Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

11-03-2016 వరకు 17-03-2016 వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మిత్రులతో కలిసి విలువైన నిర్ణయాలు తీసుకోండి వాటిని విజయవంతంగా అమలుచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది అవి కలిసి వస్తాయి. దూరప్రాంతం నుండి విలువైన సమాచరం సేకరిస్తారు. బదువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. విందులలో అలాగే వినోదాలలో సమయాన్ని గడుపుతారు. మీయొక్క మాటతీరు మూలాన కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. సంతానం మూలాన నలుగురిలో గుర్తింపును పొందుతారు. కుటుంబంలో ఊహించని మార్పులకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట ఉత్తమం.       

 

   

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద  ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. తలపెట్టుపనుల విషయంలో ఆశించిన ఫలితాలు రావడానికి నలుగురిని కలుపుకొని వెళ్ళండి. స్వల్ప దూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది అవి కలిసి వస్తాయి. ధనమునకు సంభందించిన విషయాల్లో మీయొక్క ఆలోచనలు నిదానంగా ఫలితాలను కలుగజేసే అవకాశం కలదు. కుటుంబసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీప్రయాణాల గురుంచి మీరు చేసే పనులు ఫలితాలను కలుగజేస్తాయి. సంతానపరమైన విషయాల్లో సంతృప్తి ఉంటుంది వారినుండి గౌరవాన్ని పొందుతారు. అనవసరమైన చర్చలకు కాస్త దూరంగా ఉండుట వలన విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. దైవసంభంద పనులకు సమయం ఇవ్వడం మంచిది. 

                       

మిథున రాశి : .ఈవారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు అలాగే పనులకు సమయం ఇవ్వకండి. ప్రయాణాల కోసం ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఒక కోలిక్కి వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయాలను పూర్తిగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. బంధువులతో కలిసి చేపట్టుపనుల విషయంలో కాస్త జాగురుకత అవసరం. సంతానం వలన కొన్ని ఇబ్బందులు కలిగిన అవి తొలిగిపోవుట వలన ఊరట చెందుతారు. వాహనముల వలన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులకు అవకాశం ఉంది.     

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలను కలిగి ఉండి వాటికి సమయాన్ని ఇస్తారు. నూతన పరిచయాలకు అవకాశం కలదు వారితో కలిసి పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు , మాటతీరు విషయంలో కాస్త సరిచుకోండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి. నచ్చిన పనుల విషయంలో స్పష్టమైన విధానం కలిగి ఉండి ముందుకు వెళ్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది పెద్దవాళ్ళను కలుస్తారు. కుటుంబంలో ఊహించని మార్పులకు అవకాశం ఉంది స్వాగతించుట ఉత్తమం. తల్లితరుపు బందువుల నుండి మీరు తెలుస్కోనే విషయాలు మిమ్మల్ని కాస్త ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం మీ భాద్యత   

            


సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు పొందుతారు కాకపోతే అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం అనేది సూచన. ఉద్యోగంలో మార్పులకు అవకాశం  అనుకూలమైన మార్పులు ఏర్పడుతాయి. కుటుంబసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు కొన్ని కొన్ని మార్పులకు అవకాశం ఇస్తాయి. మీయొక్క మాటతీరు కొంతమందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. వాహనముల మూలాన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యంపైన శ్రద్దవహించుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన వైకరిని కలిగి ఉండుట ఉత్తమం. అనవసరమైన చర్చలకు కొంత దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.    

 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద  ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన మార్పులకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది కావున సరైన నిర్ణయాలు తీసుకోవడం మేలు. చేపట్టుపనుల విషయంలో స్పష్టమైన ఆలోచన అవసరం. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేయుట సూచన. ప్రయాణాలు వాయిదావేయుట ఉత్తమం. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చర్చాసంభందమైన విషయాలకు దూరంగా ఉండుట ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం చేయండి. వ్యాపారపరమైన విషయాలలో నూతన పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. 

 

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరు అలాగే ఆలోచన విధానం చాలావరకు ఫలితాలను నిర్దేశిస్తుంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నచ్చిన సమాచరం పొందుతారు వాటికి సమయం ఇస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులతో స్రడుబాటు విధానం కలిగి ఉండకపోతే నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికపరమైన సాధరణఫలితాలు సూచితం కొన్ని కొని విషయాల్లో కష్టాలు తప్పవు. ఆలోచనలు అదుపులో ఉంచుకొనుట అలాగే చేసే పనుల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట మంచిది. దూరప్రదేశం నుండి సంతోషకరమైన వార్తను వింటారు. సంతానపరమైన విషయల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. వాహనముల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును జాగ్రత్త అవసరం.  
 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద సామాజిక సేవాకార్యక్రమాలకు సమయం ఇస్తారు అలాగే మీ ఆలోచనలు నలుగురికి ఉపయోగపడే పనులను చేపడుతారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేయవలసి రావోచ్చును వారికి అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం ఉత్తమం. పనిభారం ఉంటుంది ప్రణాళికా బద్దంగా నడుచుకొనుట మేలు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పొందుతారు. కుటుంబంలో సభ్యులతో కలిసి వినోదలకు వెళ్ళుటకు ఆస్కారం కలదు సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఊహించని ఖర్చులను పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

 

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద తలపెట్టు పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. చర్చాసంభందమైన విషయాలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది కుటుంబసభ్యుల ఆలోచనలు వారియొక్క సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశాల నుండి ఒక వార్తను వినే అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు,సమయపాలన పాటించుట సూచన. సోదర/సోదరి సంభందమైన విషయాల్లో సర్దుబాటు విధానం వలన మేలుజరుగుతుంది. శుభకార్యక్రమాలలో పల్గ్గోనే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు పాటించుట వలన మిత్రులు లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో సత్సంభందాలు కలిగి ఉండుట ఉత్తమం.        

 

 

మకర రాశి  :ఈవారం మొత్తంమీద బాగుంటుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. శక్తికి మించిన పనులను చేపట్టుట వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. స్త్రీ సంభందమైన విషయాలలో ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు కాకపోతే అతిగా ఊహించుకోవడం చేయకండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు ఈ విషయంలో దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇవ్వండి.   

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు వారినుండి ఆశించిన సహకారం లభించుట ఊరట చెందు విషయం. ఉద్యోగంలో బాగుంటుంది మీయొక్క ఆలోచనలు మిమ్మల్ని నలుగురిలో గౌరవింపబదేలా చేస్తాయి. వ్యాపారపరమైన విషయాలలో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విలువైనవస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది వాటికి సమయాన్ని వెచ్చిస్తారు. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుతాయి కావున సమయానికి భోజనం చేయుట అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి ఆదిశగా ఆలోచించే వారు ప్రయత్నం చేయుట ఉత్తమం. మానసికంగా దృడంగా ఉండుట దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది.   

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద వాహనముల మూలాన అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట మంచిది. నలుగురితో కలిసి పనిచేయడం అనే లక్షణం వలన ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటి విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. నిదానంగా వ్యవహరించుట అవసరం. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు విధానం అవసరం. పెద్దలనుండి వచ్చు సహకారం మిమ్మల్ని కొంత ముందుకు వెళ్ళేలా చేస్తుంది.

మరిన్ని శీర్షికలు
Kothimeera Pachhadi