Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
prbhas appreciated rashi khanna

ఈ సంచికలో >> సినిమా >>

టైగర్‌ రాణి బికినీ వేసిందందుకేనంట

rashikhanna with bikinee

'బెంగాల్‌ టైగర్‌' సినిమాతో పెద్ద హీరో రవితేజ పక్కన హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీ పడేందుకని ఏదో మ్యాజిక్‌ చేయాలనుకుందట. అందుకే ఈ భామ బికినీ ద్వారా తను చాలా హాట్‌ అని ప్రూవ్‌ చేసుకుంది. ఇదివరకు తనకి బికినీ వెయ్యడం అంటే ఇష్టం లేదనీ, గ్లామర్‌గా కనిపిస్తాను కానీ బికినీ మాత్రం వెయ్యను అని చెప్పిన ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి అని అడుగుతుంటే.. ఇప్పుడు ఏమంటోందో తెలుసా? సినిమాలో పాత్ర డిమాండ్‌ చేసింది అందుకే వెయ్యక తప్పలేదు అంటోంది సుకుమారంగా నవ్వుతూ..

ఇక నుండి ఎంత గ్లామర్‌గా కనిపించాలో అంత గ్లామర్‌గా కనిపిస్తాను. గ్లామరే నాకు సక్సెస్‌ని తెచ్చిపెట్టింది. తప్పదు హీరోయిన్లు అంటే గ్లామర్‌గా కనిపిస్తేనే సినిమాకు అందం అని గ్లామర్‌ పాఠాలు చెబుతోంది టైగర్‌ రాణి. ఈ ధైర్యమంతా 'బెంగాల్‌ టైగర్‌' ఇచ్చిన విజయం వల్లనే కాబోలు సుమీ. టోటల్‌గా తనకున్న గ్లామర్‌తో సక్సెస్‌ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. మిల్కీ బ్యూటీకి గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఇకపై రాశీఖన్నా నుండి మరింత గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయెచ్చన్న మాట చెప్పకనే చెప్పేసింది కూడా. ప్రస్తుతం రాశీఖన్నా సాయి ధరమ్‌ తేజ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీం' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
mahesh entry with new look