Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ:  ఈ ప్రోగ్రామ్‌కి కూడా నువ్వే యాంకరింగ్‌ చేయాలి అని వరలక్ష్మితో అంటాడు తేజా. కెమెరా సెక్షన్‌కి ఫోన్‌ చేసి కెమెరామేన్‌ని వెబ్‌సైట్‌ పేజీల్ని షూట్‌ చేసేందుకు అర్జంట్‌గా తన క్యాబిన్‌ లోకి రమ్మంటాడు. కెమెరామెన్‌ వచ్చే లోగా దొరికిన కాస్త సమయంలో... నాకో డౌటు అని అంటుంది  వరలక్ష్మి తేజాతో. ఆ తరువాత..   

 

‘అదేంటీ సార్‌ ..అలా అంటున్నారు?’’

‘‘ఏమో... చనిపోయిన తర్వాత మనుషులు దెయ్యాలు కావొచ్చేమో?’’

‘‘అందుకే... ఆ దెయ్యం కోసం హాఫెనవర్‌ శ్లాట్‌ అడ్వాన్స్‌గా ఉంచమంటున్నాను. దెయ్యంతో మీరే ఎఫ్‌టుఎఫ్‌ చేద్దురు గానీ’’

‘‘ఇంతకీ ఎవరామె?’’

‘‘ఆమె మీకూ తెలుసు. వాగ్దేవి ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రతిమ’’

ఇప్పుడు అతడి కళ్లముందు రెండు టాస్క్‌లు. ఒకటి` ప్రతిమ డెత్‌ సీక్రెట్‌ పరిశోధించడం పాటు ప్రతిమలా కనిపిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఆరా తీయాలి. ప్రతిమలా కనిపిస్తున్న అజ్ఞాత వ్యక్తి... కనిపించిందంటూ చెప్తున్న ప్రాంతాల్లో ముఖ్యంగా రెండు. ఒకటి...

కోటి . పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌.   

సిద్దార్ధకి ఆనందరావు ఆ అమ్మాయి డిటెల్స్‌ చెప్తున్నప్పుడూ ఈ రెండు ప్రాంతాల్నే ప్రముఖంగా ప్రస్తావించాడు.

తన చెల్లెలు అర్చన కోటీ విమన్స్‌ కాలేజీ దగ్గర కనిపించిందని చెప్పింది.

ఇప్పుడు వరలక్ష్మి కూడా ఆ అమ్మాయిని చూసాననే చెప్తోంది. చూస్తే ఎక్కడ చూసింది.

అదే ప్రశ్న వేసాడు వరలక్ష్మిని తన క్యాబిన్‌కి మళ్లీ పిలిపించుకుని.

‘‘నాగార్జునసర్కిల్‌ దగ్గర..’’

‘‘ఎన్ని గంటలకు?’’

‘‘మార్నింగ్‌ లెవనో క్లాక్‌. నేనుండేది మెహదీపట్నంలో కదా! ఆఫీస్‌ క్యాబ్‌లో వస్తుంటే దార్లో నాగార్జున సర్కిల్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర టర్న్‌ తిరుగుతుంటే ఫ్లయ్‌ ఓవర్‌కి రైట్‌సైడ్‌ బిల్డింగ్‌లో ఒకట్రెండు సార్లు తను కనిపించింది.  విష్‌ చేద్దామనుకున్నా వేగంగా వెళ్తున్న కార్లో నేనున్నాను. తను ఆ బిల్డింగ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిల్చుని ఎటో చూస్తూ సెల్‌లో మాట్లాడ్తుతోంది’’

‘నిజంగా ఆమె ప్రతిమేనా?’’

‘‘అదేంటీ సార్‌ అలా అంటారు. ప్రతిమను నేనూ దగ్గర్నుంచి చూసాను. ఆమె కండక్ట్‌ చేసిన ప్రోగ్రామ్‌కి యాంకరింగ్‌ చేసాను. తనెక్కడ.. ఎంతమందిలో ఉన్నా కనిపెట్టగలను. ఆమె కచ్చితంగా ప్రతిమే’’అంది వరలక్ష్మి.

