Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
iswarya rai tripul dhamaka with rajinikanth

ఈ సంచికలో >> సినిమా >>

'చిత్రాంగద' వెరీ వెరీ స్పెషల్‌

chitrangada very very special
అంజలి హీరోయిన్‌గా వచ్చిన 'గీతాంజలి' సినిమా హారర్‌ ఎంటర్‌టైనర్‌గా బాగానే పేరు తెచ్చుకుంది. అదే తరహాలోనే మరో ్‌ సినిమా 'చిత్రాంగద'లో నటించబోతోంది ముద్దుగుమ్మ అంజలి. 'గీతాంజలి'లానే ఈ సినిమా కూడా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ. కానీ గీతాంజలికి, ఈ సినిమాకు కథ, కథనాల పరంగా అస్సలేమాత్రం పొంతన ఉండదట. ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటోంది అంజలి. ఇలాంటి కథ తను ఎప్పుడు వినలేదని అంటున్న అంజలి, టెక్నికల్‌గానూ చాలా గొప్పగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని చెప్పింది.

అమెరికాలోని 9 రాష్ట్రాల్లో ఈ సినిమా షూటింగ్‌ చేయడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. కథ డిమాండ్‌ మేరకు రిచ్‌నెస్‌ కోసం, న్యూ ఫీల్‌ కోసం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరిస్తున్నారట. నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్‌' సినిమాకి దర్శకత్వం వహించిన జి. అశోక్‌ ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెలలో ఆడియో రిలీజ్‌ కానుంది. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam