలు వినే ప్రయత్నం చేయండి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు కాకపోతే ఒత్తిడి ఉంటుంది. వ్యాపారసంభందమైన విషయాల్లో నూతన మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది సమయస్పూర్తి వలన సమస్యలను అధిగమించి విజయం పొందుతారు. దూరప్రదేశంలో నివసించే బంధువుల నుండి కొత్త కొత్త విషయాలను తెలుస్కోనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని విందులకు కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి వారినుండి నూతన సమాచారం పొందుతారు. దైవసంభంద పూజలకు సమయం ఇస్తారు వాటిలో పాల్గొంటారు. 

 


సింహ రాశి :  ఈవారం మొత్తంమీద బాగుంటుంది మనోస్థ్యైర్యంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యుల నుండి చక్కటి సహకారం లభించుట వలన మరింత ఉలాసంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. సామజికకార్యక్రమాల విషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది సమయం అధిక భాగం ఈవిధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిత్రులనుండి నూతన సూచనలు పొందుతారు వీటి విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వారం చివర్లో అతిఉత్సాహమ్ మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త.     




కన్యా రాశి : ఈవారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు కలిగి ఉంటారు. సామజికకార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మూలాన ఒత్తిడి పొందుతారు. పూజాదికార్యక్రమాలకు సమయం ఇస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వతైమూలన నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. అధికారులతో సత్సంభందాలు కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం జాగ్రత్తలు అవసరం ధనమును అప్పుగా ఎవ్వరికి ఇవ్వకపోవడం అనేది సూచన. గతంలో చేపట్టిన పనులకు గాను నలుగురిలో మంచి పేరును కలిగి ఉంటారు. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నం చేయుట మంచిది.   



తులా రాశి : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కొత్త కొత్త అవకశాలు పొందుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో కలిసి చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కలదు. వాహనముల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. దూరప్రదేశముల నుండి నూతన సమాచారం వినే ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాలు మొదట్లో చిన్న చిన్న ఆటంకాలను పొందినను చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానపరమైన విషయాల్లో కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు వారి విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో ఏ మాత్రం ఏమరపాటు ఉన్న వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త.

 




వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద గతకొంతకాలంగా మీరు ఎదురుకొంటున్న సమస్యల నుండి ఊరట చెందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది లేదా మీ శ్రేయోభిలాషుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది తోటివారి సహకారం వలన చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును వాటిమూలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. రాజకీయపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు లేదా ఆలోచనలు చేయుట వలన మాటపడవలసి రావోచ్చును. వ్యాపారపరమైన విషయల్లో పెట్టుబడులు పెట్టకండి చర్చాసంభందమైన విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం మంచిది. బంధువులతో కలిసి సమయాన్ని విందులలో గడుపుతారు వారికి మీ ఆలోచనలు తెలియజేసే అవకాశం ఉంది.       

 


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో శ్రమను కలిగి ఉంటారు అధికారుల మూలాన ఇబ్బందులు పొందుతారు కావున సాధ్యమైనంత వరకు సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండుట ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. బంధువులనుండి ఆశించిన సమాచరం సేకరిస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న సహయం అందుతుంది. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన చర్చలకు ఆస్కారం కలదు ఈ విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఉంది.      

 



మకర రాశి : ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది లేదా నూతన పరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యముల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు వాటిలో పాల్గొంటారు. చేపట్టే పనుల విషయంలో స్పష్టత అవసరం తొందరపాటు నిర్ణయాల మూలాన నష్టపోయే అవకాశం కలదు. ఆర్థికపరమైన విశయాల్లో మాత్రం అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మిత్రులతో మాటపట్టింపులకు పోకండి స్వల్పమనస్పర్థలు వచ్చే అవకాశం కలదు కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కాకపోతే పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గాను ఫలితాలు వస్తాయి.             



కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సంభందించి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్నను ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. ఉద్యోగంలో సమయపాలన పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు కాస్త ఆలస్యంగా కార్యరూపం దాల్చుతాయి కావున ఓపిక అవసరం. సొంతనిర్ణయాల మూలాన నష్టపోయే అవకాశం కలదు కావునపెద్దల అనుమతి లేనిదే నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి.                 

    


మీన రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు చేపట్టిన పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలకు సమయం ఇవ్వవలసి వస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సోదరులనుండి నూతన సమాచారం సేకరిస్తారు వారితో కలిసి చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. కుటుంబసభ్యులతో కలిసి చేసిన పనుల మూలాన శ్రమతప్పకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో పెద్దల నుండి సలహలను తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం కలదు వారినుండి సహకారం లభించుట మూలాన చాలావరకు ఊరట చెందుతారు. స్త్రీ / పురుషసంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.


టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
humour interview