సిద్దార్థ వేసిన క్వశ్చన్లకి ఆనందరావు కూడా ఇలాంటి ఆన్సరే ఇచ్చాడు. తన డైరీలో ఉన్న ఫొటో చూసిన అర్చన కూడా ప్రతిమను చూసినట్లే చెప్తోంది. అయితే, అర్చన విషయంలో ఒక్కటే తేడా. వ్యక్తిగతంగా ప్రతిమను తనెరుగదు.

ప్రతిమ నిర్వహించిన ప్రోగ్రామ్‌కి వరలక్ష్మి యాంకరింగ్‌ చేసింది.

ఆమెని ఎరిగిన ఈ ఇద్దరూ, అసలు పరిచయమే లేని అర్చనతో సహా అందరూ ఆ అజ్ఞాత వ్యక్తిని ప్రతిమే అంటున్నారు.

సమాజం,  మీడియా దృష్టిలో ప్రతిమ చనిపోయింది.

భౌతికంగా ఆమె ఈ లోకంలోనే లేదు.

ఆమె మరణం కూడా ఏ నాలుగ్గోడల మధ్యనో సంభవించిన సహజ మరణం కాదు. యావత్‌ ప్రపంచానికి తెలిసేలా, అరగంటకోసారి మీడియా కోడై కూసేలా...నగరాన్ని ఓ కుదుపుకుదుపుతూ సంభవించిన మరణం.

ఓ రకంగా అది బలవన్మరణమే. అర్ధాంతరంగా చనిపోయిన ఆ ఘటన వెనుక నిజానిజాలు నిగ్గు తేల్చమంటూ ఓ పక్క బాస్‌ సూచిస్తుంటే... మరో పక్క అనూహ్యంగా ప్రతిమ లాంటి మరో మనిషి నగరంలో కనిపిస్తూ హడావుడి చేస్తోంది.

చూసిన వాళ్లు ఆమెని ప్రతిమే అంటున్న వాళ్లు కూడా ప్రతిమ మరణాన్ని కాదనడం లేదు. ఖండిరచడంలేదు. ఆమె చనిపోయిందని విశ్వసిస్తూనే... మరో పక్క ప్రతిమ బతికే ఉంది... చూసామంటున్నారు.

ప్రతిమ చావునిజమైతే ఆమె బతికుండడం అబద్దం. నిజంగా ఆమె బతికే ఉంటే చావడం అబద్దం. ఎన్నిసార్లు మళ్లీమళ్లీ అనుకున్నా... వాగ్దేవి క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసిన ప్రతిమ అనే పెళ్లికాని ఓ అమ్మాయి చనిపోవడం ముమ్మాటికి నిజం.

ఆ అమ్మాయి చనిపోవడం, బతకడమనే నిజాలనిపించే రెండు అంశాల మధ్యే ఈ కేసు మరింత సంక్లిష్టమైంది.

అంతేకాదు .. ఆమె ఇండికా కార్లోనే తిరుగుతోందని తెలుస్తోంది.

‘అంటే... సిటీలో తిరుగుతున్న ఇండికా కార్ల గురించి ఆచూకీ తీయాల్సిందే’ నిర్ణయానికొచ్చాడు తేజ.

ఆర్టీఐ ఆఫీసుకొచ్చాడు తేజ. అక్కడి ఆఫీసరొకరు తేజాకి బాగా తెలుసు. గతంలో చానెల్‌లో ‘ట్రాఫిక్‌ సమస్యల నివారణ`పౌరుల బాధ్యత’పేరుతో ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌కి వచ్చినప్పుడు పరిచయమయ్యాడు. ఇప్పుడతను తేజాను చూస్తూనే విష్‌ చేసి తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లాడు.

‘‘కాఫీ...?’’

‘‘నో... థాంక్స్‌’’ అన్నాడు తేజ. అతడు వద్దంటున్నా బాయ్‌ని పిలిచి కాఫీ ఆర్డరిచ్చాడా ఆఫీసర్‌.

‘‘చెప్పండి తేజా! మా ఆఫీసులో ఏదైనా పనుందా?’’

‘‘ఔను...’’  అంటూ ప్రతిమ కేసు వివరాలన్నీ చెప్పి` ‘‘సిటీలో తిరుగుతున్న ఇండికా కార్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని...’’  నసిగాడు.  నవ్వాడా ఆఫీసర్‌. ‘‘ఏం సార్‌... అలా నవ్వుతున్నారు? నేను తప్పుగా ప్రవర్తించానా?’’

