Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mass touch with nara rohit

ఈ సంచికలో >> సినిమా >>

మంచు హీరో 'సరదా'

manchu hero saradaa..
మంచు విష్ణు హీరోగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్‌ పతాకంపై ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో విష్ణు సరసన సోనారిక హీరోయిన్‌గా నటిస్తోంది. జి. కార్తీక్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కామెడీకు పెద్ద పీట వేయడం జరిగింది. ఇటీవల విడుదలైన యాక్షన్‌ సినిమా 'డైనమైట్‌' ఆశించినంత విజయాన్ని అందించకపోవడంతో మంచు విష్ణు దృష్టి వినోదాత్మక సినిమాలపై పడింది.

ఈ మధ్య ప్రేక్షకులు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో విష/్ణ హీరోగా వచ్చిన 'ఢీ' సినిమా ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పటకీ తెలుగు సినిమాకి అదే రకమైన ఫార్ములా కొనసాగుతోందంటే నమ్మక తప్పదు. అందుకే మళ్లీ ఆ తరహా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే ఈ 'సరదా' సినిమాను చేస్తున్నాడు విష్ణు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆధ్యంతం కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారనీ విష్ణు సరదా సరదాగా చెబుతున్నాడు. 
మరిన్ని సినిమా కబుర్లు
iswarya rai tripul dhamaka with rajinikanth