Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sudhamadhuram

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంక్రాంతి శుభాకాంక్షలు - బన్ను

sankranti wishes

ఈ మధ్య మా ఫ్రెండ్ తో మాట్లాడుతూంటే ఓ టాపికొచ్చింది.. వాళ్ళావిడ పుట్టింటికి వెళ్తూ వండిన పదార్థాలన్నీ ఫ్రిజ్ లో చక్కగా అమర్చి వెళ్ళిందట....వీడేమో వాటిని రోజుకింత తినే క్రమంలో, ఆవిడ పుట్టింటికెళ్ళిన తెల్లారి ఫ్రిజ్ లోంచి తీసి తినే సరికీ....ఆరోజే వండినట్లుగా ఉన్నాయట.....ఆ తెల్లారి తీసి తినేసరికీ రెస్టారెంట్ లో తిన్నట్టుగా ఉన్నాయట.....ఆ మర్నాడు కాస్తా రుచి చూసేసరికీ, మెస్ లో తిన్నట్టుందట.....ఇంత వరకూ చెప్పి కాస్తాగాడు....ఒక చిన్న విరామం తర్వాత, మరింత ఉత్సుకత కలిగించేలాగా మొదలుపెట్టాడు... మరి నాలుగోరోజు తీసి తిని చూద్దును కదా....ఎలా ఉందనుకుంటున్నావ్? అంటూ ప్రశ్న సంధించి నాలో ఉత్సుకతను మరింత పెంచాడు.....బహుశ: ప్లాట్ ఫాం మీద తిన్నట్టుందేమో అనుకుని అదే చెప్పబోయాను.....నా అంచనాలను తలకిందులు చేస్తూ వాడే చెప్పేశాడు...." అచ్చు ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్టుందిరా " అంటూ......ముందు ఆశ్చర్యపోవడం, ఆ తర్వాత హాయిగా నవ్వేసుకోవడం నా వంతయింది......


ఆ నవ్వుల్లోంచి తేరుకున్నాక మళ్ళీ తనే, " ఈ మధ్య మా అబ్బాయి క్లాసు పుస్తకాలు తియ్యడమే లేదురా.....ఎంత తిట్టినా అస్సలు చదవడే...." అంటూ వాపోయాడు....." అవునవును ఈకాలం కుర్రాళ్ళతో ఇదే వచ్చిన చిక్కు....ఎంతసేపూ ఆ ఫేస్ బుక్కూ...వాట్సప్పూ...." అంటూ నేనేదో అనబోయాను.....ఇంతలో మళ్ళీ వాడే కంటిన్యూ చేసాడు.... " వాడు పుస్తకం తీయక పోతే, నేనూరుకుంటానా, నేను వాడి బాబుని...పట్టువదలని విక్రమార్కుడిని........" మా ఫ్రెండుతో ఇదే గొప్ప సౌకర్యం....ప్రశ్న వాడే వేస్తాడు...సమాధానాలూ వాడే ఇస్తాడు....సమస్య వాడే చెప్తాడు, సమధానమూ చెప్తాడు.... సరే వాళ్ళబ్బాయితో ఎలా చదివించాడో వాడి మాటల్లోనే విందాం......" వాడి క్లాసు పుస్తకాలన్నీ నా స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు తీసి ఎంచక్కా వాడికి వాట్సప్ లో పంపించా.....వెధవ....వాట్సప్ లో వచ్చిన మెస్సేజ్ ఏదైనా చదవకుండా వదలడుగా...పేజీపేజీ చదువుతున్నాడు...." మళ్ళీ నవ్వడం నా వంతయింది....మీరూ మనస్పూర్తిగా నవ్వుకోండేం.....సంక్రాంతి శుభాకాంక్షలతో మీ బన్ను.

మరిన్ని శీర్షికలు
all about small screen