Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sardar on full josh

ఈ సంచికలో >> సినిమా >>

'అఖిల్‌' న్యూ యాంగిల్‌

akhil new angle
అక్కినేని అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మిస్తున్న 'అఖిల్‌' విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న 'అఖిల్‌' సినిమాకి ప్రమోషన్‌ ముమ్మరం చేశారు. భారీ స్థాయిలో సినిమాని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాత నితిన్‌. గ్రాఫిక్స్‌ వర్క్‌ విషయంలో రాజీ పడకపోవడం వల్లే దసరాకి విడుదలవ్వాల్సిన 'అఖిల్‌' దీపావళికి పోస్ట్‌ పోన్‌ అయ్యింది. ఇదిలా ఉండగా 'అఖిల్‌' సినిమాలో అక్కినేని అఖిల్‌ చేసే డాన్సులకు టీజర్‌, ట్రైలర్స్‌, సాంగ్‌ టీజర్స్‌తోనే మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది.

రిలీజ్‌కి దగ్గర పడ్డంతో సినిమాలోని ఎమోషన్‌ యాంగిల్‌ని కూడా ట్రైలర్స్‌ రూపంలో బయటపెడ్తున్నారు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా అఖిల్‌ అద్భుతంగా చేశాడని అర్థమవుతుంది. నటనలో అక్కినేని ఫ్యామిలీకి తిరుగేముంది? డాన్సుల్లో అయితే అక్కినేని ఫ్యామిలీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టేలా డాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లిపోయేలా చేశాడు 'అఖిల్‌'. యాక్షన్‌లో కూడా అఖిల్‌ అల్టిమేట్‌ అనిపించుకుంటాడట. ఈ హైప్‌తో అఖిల్‌ సెన్సేషనల్‌ రికార్డ్‌ తన ఖాతాలో వేసుకునే అవకాశముందని సమాచారమ్‌. 
మరిన్ని సినిమా కబుర్లు
increased trisha demand