‘‘నో...నో! నా నవ్వుకు అర్ధం అది కాదు. మీడియా ఎంతలా విస్తరించిందా? అని ఆలోచిస్తుంటే నవ్వొచ్చింది. నిజం తేజా! ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతిమ కేసు, ఇండికా కార్ల వివరాలు, ఇన్విస్టిగేషన్‌... అంతా పోలీసుల విధి. బాధ్యత. అయితే, క్రయింరిపోర్టర్‌గా నువ్వు చేస్తోంది రిస్క్‌. ఇదొక్కటే కాదు... మీడియా పర్సన్స్‌ అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పొలిటిషియన్ల ఆలోచిస్తున్నారు. స్టేట్స్‌మెన్‌ లాగా దేశభవిష్యత్‌కు వ్యూహ రచన చేస్తున్నారు. బ్యూరోకాట్స్‌లా పథకాలు, ప్రణాళికలు రచిస్తున్నారు. నీలా ఖాకీల అవతారమెత్తి క్రయిం కేసుల్లో నిజాలనిగ్గు తేలుస్తున్నారు’’అభినందనగా చూస్తూ అన్నాడతడు.

‘‘అచ్చం మీలాగే మా బాస్‌ కూడా అంటుంటారు. క్రయిం రిపోర్టర్లంటే ఖాకీ డ్రస్‌ వేయని పోలీసులు అని. ఆయన సజెస్ట్‌ చేసిన కాన్సెప్ట్‌ ఇది. పోలీసు ఠాణాల్లో మురిగిపోతున్న పాత కేసుల్ని తిరగదోడి ప్రజంట్‌ స్టేటస్‌తో అప్‌డేట్‌ చేసిన వార్తా కథనాల్ని వ్యూయర్స్‌కి అందించాలని ఆయన తపన, తాపత్రయం. అందుకోసం... జరిగిపోయిన ప్రతిమ కేసును మళ్లీ పరిశోధిస్తుంటే కొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. వెలికి వస్తున్నాయి.... అందులో భాగంగానే ప్రతిమో... అచ్చం ప్రతిమలాగా ఉన్న అమ్మాయినో వెతకాల్సిన పని నా మెడకు చుట్టుకుంది. అర్ధం చేసుకుని నేనడిగిన ఇండికా కార్ల వివరాలు ఇవ్వగలరా?’’ అభ్యర్ధించాడు తేజ. 

‘‘ఓ... ష్యూర్‌...’’ అంటూ టేబుల్‌ పై ఉన్న ఫోన్‌ తీసుకుని ఇంటర్‌ కమ్‌లో అసిస్టెంట్‌తో మాట్లాడాడు.  ఇంతలో కాఫీ తెచ్చాడు ఆఫీస్‌ బాయ్‌. చెరో కప్పు తీసుకుని సిప్‌ చేస్తూ లోకాభిరామాయణం కాసేపు ముచ్చటించుకున్నారు. తర్వాత ఆ ఆఫీసర్‌ సూచించిన విధంగా అసిస్టెంట్‌ దగ్గరికి వెళ్లాడు తేజ.

‘‘రండి... ఈ సిటీలో కార్ల వివరాలు ఇలా ఉన్నాయి... అంటూ కంప్యూటర్‌లోకి చూస్తూ వివరాలిస్తున్నాడు. మారుతి, అంబాసిడర్‌... ఇలా ప ప్రతి కంపెనీ కారు గురించి చెప్తుండగా... ఆ మధ్యనే అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తి ఆగిపోయిందన్న వార్త గుర్తొచ్చి కించిత్‌ బాధనిపించింది తేజాకి. ‘అంబాసిడర్‌ భారతీయ కార్లకు ప్రతీకగా నిలిచింది. హుందాతనానికి నిర్వచనం చెప్పింది’అనుకున్నాడతడు. తర్వాత `‘‘అన్ని కార్ల వివరాలు వద్దు.  ఒక్క ఇండికా కారు గురించే చెప్పండి. ఆ కార్లు ఎన్ని ఉన్నాయో.... ఓనర్లెవరో తెలిస్తే చెప్పండి’’ అడిగాడు తేజ. ఆ అసిస్టెంట్‌ ఇచ్చిన వివరాలు నోట్‌బుక్‌లో రాసుకుంటుంటే కొత్త అనుమానాలొచ్చిపడ్డాయి తేజాకి. సిటీలో తిరిగే ఇండికా కార్ల సంఖ్య తెలుసుకున్నంత మాత్రాన లభించే ప్రయోజనం ఏంటీ? పరిశోధన అంటే చీకట్లో నల్లపిల్లిని వెతకడమేనని ఒకప్పుడు సిద్దార్ధ తనతో అన్నాడు. చీకట్లో కనిపించే ఆ నల్లపిల్లి రూపం, బరువుఅంచనావేసివ్యూయర్స్‌కిఅందించడమేమీడియాపనిఅనితనుకూడాకౌంటర్‌విసిరాడు. అయితే,

