Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar searching new stories

ఈ సంచికలో >> సినిమా >>

డిప్రెషన్‌లోకెళ్లిపోయిన హీరోయిన్‌

samanta in depression
 
సమంత అంటే నిన్న మొన్నటిదాకా గోల్డెన్‌ లెగ్‌ హీరోయిన్‌. ఈ బ్యూటీకి ఈ పేరు పవర్‌స్టార్‌ సినిమా 'అత్తారింటికి దారేది' తో ఫిక్స్‌ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ భామ కెరియర్‌ దబాలున పడిపోయింది. పాపం ఏది పడితే అదే మట్టయిపోతుంది. అల్లు అర్జున్‌, సమంత కాంబినేషన్లో వచ్చిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమా అంతంత మాత్రం అన్పించుకోవడంతో ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాల్లేవు ఈ అమ్మడికి. ప్రస్తుతం గోల్డెన్‌ హీరోయిన్‌ రకుల్‌ కాదన్న కారణంగా, మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' సినిమాలో ఒక హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చింది. ఇక తెలుగులో ఛాన్స్‌ వచ్చే అవకాశం లేదని తమిళంలో పాగా వేసింది సమంత.

కానీ అక్కడ కూడా పరాజయాలే చవి చూస్తోంది. విక్రమ్‌తో చేసిన '10 ఎండ్రతుకల్ల' సినిమా డిజాస్టర్‌ కావడంతో అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతుంది. పాపం ఇప్పుడు సమంత ఆశలన్నీ 'బ్రహ్మూెత్సవం' సినిమాపైనే. ఇది కూడా మెసేజ్‌ ఓరియెంట్‌డ్‌ మూవీ కాబట్టి మరి సమంత ఈ సినిమా ద్వారా ఇక టాలీవుడ్‌లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి మరి. 
మరిన్ని సినిమా కబుర్లు
prabhas missed bollywood entry