మలాకనిపించేఆఅమ్మాయిప్రయాణిస్తున్నఇండికాకారునిజానికిఆఅమ్మాయిదేనా? కారు ఓనర్‌ షిప్‌ ఆ అమ్మాయి పేరు మీదే ఉందా? లేక, తన తండ్రో, సోదరుడి పేరు మీద ఉందా? తరచూ పంజగుట్ట నాగార్జున సర్కిల్‌, కోటీ హరిద్వార్‌ ప్రాంతాల్లో కనిపిస్తుందన్న సమాచారం మేరకు ఆ అమ్మాయి ఈ సిటీకి చెందినదేనా? ఎన్నో ప్రశ్నలు. ఆర్టీఐ కార్యాలయంలో తెలిసిన ఆఫీసర్‌ ఉండబట్టి ఇండికా కార్ల సమాచారం తాను అందుకోగలుగుతున్నాడు. కానీ ... అసలు వ్యక్తిని, ఆమె చిరునామాను వెతికి పట్టుకునే క్రమంలో తను వెళ్తున్న దారి సరైన దేనా?  ఆలోచనలకు అనుమానపు సెగ తాకింది.


‘‘సిటీలో ఇరవై వేల ఇండికా కార్లున్నాయి. ఒక్కోకారునంబరు, ఓనర్‌, అడ్రస్‌... తదితర వివరాలు అవసరమా? అలాగైతే ప్రింట్‌ అవుట్‌ ఇస్తాను’’ చెప్పాడతను.

ఎందుకో తను చేస్తున్న పరిశోధన ఫలితానివ్వదనిపించింది తేజాకి. ‘‘నిజాలు పరిశోధించాలంటే సహనం చాలా కావాలి. అందుబాటులోకి వస్తున్న ఒక్కో సమాచారాన్ని విశ్లేషిస్తూ గమ్యం వైపు అడుగేయాలి. ఈ విషయాల్లో పోలీసులు, డిటెక్టివ్‌లు చేస్తున్న కృషి అభినందనీయం...’’అనుకున్నాడు తేజ.

‘సహకారమందించినందుకు థాంక్స్‌. వస్తా’’ అంటూ అతడికి షేక్‌ హ్యాండిచ్చి ఆఫీస్‌ ఆవరణలో పార్క్‌ చేసిన తన బైక్‌ దగ్గరికి వచ్చాడు తేజ. ‘‘చనిపోయిన ప్రతిమ బతికి మన మధ్యే తిరుగుతోందంటూ బాగా తెలిసిన వాళ్లే తనతో చెప్తున్నారు. యాంకర్‌ వరలక్ష్మి అయితే ఏకంగా ఆ అమ్మాయితో స్పెషల్‌ ప్రోగ్రామే చేసుకుంటే బాగుంటుందంటూ సజెస్ట్‌ చేస్తోంది. చెల్లాయి ప్రతిమని వదినంటూ ఆటపట్టిస్తోంది.  ఆనందరావు అయితే అజ్ఞాత ప్రతిమను వెతికి పట్టుకోమంటూ డిటెక్టివ్‌నే ఆశ్రయించాడు. ప్రతిమ చనిపోయింది. మరి, ప్రతిమలా కనిపిస్తున్న ఆమె ఎవరు? ఆమె ఎవరు?’’

ఎదురుగా రెడ్‌ సిగ్నల్‌ పడడంతో సడన్‌ బ్రేక్‌ వేసి బైక్‌ని ఆపాడు తేజ. అతడి పక్కనే ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగింది. ఆ కారు ఇండికా కారు. డ్రయివింగ్‌ సీట్లో ఉన్న ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆశ్చర్యపోయాడు తేజ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam